రెట్రో స్టైల్‌తో కవాసకి నుంచి W175 స్ట్రీట్‌ బైక్ లాంచ్‌.. ధర, ఫీచర్ల వివరాలివే..

భారత మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి ఇండియా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కవాసకి W175 స్ట్రీట్ బైక్ ఈ రోజు లాంచ్‌ అయింది. గోవాలో జరుగుతున్న ఇండియా బైక్ వీక్(India Bike Week 2023) 2023లో కవాసకి ఈ సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ డిజైన్‌, ధర, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..

కొత్త Kawasaki W175 స్ట్రీట్ బైక్ రెట్రో క్లాసిక్ స్టైల్‌తో చూడగానే మొదటి లుక్‌లోనే కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాగా భారత మార్కెట్లో కవాసకి బైక్ మోడళల్లో అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉన్న బైక్ ఇదే.. రూ. 1.35(ఎక్స్‌ షోరూమ్‌) ప్రారంభ ధరతో దీనిని సంస్థ లాంచ్‌ చేసింది. కవాసకి W175 స్ట్రీట్ బైక్ డెలివరీలు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి.

Kawasaki-W175-Launch

తక్కువ ధరలో లాంచ్‌ అయిన కవాసకి W175 స్ట్రీట్ బైక్ స్ట్రీట్ సర్క్యులర్ హెడ్‌లైట్, టియర్-ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ సీట్, డబ్ల్యూ175 నుండి చంకీ ఎగ్జాస్ట్‌తో ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త స్ట్రీట్ మోడల్.. స్టాండర్డ్ మోడల్‌కు భిన్నంగా ఉండగా. వీల్స్‌ ట్యూబ్‌లెస్ టైర్‌లతో రావడం మరో ప్రత్యేకత.

కవాసకి W175 స్ట్రీట్‌ బైక్‌ 177 సీసీ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్‌ 177 సీసీ సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 7,000 rpm వద్ద గరిష్ఠంగా 12.82 bhp శక్తిని, 6,000 rpm వద్ద 13.3 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

Kawasaki-W175-Launch

సరికొత్త కవాసకి W175 స్ట్రీట్ బైక్ కూడా W175 మోడల్ మాదిరిగా అదే స్టీల్, డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ సెటప్‌తో వస్తుంది. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే.. ఈ బైక్ ముందువైపు సంప్రదాయ ఫోర్క్, వెనుక వైపున ట్విన్ షాక్‌లను కలిగి ఉండటంతో పాటు.. బైక్‌లో కొత్త 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంకా ముందు మరియు వెనుక 100/90 ట్యూబ్‌లెస్ టైర్‌లతో ఈ బైక్‌ను రూపొందించారు.

కొత్త కవాసకి W175 స్ట్రీట్ బైక్ కొలతలను చూసుకున్నట్లయితే.. 2,007 mm పొడవు, 806 mm వెడల్పు మరియు 1,050 mm ఎత్తును కలిగి ఉంది. ఈ బైక్ సీట్ ఎత్తు 786.5 మి.మీ ఉండటంతో.. రైడర్‌ సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. కాగా ఈ W175 స్ట్రీట్ బైక్ బరువు 135.2 కిలోలు కాగా.. 152mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.

కొత్త కవాసకి డబ్ల్యూ175 స్ట్రీట్ బైక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పరిశీలిస్తే.. ఇది రెండు-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌లతో ముందు భాగంలో 245ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. అదేవిధంగా ఈ బైక్ వెనుక 110mm డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. ఇంకా రైడర్లకు అదనపు భద్రత కోసం ఈ బైక్‌లో సింగిల్-ఛానల్ ABS సిస్టమ్‌ కూడా ఉంది.

కవాసకి W175 స్ట్రీట్ బైక్‌ 12.1 లీటర్ల ఫ్యూయెల్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్త కవాసకి W175 స్ట్రీట్ జపనీస్ రెట్రో మోటార్‌సైకిల్ స్ట్రీట్ మోనికర్‌తో పోలిస్తే దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కాగా దీని స్పోక్డ్ వీల్స్, ట్యూబ్డ్ టైర్లు అల్లాయ్ వీల్స్.. ట్యూబ్ లెస్ రబ్బరుతో భర్తీ చేశారు. సరసమైన ధరలో ఈ బైక్‌ను లాంచ్‌ చేయడంతో భారత మార్కెట్లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించనుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 8, 2023, 18:45 [IST]
English summary
Kawasaki w175 street bike launched at rs 1 35 lakh in india bike week 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+