కేవలం రూ.64,900 లకే కొత్త 'హోండా షైన్'.. అపోజిట్ బైక్స్ కి ఇక చుక్కలే..!!
100సీసీలలో హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన స్ప్లెండర్ బైక్ ని కొట్టే మరో బైక్ లేదు. ఎన్నో కంపెనీలు దానికి ధీటుగా బైక్స్ ని పరిచయం చేసినా అవి సక్సెస్ కాలేదు. స్ప్లెండర్ కి పోటిగా తాజాగా హోండా సరికొత్త బైక్ ని ప్రవేశ పెట్టింది. అతి తక్కువ ధరకే దీనిని ఆ సంస్థ తీసుకువస్తుంది. ఆ బైక్ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలోని మొత్తం మోటార్‌సైకిల్ అమ్మకాలలో 100cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్ 33% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ 33%లో ఎక్కువ భాగం హీరో మోటోకార్ప్‌కు చెందినవే కావటం విశేషం. అందులో స్ప్లెండర్ కు గిరాకీ చాలా ఎక్కువ. ఈ బైక్ నెలవారీ అమ్మకాలు దాదాపు 2.5 లక్షల యూనిట్ల వరకు ఉంటుంది. హోండాకు ఈ విభాగంలో పట్టులేదు. తద్వారా మోటార్‌సైకిల్ మార్కెట్‌లో 1/3వ వంతు హీరోదే పై చేయి. షైన్ 100 లాంచ్‌తో, హోండా స్ప్లెండర్ స్థానాన్ని భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మార్కెట్ వాటాను పెంచుకునేందుకు..
హోండాలో యాక్టీవా స్కూటర్ బాగా ప్రాచుర్యం పొందింది. దాని తర్వాత షైన్ ఆస్థానాన్ని ఆక్రమించింది. ఇదే సక్సెస్ మంత్రాన్ని హోండా కొనసాగించనుంది. CB షైన్ 125 ప్రస్తుతం హోండా లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్, 125cc సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్ గా కూడా ఇదే బైక్ కొనసాగుతోంది. 100cc షైన్ ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో 15-20% మార్కెట్ వాటాను పొందగలిగితే, దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించనుంది. హోండా తమ కొత్త 100సీసీ మోటార్‌సైకిల్ కోసం షైన్ బ్రాండింగ్‌పై ఆధారపడుతోంది.
బైక్ కొనుగోళ్లలో కస్టమర్లు ముందుగా కీలకమైన మైలేజ్, ధరపై ఫోకస్ చేస్తారు. అందులో భాగంగానే స్ప్లెండర్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణాలలో ఇవి కీలక అంశాలుగా చెప్పవచ్చు. అధిక మైలేజ్ దాదాపు 65+ కిమీ వరకు అందిస్తుందని చాలా మంది స్ప్లెండర్ వినియోగదారులు వెల్లడించారు. కస్టమర్లకు మరింత విశ్వాసాన్ని పొందేందుకు ఈ బైక్ సహకరించనుంది. హోండా కొత్త షైన్ 1000ccతో క్లాస్ మైలేజీతో అత్యుత్తమంగా ఆఫర్ చేస్తుందని సంస్థ పేర్కొంది.

5 కలర్లలో లభ్యం..
ఇక ధర విషయానికి వస్తే హోండా షైన్ 100cc బైక్ చౌకైన వాటిలో ఒకటిగా నిలువనుంది. స్ప్లెండర్ ఒకప్పుడు సరసమైన ధరలో లభించేది. అయితే ఇటీవలి కాలంలో ధరలు భారీగా పెరిగాయి. దీనికి ప్రత్యామ్నాయంగా కొందరు వేరే బైక్స్ ని కొనుగోలు చేశారు. స్ప్లెండర్ ధరలు రూ. 72,000 (ఎక్స్-ష్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతున్నాయి. హోండా షైన్ 100ని అంతకంటే తక్కువ ధరలో రూ. 64,900 (ఎక్స్-షోరూమ్)కే లభించనుంది. ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్‌లో పెద్ద ఈ బైక్ ధర ఆసక్తిని రేపుతోంది.
హోండా షైన్ 100 5 కలర్ ఆప్షన్‌లలో రానుంది.(బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్ అండ్ బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్) కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఆకర్షణీయమైన ఫ్రంట్ కౌల్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, ప్రాక్టికల్ అల్యూమినియం గ్రాబ్ రెయిల్, బోల్డ్ టెయిల్ ల్యాంప్, సొగసైన ప్రత్యేక మఫ్లర్ మోటారు సైకిల్ ఆకట్టుకుంటుంది. HMSI షైన్ 100పై ప్రత్యేక 6-సంవత్సరాల వారంటీ ప్యాకేజీని (3 సంవత్సరాల ప్రామాణిక + 3 సంవత్సరాల ఐచ్ఛిక పొడిగించిన వారంటీ) కూడా అందిస్తోంది.
అధిక మైలేజీ..
సరికొత్త లైట్ వెయిట్ డ్యూరబుల్ డైమండ్ ఫ్రేమ్‌తో నిర్మించబడిన కొత్త హోండా షైన్ 100 677 మిమీ పొడవు, 786 మిమీల సీట్ ను పొందవచ్చు. సరికొత్త హోండా గ్రామీణ మార్కెట్ పై ఎక్కువ దృష్టి సారించినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజీని అందించడంతో పాటు స్ప్లెండర్ కంటే ఎక్కువ ఫీచర్లు కిలిగి ఉండటం గ్రామీణ మార్కెట్లలో కస్టమర్లపై గణనీయమైన ప్రభావం చూపే అంశాలుగా ఉన్నాయి.

కొత్త 100cc ఇంజన్ ఫ్యూయెల్ ఇంజెక్షన్‌తో పాటు రానుంది. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చాలా స్మూత్‌గా స్టార్ట్ అవుతుంది. సైడ్ స్టాండ్ ఉంటే ఇంజన్ స్టార్ట్ అవ్వదు. ఇది సౌకర్యవంతమైన, నిర్లక్ష్య రైడ్‌ను ఇవ్వనుంది. షైన్ 100లో ప్రతి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా సౌకర్యవంతంగా చేస్తుంది. ఈక్వలైజర్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS)ను దీనికి జోడించారు.
హోండా రాబోయే 100cc బైక్ ఫీచర్స్ స్ప్లెండర్ ప్లస్‌కి చాలా దగ్గరగా ఉన్నాయి. 97.2 cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ మోటార్‌తో ఈ బైక్ పనిచేస్తుంది. 8 bhp వద్ద 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఈ బైక్ విడుదల చేస్తుంది. ఇది 4-స్పీడ్ స్థిరమైన మెష్ గేర్‌బాక్స్‌తో రానుంది. స్ప్లెండర్‌తో పాటు, 100cc బైక్ HF డీలక్స్, HF 100, బజాజ్ ప్లాటినా 100సీసీ బైక్ లకు కొరకరాని కొయ్యగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








