IME ర్యాపిడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 300 కి.మీ రేంజ్..!
భారత్‌లో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఉంటుంది. కస్టమర్ల ఆలోచనలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఈ రంగంలో ఓలా, టీవీఎస్, ఏథర్, సింపుల్ ఎనర్జీ సహా మరెన్నో సంస్థలు కీలకంగా ఉన్నాయి.
బెంగళూరుకు చెందిన MY EV స్టోర్ కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసింది. దేశీయ మార్కెట్‌లోకి IME ర్యాపిడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. వేరియంట్‌ను బట్టి రూ.99000 నుంచి రూ.1.48 లక్షల వరకు ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 300 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని సంస్థ చెబుతోంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వినియోగించిన స్మార్ట్ రేంజ్ టెక్నాలజీ కారణంగా గరిష్ఠంగా 300 కి.మీ రేంజ్ ఇస్తుందని MY EV స్టోర్ సంస్థ చెబుతోంది. ఈ టెక్నాలజీలో వాతావరణ పరిస్థితులు, డ్రైవింగ్ సహా ట్రాఫిక్‌కు సంబంధించిన డేటా ఉంటుందని సంస్థ వెల్లడించింది.
MY EV స్టోర్‌కు చెందిన IME ర్యాపిడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఈవీ 60V-26AH, 60V-52AH, 60V-72AH బ్యాటరీ ప్యా్‌క్‌ను కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో వరుసగా 100కి.మీ, 200కి.మీ, 300కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. రేంజ్‌తోనే కాకుండా ఫెర్పార్మెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తొలుత బెంగళూరు నగరంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అనంతరం కర్ణాటక వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని సంస్థ భావిస్తోంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన విడిభాగాలను అందుబాటులో ఉంచేందుకు సంస్థ కృషిచేస్తోంది. ఫలితంగా సర్వీసింగ్ ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చని సంస్థ భావిస్తోంది.
MY EV స్టోర్ కస్టమర్లు సులభంగా రుణాలు పొందేందుకు కోటక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, మణుప్పురం ఫైనాన్స్ వంటి సంస్థలతో సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు తక్షణ పరిష్కారమని మై ఈవీ స్టోర్ హెడ్ పునీత్ గౌడ్ తెలిపారు. IME ర్యాపిడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
*ఆగస్టు నెల నివేదిక ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందాయి. ఈ విక్రయాల్లో ఓలా తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ రెండో స్థానంలో ఉంది. సాధారణంగా భారత్‌లో పండుగల సమయంలో ద్విచక్ర వాహనాల విక్రయాలు గణనీయంగా ఉంటాయి.
ఆగస్టు నెలలో మాత్రం సుమారుగా అన్ని సంస్థలు కూడా విక్రయాల్లో వృద్ధి సాధించాయి. జూన్ 2023 నెలలో 46,027 యూనిట్లు, అదే జూలైలో 54,498 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయాలు జరిగాయి. అయితే ఆగస్టులో మాత్రం 59,313 యూనిట్లు అమ్ముడయ్యాయి.
2022 ఆగస్టులో 52,225 వాహనాలు విక్రయించారు. గత సంవత్సరంతో పోలిస్తే 13 శాతం వృద్ధి నమోదు చేసింది. ఆగస్టు నెల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ఓలా సంస్థ తొలిస్థానంలో ఉంది. 17,655 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్ రెండో స్థానంలో ఉంది. 14,584 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది.


Click it and Unblock the Notifications








