Honda Shine 100 త్వరలోనే హోండా షైన్100 అమ్మకాలు షురూ.. స్థానిక డీలర్‌షిప్‌లకు చేరుకున్న బైక్స్..!

హీరో స్ప్లెండర్ కి పోటీకి తీసుకువచ్చిన హోండా షైన్ 100 బైక్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కర్ణాటకలోని హోండా ఫ్యాక్టరీ నుంచి స్థానిక డీలర్ షిప్ లకు బైకులు చేరుకుంది. ఆ తర్వాత త్వరలోనే డెలివరీలు ప్రారంభం కానున్నాయి. 100 సిసి విభాగంలో తన సత్తాను చాటేందుకు హోండా ఈ సరికొత్త బైక్ ను ప్రవేశపెట్టింది.

షైన్100 హోండా నుంచి 100cc కమ్యూటర్ సెగ్మెంట్‌లో ఎంట్రీ మోడల్ గా విడుదల కానుంది. హోండా మోటార్స్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న షైన్ 125 మోడల్ ఆధారంగా దీనిని రూపొందించారు. కొత్త షైన్ ఫ్లాట్, స్లిమ్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్ పీస్ సీటును పొందుతుంది.

honda shine 100

100 సీసీ సామ‌ర్థ్యం లోపు బైక్స్ ల విక్ర‌యాలలో 80 శాతం వాటాను హీరో మోటార్స్ కలిగి ఉంది. ఈ సంస్థ నుంచి స్ప్లెండ‌ర్‌, హెచ్ఎఫ్ డీల‌క్స్ టాప్ లో ఉన్నాయి. హోండా మోటార్స్ నుంచి స్కూట‌ర్ల‌లో బెస్ట్ సెల్లింగ్ వెహికిల్ గా యాక్టీవా నిలిచింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో 17 ల‌క్ష‌ల‌కు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. అయినా స్ప్లెండ‌ర్ కంటే ఈ సంస్థ వెనుక‌బ‌డి ఉంది.

ఇది 98.9cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ మోటార్ తో పనిచేస్తుంది. 7.61bhp వద్ద 8.05Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది నాలుగు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ స్ప్రింగ్‌లు, CBSతో ముందు వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్‌తో వస్తుంది. ఏకకాలంలో బైక్ను నిలిపి వేసేందుకు ఇది ఉపయోగపడనుంది. ఖర్చు-పొదుపు ప్రయోజనాల కోసం ట్యూబ్‌లెస్ టైర్‌లకు బదులుగా షైన్ 100 కోసం ట్యూబ్డ్ టైర్‌లను ఇవ్వనుంది.

honda shine 100cc

బల్బ్ ఇండికేటర్‌లతో కూడిన హాలోజన్ హెడ్‌లైట్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్‌తో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లతో వస్తుంది. ఎంత మైలేజ్ ఇస్తుంది అనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు అయితే 60-70 kmpl వరకు ఇవ్వగలదని అంచనా. 100cc ఇంజన్‌కు ఫ్యూయల్ ఇంజెక్షన్, సోలనోయిడ్ తో వస్తుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్‌ను ఈ బైక్ లో పొందుపరిచారు.

హోండా షైన్ 100ని మొత్తం 5 కలర్లలో లభిస్తుంది. రెడ్, గ్రీన్, బ్లూ, గోల్డ్, గ్రే కలర్ ఆప్షన్లలో ఈ బైక్ లభించనుంది. పూర్తి బ్లాక్ బాడీ ప్యానెల్స్‌తో ఉంటుంది. హోండా షైన్100 ధర రూ.64,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందుబాటులో ఉండనుంది. ఇది హీరో స్ప్లెండర్ తో పోల్చుకుంటే రూ.8,000 తక్కువగా రానుంది.

honda shine turn indicators

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకులతో పోలిస్తే అతి చదవక లభించే 100 సిసి బైక్ గా హోండా షైన్ నిలువనింది. ఈ సెగ్మెంట్లో కింగ్ మేకర్ గా ఉన్న హీరో మోటార్స్ ను ఢీకొట్టేందుకు హోండా దీనిని ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం 125 సెగ్మెంట్లో హోండా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. కాకపోతే మొత్తం సేల్స్ లో హీరో మోటార్స్ ను అధిగమించలేక పోవడం గమనార్హం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, May 6, 2023, 11:32 [IST]
English summary
Honda shine100cc arrives at the dealerships delivery begins soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+