Matter Aera E- Bike మార్కెట్‌లో మ్యాటర్ ఏరా ఈ బైక్ హవా.. ఒక్క నెలలోనే 40 వేల ప్రీ బుకింగ్‌లు
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ప్రాధాన్యత కలిగిన ఫీచర్లతో అభివృద్ధి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, స్టార్టప్ ఆటోమేకర్లు సైతం పోటాపోటీగా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి.
గుజరాత్‌కు చెందిన EV స్టార్టప్ మ్యాటర్ ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏరా ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మ్యాటర్ ఏరా భారతదేశపు మొట్టమొదటి గేర్ ఎలక్ట్రిక్ బైక్. ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉందనడంలో సందేహం లేదు. ఎందుకంటే కొత్త మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించిన ఒక్క నెలలోనే 40,000 బుకింగ్‌లను సంపాదించుకుంది.

మ్యాటర్ మేకర్ ప్రస్తుతం తన అధికారిక వెబ్‌సైట్‌లో మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా బుకింగ్‌లను స్వీకరిస్తోంది. ఏరా ఈవీను ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లు తొలుత డెలివరీని తీసుకుంటారు. మ్యాటర్ ఏరా 5,000 మరియు 5,000+ అనే రెండు వేరియంట్‌లలో విక్రయించబడుతుంది. రెండింటిలోనూ ఒకే ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. పవర్ అవుట్‌పుట్ 10 kw వద్ద రేట్ చేయబడింది.
కొత్త మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ రెండు వెర్షన్లు 4 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు నాలుగు రైడింగ్ మోడ్‌లతో వస్తాయి. బ్రేకింగ్ సిస్టమ్స్ చూసుకుంటే ఇది ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌ల ద్వారా నిర్వహించబడుతుంది. అదనపు భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ABS కూడా జత చేయబడింది.

మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ కేవలం 6 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ 5 kwh బ్యాటరీ ప్యాక్‌తో 125 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఐదు గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే కేవలం 2 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా, ఇది IP67 రేట్‌తో పాటు లిక్విడ్-కూల్డ్‌ను కలిగి ఉంది.
మ్యాటర్ వ్యవస్థాపకుడు మరియు గ్రూప్ CEO మోహల్ లాల్భాయ్ కొత్త మ్యాటర్ ఏరా గురించి మాట్లాడుతూ, 'రైడింగ్ విషయంలో వినియోగదారులు మార్పును స్వీకరించడానికి ఆసక్తి చూపుతున్నారనే విషయాన్ని గ్రహించాం. అది మాకు ఉత్తేజాన్నిచ్చింది. ప్రీ బుకింగ్ వచ్చిన రెస్పాన్స్ భవిష్యత్తులో సాంకేతికతకు నిదర్శనం. ఫ్లిప్‌కార్ట్ మరియు OTO క్యాపిటల్‌తో మా భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు మా ప్రొడక్ట్ సమర్థవంతంగా చేరువవుతోంది'. అని అన్నారు.

ఈ బైక్‌లో LED డేటైమ్ రన్నింగ్ లైట్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. సైడ్ కౌల్స్ బైక్‌కు ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని అందించడానికి రూపొందించబడ్డాయి. మొత్తం మీద ఈ బైక్ ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. మ్యాటర్ ఏరా భారతీయ EV మార్కెట్‌ను గణనీయంగా ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉంది. అధిక సంఖ్యలో బుకింగ్‌లను త్వరగా స్వీకరించడంలో విజయం సాధించడం ఈ మోటార్‌సైకిల్ అందించే స్పెక్స్ మరియు టెక్‌కి నిదర్శనం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








