Moto కాంపాక్టో ఎలక్ట్రిక్ స్కూటర్‌కి క్రేజ్ ఎక్కువ.. దీన్ని మడతబెట్టుకుని కూడా వెళ్లొచ్చు

దేశీయ ఆటో మొబైల్ మార్కెట్లో టూ వీలర్, ఈవీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న హోండా మోటార్స్.. తాజాగా మార్కెట్లోకి మోటోకాంపాక్టో(Honda MotoCompacto Electric Scooter) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించి సంచలనం సృష్టించింది. 1980ల ప్రారంభంలో దిగ్గజ మోటోకాంపో ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలను ఈ కథనంలో తెలుసుకోండి మరి..

హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ వంటి బిజీ నగరాల్లో కమ్యూటర్స్‌కు మోటోకాంపాక్టో ఎలక్ట్రిక్‌ స్కూటర్(MotoCompacto Electric Scooter) మంచి ఆప్షన్. ఎందుకంటే ఇది ఫోల్డబుల్‌గా ఉండటంతో పాటు చిన్నగా ఉండటంతో రద్దీ రోడ్లపై ఈజీగా రైడ్ చేయవచ్చు. 1980ల ప్రారంభంలో, మోటోకాంపాక్టో అనే చిన్న వాహనం చైనాలో ప్రసిద్ధి చెందింది. దానికి గుర్తుగా, జపనీస్ బ్రాండ్ ఇప్పుడు మోటోకాంపాక్ట్‌ను ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి తీసుకొచ్చింది.

Honda Moto-Compacto-Electric-Scooter

అర్బన్ ప్రయాణికుల కోసం హోండా మోటోకాంపాక్టో ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ స్కూటర్‌ను సూట్‌కేస్‌లా మడతపెట్టుకుని తీసుకెళ్లవచ్చు. ఇది ఆధునిక నగర ప్రయాణీకులకు మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. హోండా యొక్క ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెట్రో సౌందర్యాన్ని ఇస్తుంది. ఇది ఆల్-వైట్ బాడీ కలర్ ఆప్షన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ సరికొత్త, వెరైటీ స్కూటర్‌ను ఒహియో మరియు కాలిఫోర్నియాకు చెందిన స్కిల్డ్ హోండా(Honda Motors) ఇంజినీర్లు తయారుచేశారు. ప్రముఖ వాహన డిజైనర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించారు. ఈ కొత్త మోటోకాంపాక్టో ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కోసం హోండా 32 పేటెంట్లను పొందుపరిచింది. మోటోకాంపాక్టో ప్రత్యేకత ఏంటంటే దాని కాంపాక్ట్, తేలికైన మరియు ఈజీగా క్యారీ చేసుకునే స్కూటర్‌గా రూపాంతరం చెందింది.

Honda Moto-Compacto-Electric-Scooter

రద్దీగా ఉండే రోడ్లపై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో వెళ్లడం చాలా సులువు. పార్కింగ్ చేయడం కూడా చాలా ఈజీ. హోండా నుంచి వచ్చిన ఈ కొత్త మోటోకాంపాక్టో ఎలక్ట్రిక్ స్కూటర్‌(MotoCompacto Electric Scooter For Urban Commuters)లో డైరెక్ట్- డ్రైవ్ మోటార్‌ను అమర్చారు. దీని ద్వారా 490 W పీక్ అవుట్‌పుట్ మరియు 16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్‌ని ఉపయోగించి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 24 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

ఈ మోటో కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని పరిశీలిస్తే ఇందులో 6.8-Ah బ్యాటరీని అమర్చారు. ఇందులో స్టాండర్డ్ 110-వోల్ట్ అవుట్‌లెట్‌ని ఉపయోగించి 3.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ హోండా మోటోకాంపాక్టో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 19 కి.మీల రేంజ్ ఇస్తుంది. కొలతలు మరియు కెపాసిటీ పరంగా, ఇది 742 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

Honda Moto-Compacto-Electric-Scooter

రెడీ-టు-రైడ్ మరియు ఫోల్డెడ్ కాన్ఫిగరేషన్‌లో దీని పొడవు వరుసగా 968 mm మరియు 742 mmగా ఉంది. మీరు రైడ్ చేసే సమయంలో ఈ స్కూటర్ ఎత్తు 889 mm ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు కాంపాక్ట్ ఎత్తు 536 mm ఉంటుంది. అలాగే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీట్ ఎత్తు 622.3 మిమీగా సెట్ చేశారు. దీని ద్వారా వాహనదారులకు సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఇస్తుంది. ఇక బరువు విషయానికొస్తే, హోండా మోటోకాంపాక్టో బరువు 18 కిలోలు మాత్రమే.

ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందడంతో దేశీయ మార్కెట్లో కూడా తమ హవాను ప్రదర్శిస్తున్నాయి. వాటి డిజైన్‌లో ప్రత్యేకంగా నిలుస్తూ సాంప్రదాయ వాహనాల నుంచి భిన్నమైన స్టైలింగ్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నగర ప్రయాణికులకు అనుకూలంగా ఫ్యూచరిస్టిక్ స్టైల్‌తో రూపొందిస్తున్నారు. మరి త్వరలో హోండా తీసుకురాబోతున్న ఈ చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తన సత్తా నిరూపించుకుంటుందో లేదో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 19, 2023, 13:01 [IST]
English summary
Honda unveils moto compacto foldable electric scooter battery range and features here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+