ఆటో ఎక్స్‌పో 2023: హోండా నయా బైక్ XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్.. ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో కేవలం పెట్రోల్, ఎలక్ట్రిక్ మరియు CNG వాహనాలంతో పాటు ఫ్లెక్స్-ఫ్యూయెల్ సామర్థ్యం కలిగి వాహనాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా అనేక ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలు ఆవిష్కరించబడ్డాయి. ఇందులో ఒకటి హోండా XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్.

ఆటో ఎక్స్‌పో 2023 లో 'హోండా మోటార్‌సైకిల్' కంపెనీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్ 291.6 సిసి, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది ఫ్లెక్స్ ఫ్యూయెల సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే ఈ బైక్ పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడుస్తుంది. హోండా XRE 300 బైక్ పెట్రోల్‌తో నడిచేటప్పుడు 7,500 rpm వద్ద 25.4 hp పవర్ మరియు 6,000 rpm వద్ద 27.6 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

హోండా నయా బైక్ XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్

హోండా XRE 300 ర్యాలీ బైక్ పెట్రోల్‌తో పాటు ఫ్లెక్స్-ఫ్యూయల్ (పెట్రోల్-ఇథనాల్) 20 నుండి 85 శాతం వరకు (పెట్రోల్-ఇథనాల్) మిశ్రమాలతో నడుస్తుంది. e20-e85) ఇథనాల్ మిళితం చేయబడింది. ఈ బైక్ 13.8 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఇథనాల్ తో నడుస్తున్నప్పుడు 7,500 rpm వద్ద 25.6 hp పవర్ డెలివరీ చేస్తుంది. పవర్ అవుట్‌పుట్ గణాంకాలు ఇందులో కొంత వరకు పెరుగుతాయి. ఈ బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

నిజానికి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు భారతదేశంలో కంటే బ్రెజిల్ దేశంలో ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. హోండా XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ 2,195 మిమీ పొడవు, 838 మిమీ వెడల్పు మరియు 1,215 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. అదే సమయంలో XRE 300 ర్యాలీ యొక్క వీల్‌బేస్‌ 1,417 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 259 మిమీ వరకు ఉంటుంది. ఇక సీటు హైట్ భూమి నుంచి 80 మిమీ ఎత్తులో ఉంటుంది.

హోండా నయా బైక్ XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్

హోండా XRE 300 ర్యాలీ సెమీ డబుల్ క్రిబ్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. కావున ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ కొంచెం దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. ఈ XRE300 బైక్ యొక్క ముందు భాగంలో 245 మిమీ ట్రావెల్‌తో టెలిస్కోపిక్ ఫోర్క్‌ను కలిగి ఉండగా, వెనుకవైపు ఉన్న మోనోషాక్ 225 మిమీ వరకు ఉంటుంది. ఇది రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

హోండా XRE 300 ర్యాలీ బైక్ యొక్క ముందు వైపు 21 ఇంచెస్ బెల్ మరియు వెనుక వైపు 18 ఇంచెస్ వీల్స్ కలిగి స్పోక్డ్ రిమ్‌లను కలిగి ఉంటుంది. ఇక ఈ బైక్ యొక్క టైర్స్ విషయానికి వస్తే, ఇందులో 90/90 సెక్షన్ ఫ్రంట్ టైర్ మరియు 120/80 సెక్షన్ రియర్ టైర్ కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, హోండా XRE 300 ఫ్లెక్స్ ఫ్యూయల్‌ యొక్క రెండు చివర్లలోని డిస్క్‌ బ్రేక్స్ కలిగి ఉంటాయి.

హోండా నయా బైక్ XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్

హోండా XRE 300 మోటార్‌సైకిల్ యొక్క ముందు భాగంలో 256 మిమీ డిస్క్‌ బ్రేక్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. ఇందులో ఏబీఎస్ స్టాండర్డ్ గా లభిస్తుంది. ఈ బైక్ డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడగానే అడ్వెంచర్ బైక్ గుర్తుకు తెస్తుంది. ఈ బైకులో కొంత ముందుకు సాగిన ముక్కు వంటి నిర్మాణం, దానికి పైన హెడ్ లైట్, ఎత్తైన సీటు మరియు అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్‌ వంటివి ఉంటాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే, హోండా XRE 300 ర్యాలీలో TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్ LED లైటింగ్ తో ఉంటుంది. ఇది బైక్ గురించి రైడర్ కి మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. ఇవన్నీ కూడా రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటాయి. కంపెనీ ఈ బైక్ విడుదలను గురించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. బహుశా దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే అందిస్తుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, January 14, 2023, 7:33 [IST]
English summary
Honda xre 300 flex fuel showcased at auto expo 2023 specs features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+