తక్కువ ధరలో కైనెటిక్‌ ZULU ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. 104 కి.మీ రేంజ్‌, అదిరిపోయే ఫీచర్లు

ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ తయారీదారు కైనెటిక్ గ్రీన్ తన సరికొత్త ZULU ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. పుణెకు చెందిన కైనెటిక్ గ్రీన్(Kinetic Green) సోమవారం భారత మార్కెట్లోకి ఈ సరికొత్త జులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ బ్యాటరీ, ధర, ఫీచర్లు, డిజైన్‌ పూర్తి సమాచారం ఈ కథనంలో..

కైనెటిక్‌ గ్రీన్‌ ఈ సరికొత్త జులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 94,990 ఎక్స్-షోరూమ్‌ ధరతో ప్రవేశపెట్టింది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సరసమైన ధరలో లభిస్తున్న ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా బుక్‌ చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్‌సైట్ లేదా కంపెనీ డీలర్‌షిప్‌లను సందర్శించవచ్చు.

Kinetic-Zulu-Electric-Scooter

కైనెటిక్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 2.27 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇందులో ఉపయోగించే హబ్ ఎలక్ట్రిక్ మోటార్ (హబ్ - ఎలక్ట్రిక్ మోటార్) గరిష్ఠంగా 2.8 బిహెచ్‌పి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దీని బ్యాటరీ ప్యాక్‌ను 15-amp సాకెట్‌ని ఉపయోగించి 30 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కొత్త కైనెటిక్ ZULU ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జింగ్‌పై 104 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని సంస్థ తెలిపింది. కాగా గరిష్ఠంగా గంటకు 60 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది.

Kinetic-Zulu-Electric-Scooter

కొత్త కైనెటిక్‌ జులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో యువ కస్టమర్లను ఆకర్షించే డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. ప్రధానంగా ఇందులో LED హెడ్ ల్యాంప్, LED DRL, డిజిటల్ స్పీడోమీటర్ (Digital Speedometer), ఆటో-కట్ ఛార్జర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ ఇంకా డజన్ల కొద్దీ అధునాతన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

కొలతల(Dimensions) పరంగా, Kinetic ZULU ఎలక్ట్రిక్ స్కూటర్ పొడవు 1,830 mm, వెడల్పు 715 mm మరియు ఎత్తు 1,135 mm గా ఉంది. ఈ సరికొత్త ఇ స్కూటర్‌ 1,360 మి.మీ కొలిచే వీల్‌బేస్‌తో పాటు 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 93 కిలోలు కాగా.. 150 కిలోల వరకు బరువును మోసే సామర్థ్యం ఉంది.

Kinetic-Zulu-Electric-Scooter

కొత్త కైనెటిక్‌ ZULU ఎలక్ట్రిక్ స్కూటర్ సస్పెన్షన్ సెటప్, బ్రేకింగ్ సిస్టమ్‌ గురించి చెప్పాలంటే.. ఇది ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉందని సంస్థ వెల్లడించింది. ఇంకా ఇందులో ఫ్రంట్ ఫోర్క్స్ మరియు అరుదైన డ్యూయల్ షాక్ సస్పెన్షన్ సెటప్‌ను కూడా చూడవచ్చు.

దేశీయ మార్కెట్లో స్టార్టప్‌ స్థాయిల నుంచి ఎదిగి నం.1 గా ఉన్న ఓలా మరియు ఒకినావా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు కైనెటిక్‌ స్కూటర్‌ పోటీగా వస్తోంది. కొత్త కైనెటిక్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత్‌లోనే తయారు చేయబడతాయి. కాగా ఈ స్కూటర్‌ డెలివరీలు 2024 ప్రారంభంలో ఉండనున్నాయి.

కాగా రానున్న ఐదేళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కైనెటిక్ కంపెనీ వెల్లడించింది. రూ. లక్ష లోపు తక్కువ ధరలో ఈ కైనెటిక్‌ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌ కావడంతో రానున్న రోజుల్లో విపరీతమైన డిమాండ్‌ను కలిగి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

More from DriveSpark

Article Published On: Monday, December 11, 2023, 16:42 [IST]
English summary
Kinetic green zulu electric scooter launched in india price features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+