Keeway నుంచి SR250 బైక్ విడుదల: ధర & వివరాలు

2023 ఆటో ఎక్స్‌పో వేదికగా హంగేరియన్ ద్విచక్ర వాహన తయారీదారు 'కీవే' (Keeway) తన SR250 నియో రెట్రో మోటార్‌సైకిల్‌ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన SR250 బైక్ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కీవే ఇండియా ఇప్పటికే SR125 విడుదల చేసింది. కాగా ఈ కొత్త సంవత్సరంలో మరో బైక్ SR250 విడుదల చేసింది. ఈ రెట్రో మోటార్‌సైకిల్‌ దేశీయ మార్కెట్లో TVS రోనిన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మరియు కవాసకి W175 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున భారతదేశంలో ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికి ఇందులో కొన్ని అప్డేటెడ్ మార్పులు ఉన్నాయి.

Keeway నుంచి SR250 బైక్ విడుదల

కీవే SR250 మోటార్‌సైకిల్‌ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ రౌండ్ హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, క్రోమ్ సరౌండ్‌లతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సిలిండర్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్, నాబ్డ్ టైర్లు మరియు స్పోక్డ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఇందులో సింగిల్ పీస్ సీటు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బైకులో కలర్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, LED DRL లు, హజార్డ్ స్విచ్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ వంటి ఆధునిక ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇందులో డ్యూయల్ ఛానల్ ABS కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా మంచి రైడింగ్ అనుభూతిని అందించడంలో సహాయపడతాయి.

Keeway నుంచి SR250 బైక్ విడుదల

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కీవే SR250 మోటార్‌ సైకిల్ 223 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7,500 rpm వద్ద 16 bhp పవర్ మరియు 6,500 rpm వద్ద 16 Nm గరిష్ట టార్క్‌ విడుదల చేస్తుంది. కావున పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉంటుందని ఆశిస్తున్నాము. కీవే SR250 బైక్ బరువు కేవలం 120 కేజీలు మాత్రమే కావున రైడింగ్ చేయడానికి చాలా తేలికగా ఉంటుంది.

కీవే SR250 మంచి సస్పెన్షన్ సెటప్ (టెలిస్కోపిక్ ఫ్రంట్) కలిగి, ఉత్తమమైన బ్రేకింగ్ సిస్టం కూడా పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ వెనుక భాగంలో 210 మిమీ డిస్క్ బ్రేక్ వంటివి ఉన్నాయి. ఈ కొత్త కీవే SR250 బైక్ ఇప్పటికీ అందుబాటులో ఉన్న కీవే SR125 కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలైనప్పటికీ దానికి తగిన ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. కావున ఇది దేశీయ మార్కెటు తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

Keeway నుంచి SR250 బైక్ విడుదల

ఇప్పటికే దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కీవే SR125 బైక్ ధర రూ. 1,19,000 (ఎక్స్ షోరూమ్ - ఇండియా). అయితే ఈ బైక్ మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోసీ రెడ్, గ్లోసీ బ్లాక్ మరియు గ్లోసీ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ధరలు మాత్రం అన్నీ ఒకే విధంగా ఉంటాయి, కలర్ ఆప్సన్ బట్టి ధరలు మారే అవకాశం లేదు.

కొత్త కీవే ఎస్ఆర్125 బైక్ సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, 125సీసీ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 9.7 హెచ్‌పిపవర్ మరియు 8.2 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పర్ఫామెన్స్ అందించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో 14 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ బరువు 200 కేజీల వరకు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 12, 2023, 7:15 [IST]
English summary
Keeway sr250 motorcycle launched in 2023 auto expo price and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+