తక్కువ ధరలో స్కూటర్ కొనాలని చూస్తున్నారా.. అయితే Primo ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఓ లుక్కేయండి.. ధర రూ. 79,999
మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ జితేంద్ర ఈవీ టెక్.. సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలో ట్రాన్స్‌పరెంట్ స్కూటర్‌ను ప్రైమో(Primo) పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనిని సీ- త్రూ గ్లాస్ బాడీవర్క్‌తో డిజైన్ చేశారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజీకీ డిమాండ్ పెరిగిపోతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త డిజైన్లు, ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇ స్కూటర్లను సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు స్టార్టప్‌లు సైతం ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో మంచి డిమాండ్‌ను ఏర్పరచుకున్నాయి. ఈ క్రమంలో ఊహకందని తక్కువ ధరలో సరికొత్త ఇ స్కూటర్ భారత మార్కెట్లో విడుదలైంది.

మార్కెట్లోనే మొదటిసారిగా సీ- త్రూ గ్లాస్ బాడీ వర్క్‌తో ట్రాన్స్‌పరెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమోను మహారాష్ట్రకు చెందిన Jithendra EV Tech సంస్థ లాంచ్ చేసింది. విక్రయానికి అందుబాటులోకి వస్తే ఇదే మొదటి స్కూటర్. కాగా ఈ బాడీవర్క్ మోడల్‌ను ఇంకా ప్రొడక్షన్‌లో పెట్టలేదని సంస్థ వెల్లడించింది.
దీనికి బదులుగా ప్రస్తుతం ప్రైమోను నాలుగు కలర్స్ బ్లాక్, సిల్వర్, రెడ్ అండ్ వైట్ కలర్స్‌లో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. రూ. 79,999(ఎక్స్ షోరూమ్) ధరతో జితేంద్ర ఈవీ టెక్ ఈ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ విషయానికొస్తే..

జితేంద్ర ఈవీ ప్రైమో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 60 V, 26 Ah బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 కి.మీ రేంజ్ ఇస్తుంది. గంటకు 52 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. తక్కువ ధరలో లభిస్తున్న ఈ స్కూటర్ కమ్యూటర్స్‌కు బాగా సరిపోతుంది.
కొత్త ప్రైమో ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, స్ప్రింగ్ కాయిల్‌తో కూడిన హైడ్రాలిక్ ఫోర్క్‌ను ప్రవేశపెట్టారు. కాగా ఈ స్కూటర్ ప్రస్తుతానికి ఒకటే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. కాగా కొత్త సంవత్సరంలో Primo S, Primo S+ పేరుతో స్కూటర్లను లాంచ్ చేసే యోచనలో సంస్థ ఉంది. వీటిని వరుసగా 90, 130 రేంజ్‌లతో ప్రవేశపెట్టనుంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే కొత్త ప్రైమో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎకానమీ, హై స్పీడ్, బూస్ట్ రైడింగ్ మోడ్‌లను ఇందులో సంస్థ తీసుకొచ్చింది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్‌ఈడీ ల్యాంప్స్, USB ఛార్జింగ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, రివర్స్ అసిస్ట్, థర్మల్ ప్రాపగేషన్ అలర్ట్ ఇంకా అధునాతన ఫీచర్లను ఈ స్కూటర్‌లో చూడవచ్చు.
కొత్త ప్రైమో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 90/90 10 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. బ్రేకింగ్ విషయానికొస్తే ఇందులో ముందు ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్‌ను చూడవచ్చు. ఈ సరికొత్త స్కూటర్‌ను సంస్థ మూడేళ్ల వారంటీతో అందిస్తుంది. బ్యాటరీపై రెండేళ్ల వారంటీతో పాటు అదనంగా ఒక సంవత్సరం పొడిగించిన వారంటీని పొందవచ్చు.
కాగా రూ. లక్ష కంటే తక్కువ ధరలో లభిస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇదే సెగ్మెంట్‌లో లాంచ్ అయిన కైనెటిక్ గ్రీన్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గట్టి పోటీనిస్తుంది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో ఈ స్కూటర్‌ను రూపొందించారు. ఈ కొత్త ఏడాదికి కొత్త స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ప్రైమో స్కూటర్‌ను ఓ సారి పరిశీలించవచ్చు.


Click it and Unblock the Notifications








