ఒక్క ఛార్జ్‌తో 120 కిమీ రేంజ్ అందించే HOP LEO ఎలక్ట్రిక్ స్కూటర్: ధర లక్ష కంటే తక్కువే..

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతున్న తరుణంలో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ HOP LEO యొక్క హై స్పీడ్ వేరియంట్‌ విడుదల చేసింది.

HOP ఎలక్ట్రిక్ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉంటుంది. అయితే ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ యొక్క ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో కొనుగోలు చెయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి మంచి డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 50 కిమీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లగలదు.

ఒక్క ఛార్జ్‌తో 120 కిమీ రేంజ్ అందించే HOP LEO ఎలక్ట్రిక్ స్కూటర్: ధర లక్ష కంటే తక్కువే..

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హోప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2.1 kWh లిథియం అయాన్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఛార్జ్ తో గరిష్టంగా 120 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది 2.95 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉండే BLDC హబ్ మోటార్ మరియు కంట్రోలర్ వంటివి స్కూటర్ ను హ్యాండిల్ చేయడం సులభం చేస్తాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 850 W స్మార్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 2.5 గంటల సమయంలో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా హాప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ విభిన్న రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులో ఎకో, పవర్ మరియు స్పోర్ట్ మోడ్స్ మాత్రమే కాకుండా రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

హాప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. ఈ స్కూటర్ యొక్క ముందు భాగంలో నిటారుగా ఉండే టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక సస్పెన్షన్ హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్జార్బర్ వంటివి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముందు మరియు వెనుక బ్రేక్‌లు కాంబి-బ్రేక్ సిస్టమ్ మరియు రీజెనరేటివ్ బ్రేకింగ్‌ ఉన్నాయి.

హాప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో 10 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. ఇక టైర్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ముందు మరియు వెనుక భాగంలో 90/90-r10 సెక్షన్ టైర్లు ఉంటాయి. అదే సమయంలో ఈ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ కాగా, లోడింగ్ కెపాసిటీ 160 కేజీల వరకు ఉంటుంది. ఇక బ్యాటరీ కూడా వాటర్‌ప్రూఫ్ మరియు డస్ట్‌ప్రూఫ్‌గా ఉంటుంది.

హాప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో LCD డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది, కానీ కనెక్టివిటీని కలిగి ఉండదు. అంతే కాకుండా ఇది థర్డ్ పార్టీ జీపీఎస్ ట్రాకర్‌ను ఇన్‌స్టాల్ వెసులుబాటుని కలిగి ఉంటుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే, ముందు భాగంలో ప్రకాశవంతంగా ఉండే లైట్స్, సింగిల్ పీస్ సీటు మరియు గ్రాబ్ రైల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో ఇది కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి వైట్, బ్లాక్, గ్రే, బ్లూ మరియు రెడ్ కలర్స్. ఇవన్నీ కూడా చోట చక్కగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి గ్రీక్ కలర్ ప్లేట్ తో రిజిస్ట్రేషన్ అవసరం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఖచ్చితమైన ధర తెలియదు, కానీ కంపెనీ ఈ స్కూటర్ ధర రూ. 1 లక్ష కంటే తక్కువని తెలియజేసింది, కావున దీని ధర సుమారు రూ. 97,000 నుంచి 98,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు.

Most Read Articles

English summary
Hop leo high speed electric scooter launched price features range details in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X