వింటేజ్‌ బైక్‌ల ప్రదర్శనతో అట్టహాసంగా అంతర్జాతీయ జావా యెజ్డీ డే.. స్పెషాలిటీ ఏంటో తెలుసా.!

జావా యెజ్డీ ఇంటర్నేషనల్ మోటార్‌సైకిల్ డే 21వ ఎడిషన్ భారత్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో మోటార్‌ సైకిల్‌ ప్రియులు, వింటేజ్‌ మోటార్‌ సైకిల్‌ ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దశాబ్దాలుగా రైడర్ల హృదయాలను కైవసం చేసుకుంటున్న జావా, యెజ్డీ బ్రాండ్‌లను గౌరవించడం కోసం ఈ ఈవెంట్‌ నిర్వహించారు.

దేశంలో బెంగళూరు, ఢిల్లీ NCR, కొచ్చిన్, పూణే, చెన్నై మరియు జైపూర్ నగరాల్లో అంతర్జాతీయ జావా యెజ్డీ దినోత్సవం(International Jawa Yezdi Day) ఆదివారం(July 10) ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో 10,000 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. అన్ని ఏజ్‌ గ్రూప్‌లకు సంబంధించిన రైడర్లు తమ ప్రతిష్ఠాత్మకమైన మోటార్‌సైకిళ్లను ప్రదర్శించడానికి మరియు ఈ లెజెండరీ బైక్‌లపై వారి చిరస్మరణీయ అనుభవాలను పంచుకోవడానికి ఈవెంట్‌కు తరలివచ్చారు.

International-Jawa-Yezdi-Day

ఈ ఈవెంట్‌ను మోటార్‌సైకిల్‌లు ఔత్సాహికులు హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్‌కు అనేక బైకింగ్ క్లబ్‌లు మరియు కమ్యూనిటీల మద్దతు లభించింది. తమ వింటేజ్‌ మోటార్‌ సైకిళ్లపై ప్రేమను వ్యక్తపరచడానికి ఔత్సాహికులకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. ఈ ఈవెంట్‌లో జావా మరియు యెజ్డీ కుటుంబంపై తమకున్న అభిమానాన్ని వ్యక్తపరచడానికి మీటప్‌లు, గ్రూప్ రైడ్‌లు, ఎగ్జిబిషన్‌లు మరియు ఇతర కార్యకలాపాలు నిర్వహించారు.

ఈ ఏడాది అంతర్జాతీయ జావా యెజ్డీ దినోత్సవంలో భారీ సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొనడంతో ఈవెంట్‌ సంపూర్ణంగా విజయవంతమైంది. అన్ని వయస్సుల వారు ఈ కార్యక్రమంలో హాజరై తమ విలువైన వింటేజ్‌ మోటార్‌సైకిళ్లను ప్రదర్శించారు. అలాగే తమ బైక్‌లతో ఉన్న అనుభవాన్ని పంచుకున్నారు. కార్యక్రమం ద్వారా కొత్త స్నేహితులను సంపాదించుకోవడంతో పాటు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు.

International-Jawa-Yezdi-Day

అంతర్జాతీయ జావా యెజ్డీ దినోత్సవంలో బహుళ పాతకాలపు మోటార్‌సైకిళ్లను ప్రదర్శించారు. జావా ట్విన్ స్పోర్ట్, యెజ్డీ 250 డీలక్స్‌(Yezdi 250 Deluxe), యెజ్జీ రోడ్‌కింగ్‌(Yezdi Roadking), యజ్డీ టైప్‌ బీ (Yezdi Type B), ఇలా చాలా వింటేజ్‌ బైక్‌లను ప్రదర్శించారు. మొత్తం మీద, ఈవెంట్‌లో దాదాపు 400 వరకూ జావా మరియు యెజ్డీలు మోటారు సైకిళ్లను ప్రదర్శించారు.

జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ CEO ఆశిష్ సింగ్ జోషి మాట్లాడుతూ, "భారతీయ రైడింగ్ కమ్యూనిటీపై ఈ మోటార్‌సైకిళ్లు చూపే శాశ్వత ప్రభావానికి అంతర్జాతీయ జావా యెజ్డీ దినోత్సవం గొప్ప నిదర్శనం. ఈ ఈవెంట్‌ ద్వారా జావా మరియు యెజ్డీ ఔత్సాహికులు ప్రదర్శించిన అంకితభావం మరియు ఉత్సాహాన్ని చూడటం నిజంగా ఆనందంగా ఉంది.

International-Jawa-Yezdi-Day

మేము ఈ వారసత్వాన్ని గౌరవిస్తున్నాము. ఈ ఐకానిక్ మోటార్‌సైకిళ్లు, కాలానికి అతీతంగా వాటి నైపుణ్యం యొక్క సారాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. ఈ ఈవెంట్ దిగ్గజ మోటార్‌సైకిళ్లను మాత్రమే కాకుండా, అవి ప్రాతినిథ్యం వహించే సాహసం, స్వేచ్ఛ మరియు సమాజ స్ఫూర్తిని కూడా జరుపుకొంటుంది." అని ఆయన అన్నారు.

ఈ ఈవెంట్‌కు హాజరైన ఔత్సాహికులు పునరుద్ధరించబడిన క్లాసిక్‌ మోటార్‌ సైకిళ్లు, అరుదైన మోడల్‌లు మరియు నవీకరించబడిన బైక్‌లను చూసి ఆశ్చర్యపోయారు. ఈ మోటార్‌సైకిళ్లు బహుముఖ ప్రజ్ఞ మరియు వ్యక్తిత్వాన్ని హైలైట్ చేశాయి. ఈ క్లాసిక్ మోటార్‌బైక్‌ల యజమానులు ఈ ఈవెంట్‌లో అరుదైన మరియు అత్యంత విలువైన మోడల్‌లను గర్వంగా ప్రదర్శించారు.

International-Jawa-Yezdi-Day

అంతర్జాతీయ జావా యెజ్డీ దినోత్సవం రోజున, కంపెనీ వారి కొత్త యాప్‌ను ప్రదర్శించింది. ఈ యాప్‌ ద్వారా వారి కమ్యూనిటీ కోసం మరియు వారి రైడ్ అనుభవాన్ని పంచుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి వారి కోసం ట్రిప్‌లు మరియు అనుభవాలకు దోహదపడనుంది. ఈ ఏడాది అంతర్జాతీయ జావా యెజ్దీ దినోత్సవం భారీ విజయాన్ని సాధించింది. ఇది ఈ ఐకానిక్ మోటార్‌సైకిళ్ల పట్ల ప్రజాదరణ మరియు ఆకర్షణను తెలియజేస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 11, 2023, 18:27 [IST]
English summary
International jawa yezdi day was held across the country with grand celebrations
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+