Jawa 42 Bobber బ్లాక్‌ మిర్రర్‌ బైక్‌ విడుదల.. ఆకట్టుకొనే డిజైన్‌, ఫీచర్లు..!

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జావా మోటార్‌సైకిల్స్‌ కొత్త Jawa 42 Bobber బైక్‌ టాప్‌ ఎండ్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. కొత్త జావా 42 బ్లాక్ మిర్రర్‌ బైక్‌ ధర రూ.2.25 లక్షలుగా ఉంది. ఈ బైక్‌ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కొత్త బైక్‌లో ఇంజిన్‌ మార్పులు చేసింది. ఎటువంటి డిజైన్‌ మార్పులు చేయలేదు.

జావా 42 బాబర్‌ బ్లాక్ మిర్రర్‌ బైక్‌ క్రోమ్‌ ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌ అల్లాయ్‌ వీల్స్‌తో రానుంది. డ్యూయల్‌ టోన్‌ ఫినిషింగ్‌తో ట్యూబ్ లెస్‌ టైర్లతో వస్తుంది. దీంతోపాటు ఈ బైక్‌ గేర్లు, ఇంజిన్‌ కవర్లను రీడిజైన్‌ చేశారు. దీంతోపాటు ఈ బైక్‌ సైడ్‌ ప్యానల్‌ నలుపు రంగులో ఉంటుంది. 42 బాబర్‌ బ్యాడ్జ్‌ను కలిగి ఉంది.

Jawa 42 Bobber Black Mirror bike

జావా 42 బాబర్‌ బ్లాక్ మిర్రర్‌ బైక్‌ 334 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ 29.49bhp, 32.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ స్లిప్‌, అసిస్ట్‌ క్లచ్‌తోపాటు 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

దీంతోపాటు బ్లాక్‌ మిర్రర్‌ బైక్‌లో మెకానికల్‌గా కొన్ని మార్పులు చేసింది. అలాగే rpmను 1500 నుంచి 1350 rpm కి తగ్గించింది. మెరుగైన మోనోషాక్‌ సస్పెన్షన్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ బ్లాక్‌ మిర్రర్‌ బైక్‌ ఫ్యూయల్‌ మ్యాప్‌ను అప్‌డేట్‌ చేయబడింది.

Jawa 42 Bobber Black Mirror bike

జావా 42 బాబర్‌ బ్లాక్ మిర్రర్‌ విడుదల సందర్భంగా జావా యెజ్డీ మోటార్‌సైకిల్‌ సీఈవో ఆశిష్‌ సింగ్‌ జోషి సంతోషం వ్యక్తం చేశారు. ఇంజనీర్ల శ్రమతో ఆకర్షణీయంగా తయారైందని తెలిపారు. 42 బాబర్‌కు వచ్చిన అద్భుతమైన ఫీడ్‌బ్యాక్‌ కొత్తగా విడుదల చేసిన బ్లాక్‌ మిర్రర్‌ బైక్‌ అభివృద్ధికి స్పూర్తినిచ్చిందని తెలిపారు. ఈ విభాగంలో తమ ఆధిపత్యాన్ని పటిష్టం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

జావా 42 బాబర్‌ బ్లాక్‌ మిర్రర్‌ వేరియంట్‌ స్పోక్‌ వీల్స్‌తో రానుంది. ఈ బైక్‌ అల్లాయ్‌ వీల్స్‌ ట్యూబ్‌లెస్‌ టైర్లకు అనుకూలంగా ఉంటుంది. జావా సంస్థ తన ఇంజిన్‌లో కీలక మార్పులను చేసింది. ఇంజిన్‌ లేఅవుట్‌లో థెరెటల్‌ బాడీలు 33mm నుంచి 38mmకి పెంచబడ్డాయి. ఈ బైక్‌ అడ్జస్టబుల్‌ సీట్‌, ఛార్జింగ్‌ పోర్టు, డిజిటల్ కన్సోల్‌, LED లైట్లు ఉన్నాయి.

Jawa 42 Bobber Black Mirror bike

పండుగల సీజన్‌ కావడంతో అనేక వాహన తయారీ సంస్థలు తమ కొత్త మోడల్‌ను విడుదల చేస్తున్నాయి. పండుగల సీజన్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నాయి. అధిక విక్రయాలు నమోదు చేసి సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఈ బైక్‌ ధర రూ.2,25,187 (ఎక్స్‌షోరూం, ఢిల్లీ)గా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, September 7, 2023, 15:08 [IST]
English summary
Jawa 42 bobber black mirror bike launched in india at rs2 25 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+