ఇక నుంచి ఆ బైక్‌ను కొనలేరు.. వెబ్‌సైట్ నుంచి తొలగించిన ప్రముఖ సంస్థ..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇటీవలే తన హోండా SP 160ని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీంతో హోండా ఇప్పుడు తన అధికారిక వెబ్‌సైట్ నుంచి X-బ్లేడ్‌ బైక్ ను తొలగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలో హోండా మోటార్ సైకిల్స్ వినియోగదారులకు సేవలందిస్తోంది. కాగా సరసమైన ధరలో ఇటీవల హోండా SP 160 ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హోండా X బ్లేడ్ బైక్‌ను తొలగించింది. హోండా ఎక్స్ బ్లేడ్ బైక్ విక్రయాలు క్షీణించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Honda-X-Blade

160 సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో హోండా విక్రయాల్లో ఎక్కువ భాగం యునికార్న్ నమోదు చేసింది. అయితే కొత్తగా లాంచ్ చేసిన SP 160 ఎలాంటి ఫలితాలను ఇస్తుందో లేదో వేచి చూడాలి. హోండా తన వెబ్‌సైట్ నుంచి X-బ్లేడ్‌ను తాత్కాలికంగా తొలగించి ఉండవచ్చు. కాగా హోండా కఠినమైన OBD2 ఉద్గార ప్రమాణాలు మరియు E20 ఇథనాల్-మిక్స్ ఇంధనానికి అనుగుణంగా తన పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేసే పనిలో ఉంది.

కాగా హోండా ఎక్స్-బ్లేడ్ బైక్ విషయానికొస్తే ఇందులో 160 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ అప్‌గ్రేడ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 8000 rpm వద్ద 13.67 bhp మరియు 5500 rpm వద్ద 14.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Honda-X-Blade

X-బ్లేడ్ బైక్‌లోని ఇంజిన్ బ్రాండ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్-ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది ఈ బైక్‌కు మెరుగైన పనితీరుతో పాటు మంచి మైలేజ్ ను ఇస్తుంది. సస్పెన్షన్ కోసం, ఈ హోండా ఎక్స్-బ్లేడ్ బైక్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నాయి.

ఈ ఎక్స్-బ్లేడ్ బైక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పరిశీలిస్తే, ముందువైపు 276 ఎంఎం డిస్క్ మరియు వెనుక భాగంలో 220 ఎంఎం డిస్క్ మరియు 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ ఆప్షన్ ఉంటుంది. ఈ బైక్‌లో సింగిల్-ఛానల్ ABS స్టాండర్డ్‌గా అమర్చారు. హోండా ఎక్స్-బ్లేడ్ బేస్ మోడల్ బరువు 146 కిలోలు కాగా టాప్ స్పెక్ మోడల్ బరువు 147 కిలోలుగా ఉంది.

Honda-X-Blade

ఈ బైక్ స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది. రోబోకాప్ డిజైన్ LED హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. ఇందులో రీఫ్రెష్ చేయబడిన బాడీ గ్రాఫిక్స్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఉన్నాయి. ఈ బైక్ పెర్ల్ స్పార్టన్ రెడ్, పెరల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టింది.

కొత్త హోండా SP 160 బైక్‌లో హోండా యునికార్న్ బైక్‌లో ఉన్న అదే 162.7cc, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 7,500rpm వద్ద 13.27 bhp మరియు 5,500 rpm వద్ద 14.58 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

కాగా కొత్తగా విడుదల చేసిన హోండా SP 160 బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సింగిల్-డిస్క్ బ్రేక్ సెటప్‌తో కూడిన ఈ బైక్ బేస్ వేరియంట్ ధర రూ.1,17,500 కాగా, ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లతో కూడిన టాప్-స్పెక్ మోడల్ ధర రూ.1,21,900. ఈ బైక్ చిన్న హోండా SP 125 బైక్ డిజైన్‌ను చాలా వరకు పోలి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 12, 2023, 12:22 [IST]
English summary
Honda x blade bike removed from website and replaced by sp 160 bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+