అంచనాలకు మించిన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలైన హోండా SP 160 ఫుల్ రివ్యూ వీడియో
హోండా మోటార్స్ నుంచి ఇటీవలే షైన్ 100 బైక్, డియో 125 స్కూటర్‌ను విడుదల కాగా తాజాగా తన లైనప్‌లో అధునాతన ఫీచర్లతో SP 160 బైక్‌ను విడుదల చేసింది. ఇది కస్టమర్లకు సింగిల్, ట్విన్ డిస్క్ వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ధర వేరియంట్ల ప్రకారం రూ. 1.17 లక్షలు మరియు రూ. 1.22 ఎక్స్-షోరూమ్ ధరల్లో అందుబాటులో ఉంది. ఇక్కడ మీరు ఫుల్ రివ్యూ వీడియో చూడవచ్చు.
హోండా SP 160 బైక్ డిజైన్ విషయానికొస్తే ఇది పెద్ద మోటారును కలిగి ఉంది. బాడీ ప్యానెల్ డిజైన్ 'SP 125' బైక్‌ను పోలి ఉంటుంది. ఆకర్షణీయమైన V- ఆకారపు LED హెడ్‌లైట్, కొంచెం వెడల్పుగా ఉండే ఇంధన ట్యాంక్, సింగిల్ పీస్ సీట్, సింగిల్ గ్రాబ్ రైల్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్ మఫ్లర్, క్రోమ్ షీల్డ్ ఉన్నాయి. SP 160 బైకు యునికార్న్ మోటార్ సైకిల్ ఆధారిత ఇంజిన్‌తో వస్తుంది.
ఇందులోని 162.7 cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ గరిష్టంగా 13.46 bhp శక్తిని, 14.58 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, SP 160 బైక్ యునికార్న్ కంటే 0.5 Nm ఎక్కువ టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఎంపికతో అందుబాటులో ఉంది. డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, హజార్డ్ స్విచ్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హోండా SP 160 బైక్ 6 కలర్స్‌లో అందుబాటులో ఉంది. మాట్ డార్క్ బ్లూ మెటాలిక్, పెర్ల్ స్పార్టన్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నైట్ బ్లాక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే వంటి ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలు చేవచ్చు. సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఈ బైక్ విడుదల అయ్యింది. డెలివరీలు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయి.


Click it and Unblock the Notifications








