ఆగష్టులో మార్కెట్‌లోకి రానున్న హోండా SP 160.. ఇక ఆ బైక్‌లకు గట్టి పోటీ.!
దేశీయ ఆటో మొబైల్ రంగంలో హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో పాటు కొత్త ద్విచక్ర వాహనాల శ్రేణిలోనూ హోండా ముందడుగు వేసింది. ఇటీవల హోండా షైన్ 100 మరియు డియో 125ను లాంచ్ చేసింది. తాజాగా ఈ జపనీస్ బ్రాండ్ మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హోండా నుంచి త్వరలో మరో కొత్త బైక్ మార్కెట్‌లోకి విడుదల కానుంది. ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ యూనికార్న్(Unicorn) ఆధారంగా రూపొందించబడిన సరికొత్త 160 సీసీ బైక్‌ను త్వరలో పరిచయం చేయనుంది. ఇది ఇప్పటికే మార్కెట్‌లో ఆదరణ పొందిన హోండా SP 125 కంటే మంచి ఫీచర్లతో రానున్నట్లు సమాచారం.

త్వరలో హోండా నుంచి విడుదల కానున్న సరికొత్త మోటార్‌సైకిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీకు ఈ కథనంలో అందిస్తున్నాం. ఈ బైక్ వచ్చే నెలలో అంటే ఆగష్టులో మార్కెట్‌లోకి విడుదల కానున్నట్లు సమాచారం. దీని ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1.15 లక్షలు ఉండే అవకాశం ఉంది. హోండా యునికార్న్ ధర ప్రస్తుతం రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
హోండా SP 125ని TVS రైడర్‌కు ప్రత్యక్ష ప్రత్యర్థిగా మార్కెట్‌లో పోటీ ఉంది. కొత్తగా విడుదల కానున్న హోండా SP 160, యమహా FZ V4.0, సుజుకి గిక్సర్(Suzuki Gixxer 155) మరియు ఎంట్రీ-లెవల్ బజాజ్ పల్సర్ 150 లతో నేరుగా పోటీ పడే అవకాశం ఉంది. ఇవన్నీ హోండా SP 160 కంటే కొంచెం శక్తివంతమైనవి.

కొత్త హోండా SP 160.. 162.7 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 7,500 rpm వద్ద 12.9 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా 5,500 rpm వద్ద 14 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ట్రెయిన్ ఐదు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించబడి ఉంటుంది.
ఇక కొత్త హోండా SP 160 డిజైన్ విషయానికొస్తే, ఇది SP 125 ను ఎక్కువగా పోలి ఉంటుందని సమాచారం. ఇక కలర్స్‌ను పరిశీలిస్తే కొత్త కలర్ స్కీమ్‌లు మరియు స్పోర్టీ గ్రాఫిక్‌లతో హోండా SP 160 అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

హోండా SP 160 12 లీటర్ల చిన్న ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. యునికార్న్ 18-అంగుళాల చక్రాలను కలిగి ఉంటే.. హోండా SP 16 17- అంగుళాల చక్రాలను కలిగి ఉంటుంది. విభిన్న బ్రేకింగ్ హార్డ్‌వేర్‌తో SP 125 మాదిరిగానే ఉంటుంది. ఇది మొత్తం రెండు వేరియంట్‌లలో మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. హోండా SP 160 మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








