Honda Shine బైక్‌ రికార్డు స్థాయి విక్రయాలు.. సంస్థ కీలక ప్రకటన

భారత్‌లో బైక్‌లు కొనుగోలు చేసే సమయంలో అత్యధిక శాతం మంది ప్రజలు ధర, మైలేజీ గురించే ఎక్కువగా ఆలోచన చేస్తారు. సంస్థలు కూడా ఈ మధ్యతరగతి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా బైక్‌లను విడుదల చేస్తుంటాయి.

హోండా షైన్ బైక్‌ (Honda Shine Bike) తాజాగా సరికొత్త మైలురాయిని దాటింది. మైలేజీ, డిజైన్‌ సహా సరసమైన ధర భారీగా ఆదరణ పొందింది. ఫలితంగా పశ్చిమ భారత రాష్ట్రాల్లో 30 లక్షల హోండా షైన్‌ బైక్‌లను విక్రయించినట్లు హోండా సంస్థ వెల్లడించింది. 125cc సెగ్మెంట్‌లో మరెన్నో బైక్‌లు ఉన్నా హోండా షైన్‌ మాత్రమే ఈ రికార్టు సృష్టించింది.

Honda Shine bike 30 lakh sales record

30 లక్షల హోండా షైన్‌ బైక్‌లను విక్రయించినట్లు హోండా మోటార్‌సైకిల్‌ మరియు స్కూటర్‌ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. ఈ మైలురాయిని దాటేందుకు తమకు 17.5 సంవత్సరాలు సమయం పట్టినట్లు పేర్కొంది. తొలి 11 సంవత్సరాల్లో 15 బైక్‌లు విక్రయించగా.. అనంతరం కేవలం 6.5 సంవత్సరాల్లో మరో 15 లక్షల షైర్‌ బైక్‌లను విక్రయించినట్లు పేర్కొంది.

భారత్‌ మార్కెట్‌లో హోండా తొలిసారిగా షైన్‌ బైక్‌ను విడుదల చేసిన సమయంలో.. 125cc సెగ్మెంట్‌లో బజాజ్‌ డిస్కవరీ, హీరో హోండా గ్లామర్‌, హీరో హోండా సూపర్‌ స్ప్లెండర్‌, యమహా గ్లాడియేటర్‌ సహా మరిన్ని వాహనాలు ఉన్నాయి. అయితే ఈ వాహనాలన్నింటిని అధిగమించిన హోండా షైన్‌.. గరిష్ఠ విక్రయాల మైలురాయిని చేరుకుంది.

Honda Shine bike sales record

కస్టమర్ల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా హోండా షైన్‌ బైక్‌లో అనేక మార్పులు చేశారు. కస్టమర్ల కూడా షైన్‌ బైక్‌పైన మంచి నమ్మకం ఏర్పడింది. ఫలితంగా అనంతర కాలంలో విక్రయాలు జోరందుకున్నాయి. కేవలం 17.5 సంవత్సరాల్లో 30 లక్షల విక్రయాల మైలురాయిని చేరుకుంది.

హోండా షైన్‌ మోటార్‌సైకిల్‌ 124cc సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్ కూల్డ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 4- స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అనంతరం మెరుగైన పనితీరు కోసం 5- స్పీడ్‌ గేర్‌బాక్స్‌కు అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ మార్పులు తర్వాత షైన్‌ వాహనాలకు డిమాండ్ మరింత పెరిగింది.

Honda Shine

* ప్రస్తుత పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు విక్రయాలను పెంచుకొనేందుకు హోండా SP125 మోటార్‌ సైకిల్‌ స్పోర్ట్స్‌ వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. స్పెషల్ ఎడిషన్‌ బైక్‌ల మాదిరిగానే.. హోండా SP125 స్పోర్ట్స్‌ ఎడిషన్‌ స్డాండర్డ్‌ మోడల్‌ కొన్ని డిజైన్‌ మార్పులను కలిగి ఉంది. గ్రాఫిక్స్‌ సహా ఇతర డిజైన్‌ మార్పులు చేశారు.

హోండా SP125 మోటార్‌ సైకిల్‌ రెండు రంగుల్లో లభిస్తుంది. బ్లూ మెటాలిక్‌ మరియు హెవీ గ్రే మెటాలిక్‌ మరియు హెవీ గ్రే మెటాలిక్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. పండుగ సీజన్‌లో భారీ స్థాయిలో విక్రయాలు నమోదు చేయాలని వాహనాల తయారీ సంస్థలు భావిస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 18, 2023, 11:35 [IST]
English summary
Honda shine sales crossed 30 lakh units in western india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+