65 కి.మీ మైలేజ్‌తో హోండా నుంచి కొత్త స్పోర్ట్స్ ఎడిషన్ SP125 విడుదల.. ధర రూ. 90, 567
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా (HMSI) మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. హోండా SP125(Honda SP125) స్పోర్ట్స్ ఎడిషన్‌ను నేడు విడుదల చేసింది. కొత్త SP125 స్పోర్ట్స్ ఎడిషన్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ బైక్ డిజైన్, ధర, ఫీచర్లను ఈ కథనంలో అందిస్తున్నాం.
కొత్త హోండా SP125 ఇంజిన్‌ను పరిశీలిస్తే OBD-2 నిబంధనలకు అనుగుణంగా ఇందులో 123.94cc, సింగిల్-సిలిండర్‌ను అమర్చారు. BSVI OBD2 కంప్లైంట్ PGM-FI ఇంజిన్ థ్రిల్లింగ్ రైడ్‌ను అందిస్తుంది. 8kW శక్తిని మరియు 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజ్ విషయానికొస్తే 65 kmpl మైలేజ్‌ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త హోండా SP125 స్పోర్ట్స్ ఎడిషన్ ధర రూ. 90,567 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. SP125 స్పోర్ట్స్ ఎడిషన్ క్లాస్-లీడింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది LED హెడ్‌ల్యాంప్, గేర్ ఇండికేటర్ ఇంకా ఇతర మైలేజ్ సమాచారంతో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో లిమిటెడ్ టైమ్‌కి ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.
General Honda SP 125: ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్ వేరియంట్ ధర రూ.85,131(ఎక్స్-షోరూమ్) కాగా.. డిస్క్ వేరియంట్ ధర రూ.89,000గా ఉంది. ఇది 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే స్పోర్ట్ వెర్షన్ మరియు రెగ్యులర్ వెర్షన్ మధ్య ఇంజిన్ మరియు పవర్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.

హోండా SP125 అప్‌డేటెడ్ ఇంజిన్ ఎంపికతో ప్రారంభించారు. ఈ బైక్ దేశీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ 125కి గట్టి పోటీనిస్తుంది. ధర కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇంకా రైడర్లకు నచ్చేలా అనేక ఫీచర్లను కలిగి ఉంది. భవిష్యత్తులో మార్కెట్లో ఈ బైక్ తన దూకుడు ప్రదర్శిస్తుందో లేదో వేచి చూడాలి.
కొత్త స్పోర్ట్ ఎడిషన్ లాంచ్‌పై హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్ & సీఈఓ సుట్సుము ఒటాని మాట్లాడారు. హోండా SP125 దాని అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ మరియు థ్రిల్లింగ్ పనితీరుతో కస్టమర్‌లను ఉత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. 125cc ప్రీమియం కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగంలో ఇది అత్యుత్తమ పనితీరు కనబరిచే మోటార్‌సైకిల్ అనడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
అలాగే కొత్త SP125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టడం తమ కస్టమర్లకు, ముఖ్యంగా యువ తరాన్ని మరింతగా ఆహ్లాదపరుస్తుందని విశ్వసిస్తున్నట్లు ఒటాని పేర్కొన్నారు. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా.. రాబోయే రెండు నెలల్లో తమ ఈ స్పోర్ట్స్ ఎడిషన్ SP125 కు మంచి డిమాండ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హోండా SP125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని హోండా మోటార్ సైకిల్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అన్నారు. ఆధునిక పరికరాలతో ఈ బైక్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సరికొత్త స్పోర్ట్స్ బైక్ జనాదరణ పొందుతుందని, కస్టమర్లకు మంచి ఆప్షన్‌గా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








