హోండా 100సీసీ బైక్.. మార్చి 15న మార్కెట్ లోకి.. స్ప్లెండర్ కి పోటీగా..!!

హీరో, బజాజ్ బైక్ లకు ధీటుగా హోండా కంపెనీ సరికొత్త బైక్ ను రిలీజ్ చేయనుంది. 100సీసీ ఇంజన్ తో ఈ బైక్ ను విడుదల కానుంది. ముంబైలో మార్చి 15న జరగనున్న ఓ ఈవెంట్‌ లో ఈ బైక్ ను లాంచ్ చేయనున్నట్టు హోండా మోటార్స్ కంపెనీ ప్రకటించింది.

టూవీలర్ తయారీ కంపెనీలో ఈ నిర్ణయం హీరో కంపెనీకి షాక్ అనే చెప్పాలి. 100సీసీలో బైక్ ను తీసుకువస్తూ ఇతర కంపెనీలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విషయంలో హోండా మాస్టర్ ప్లాన్‌ తో ముందుకు వస్తుందని భావించవచ్చు. టూ వీలర్ లో హీరో కంపెనీకి చెందిన స్ల్పెండర్ ను వెనక్కి నెట్టే బైక్ మరోటి లేదు. ఇప్పటివరకు దేశంలో బెస్ట్ సెల్లింగ్ టూవీలర్ ఇదే.

హోండా

హీరో స్ప్లెండర్ ను తలదన్నేలా..

ప్రతి నెలా దేశంలో దేశంలో టూ వీలర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అందులో ప్రతి నెలా ఏకంగా 2 లక్షల యూనిట్లకు పైగా బైక్స్ స్ప్లెండర్ కి చెందినవే. అయితే దానిని ఢీకొట్టేలా దీనిని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఏ మేరకు ఈ బైక్ క్లిక్ అవుతుందో చూడాలి.

హీరో బైక్స్‌లో 100 సీసీ సామ‌ర్థ్యం లోపు బైక్స్ విక్ర‌యాలు 80 శాతం వాటాను కలిగి ఉంది. వాటిలో స్ప్లెండ‌ర్‌, హెచ్ఎఫ్ డీల‌క్స్ కూడా ఉన్నాయి. హోండా బైక్స్‌, స్కూట‌ర్ల‌లో బెస్ట్ సెల్లింగ్ మోడ‌ల్ యాక్టీవా.. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో 17 ల‌క్ష‌ల‌కు పైగా అమ్ముడైంది. అయినా స్ప్లెండ‌ర్ కంటే వెనుక‌బ‌డి ఉంది.

హోండా

అదే పేరుతో పేరు..

మార్కెట్ ​లో హోండా షైన్ మంచి స్పందన ఉంది. అయితే ఇదే పేరుతో కొత్త​ మోడల్​ ను తీసుకునే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. హోండా 100 అనే పేరును పెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తుంది. దీని నూతన పేరు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఈ బైక్ డిజైన్​ లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తుంది. ఈ కొత్త 100సీసీ మోటార్ ​సైకిల్ దాదాపు హోండా షైన్​ 125 సీసీ బైక్ ​ని పోలి ఉండేలా తీసుకు రానుంది. అయితే చిన్న చిన్న మార్పులతో హీరో స్ప్లెండర్​ కన్నా మరింత ఆకర్షణీయంగా ఈ మోటార్ సైకిల్ ను తీసుకువచ్చి దానికి గట్టి పోటి ఇవ్వనుంది.

కొత్తగా కంపెనీ మార్కెట్‌ లోకి తీసుకురాబోయే మోడల్ ధర రూ.75 వేల లోపు ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ధరతో పాటు మంచి అధునాతన ఫీచర్లను జోడించడంతో ఈ బైక్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చాడాలి. మార్కెట్ లో నిలదొక్కుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే దీనిని తీసుకురానుంది.

మార్కెట్ హోండా జోరు..

ప్రస్తుతం హోండా కంపెనీ మార్కెట్ లో వివిధ బైక్స్ ను విక్రయిస్తోంది. వీటిలో షైన్ తో పాటు యూనికార్న్ బైక్స్ చాలా క్లిక్ అయ్యాయి. ప్రస్తుత మార్గెట్ లో ఈ బైక్స్ హవా సాగుతోంది. 100సీసీలోడిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ను తీసుకువచ్చే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్ని నెల‌ల్లో క్రితమే 100 సీసీ మోటార్ సైకిల్‌ను మార్కెట్‌లోకి తెస్తున్న‌ట్లు హోండా మోటార్ సైకిల్స్ ప్రెసిడెంట్ అతుషి ఒగాటా తెలిపారు. తాము తీసుకొచ్చే 100 సీసీ హోండా బైక్ ఆక‌ర్ష‌ణీయ ధ‌ర‌కు అందుబాటులోకి తెస్తామని అన్నారు. స్ప్లెండ‌ర్‌, హెచ్ఎఫ్ డీల‌క్స్ కంటే ఆక‌ర్ష‌ణీయంగా రూపొందిస్తామ‌ని తెలిపారు. అన్నట్లుగానే ఈ బైక్ అందుబాటులోకి రానుంది. మైలేజ్ ఇతర అంశాలు గురించి తెలియాలి అంటే మార్చి 15 వరకు ఆగాల్సిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, March 1, 2023, 22:18 [IST]
English summary
Honda unviled new 100cc bike releasing on 15th march
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+