రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌.. భారత్‌లో తొలిసారిగా..!

భారత మార్కెట్‌లో ఇప్పటి వరకు అనేక రకాల ఎలక్ట్రిక్‌ బైక్‌లను చూశాం. కానీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ను విడుదల కాలేదు. కానీ బెంగళూరుకు చెందిన బుల్లెటీర్‌ కస్టమ్స్ బృందం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ను తయారు చేసింది. ఛాసిస్ దగ్గర నుంచి మోటార్‌ వరకు చాలా మార్పులు చేశారు. 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా రూపొందించారు.

ఇటీవల బెంగళూరులోని బుల్లెటీర్‌ కస్టమ్‌ సందర్శించే అవకాశం దక్కింది. అక్కడ రిచర్డో మరియు అతని బృందం తయారుచేసిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ను చూశాం. మరియు ఆ బృందంలో మాట్లాడేందుకు, ఆ సరికొత్త బైక్‌ గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకొనే అవకాశం వచ్చింది.

Indias First electric royal enfield bullet

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 1984 స్డాండర్డ్‌ బైక్‌ను రిచర్డో తన తండ్రి నుంచి పొందారు. కొన్ని కారణాల వల్ల ఆ బైక్‌ను విక్రయించాలని ఆలోచన చేయలేదు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఆకర్షించే ఎలక్ట్రిక్‌ బైక్‌గా మార్చాడు.

ఈ బైక్‌కు కొత్త లుక్‌ తీసుకొచ్చేందుకు ఛాసిస్ నుంచి మోటార్‌ వరకు బుల్లెటీర్‌ కస్టమ్స్‌ బృందం చాలా కృషి చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ బుల్లెట్‌ 72 వోల్ట్‌ DC బ్యాటరీ, 5kW హబ్‌ మోటర్‌ను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 90 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.

Indias First electric royal enfield bullet

ఈ ఎలక్ట్రిక్‌ బుల్లెట్‌ను రైడ్‌ చేసే అవకాశం దక్కింది. డ్రైవింగ్‌ చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్ 65-75 km/h వేగంతో చాలా సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు. ఈ బైక్‌ గరిష్ఠ వేగం 90km/h అని రిచర్డో బృందం తెలిపింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్ ఎలక్ట్రిక్‌ బైక్‌ రైడింగ్‌ చాలా సౌకర్యంగా ఉంది. కొద్ది దూరం మాత్రమే నడిపినా.. చాలా మంచి డ్రైవింగ్‌ అనుభూతిని ఇచ్చింది.

ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బుల్లెట్‌ డిజైన్‌, రంగుల పరంగా కూడా చాలా క్లాసిక్‌గా ఉంది. నలుపు, ఎరుపు, తెలుపు రంగుల కలయికతో చాలా క్లాసీ మరియు నియో రెట్రో లుక్‌ను పొందింది. అయితే ఈ మోటార్‌ సైకిల్‌ ఒక్క సీట్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. ఫుట్‌పెగ్‌ల కారణంగా సెమీ రిలాక్స్‌ పొజిషన్‌తో వస్తుంది. దాంతోపాటు రేసర్‌ స్ట్రైల్‌ డిజైన్‌ కారణంగా సెమీ స్పోర్టీగా ఉంటుంది.

Indias First electric royal enfield bullet

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బుల్లెట్‌ ట్యాంక్‌, ముందు భాగంలో రెడ్ కలర్‌లో గ్యాసోలిన్‌ అనే పేరును గమనించవచ్చు. ఈ బైక్‌ కస్టమ్‌గా తయారైంది. అయితే దీని ధర ఎంత ఉంటుందనే సందేహం మనకు రావచ్చు. బైక్‌ ధర ప్రస్తుతం 2.5 లక్షలు.. పూర్తిగా తయారీ పూర్తయిన తర్వాత 3 లక్షల రూపాయలుగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ వ్యాఖ్య: భారత్‌లో తొలిసారిగా బుల్లెటిర్‌ కస్టమ్స్‌ తయారు చేసిన ఎలక్ట్రిక్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. డిజైన్‌ నుంచి పవర్‌టైన్‌ వరకు ప్రతిదీ చాలా ఆలోచించి తయారు చేశారు. ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ ప్రస్తుతం మనం చూసే వాహనాలతో పోలిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

Indias First electric royal enfield bullet

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 26, 2023, 17:52 [IST]
English summary
Indias first electric royal enfield bullet bike by bulleteer customs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+