KTM 250 Duke 2024 బైక్‌ విడుదల.. కొత్త డిజైన్‌ సహా కీలక ఫీచర్లు..!

భారత మార్కెట్లో KTM బైక్‌లకు గణనీయంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా యువత ఈ మోటార్‌సైకిళ్లకు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడంలో భాగంగా కొత్త KTM 250 Duke మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.2.39 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.

ఈ KTM 250 డ్యూక్‌ మోటార్‌సైకిల్‌ కొత్త ఛాసిస్‌, సబ్‌ ఫ్రేమ్‌ సహా పాత మోడల్‌ పోలిస్తే భారీగా అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. డిజైన్‌ కూడా బాగా ఆకట్టుకుంటుంది. కొత్త KTM 250 డ్యూక్‌ మోటార్‌ సైకిల్‌ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 25mm నుంచి 171mm వరకు పెరిగింది.

KTM 250 Duke 2024

KTM 250 Duke మోటార్‌ సైకిల్‌ 249cc సింగిల్‌ సిలిండర్‌, DOHC లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 9250rpm వద్ద 30.57bhp శక్తి, 7250rpm వద్ద 25Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పాత మోడల్‌ బైక్‌ కంటే భిన్నంగా ఉంటుంది. అధిక rpm వద్ద గరిష్ఠ శక్తి ఉత్పత్తి చేయడమే కాకుండా, తక్కువ rpm వద్ద గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్‌ ముందు భాగంలో ప్రీ లోడ్‌ అడ్జస్టబుల్‌ USD ఫోర్క్‌లు, వెనుక వైపున మోనోషాక్‌ సన్పెన్షన్‌ సిస్టమ్‌తో వస్తుంది. బ్రేకింగ్‌ వ్యవస్థ విషయానికి వస్తే ముందువైపు 320mm డిస్క్‌, వెనుకవైపు 240mm డిస్క్‌ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. బ్రేకింగ్‌ వ్యవస్థకు డ్యూయల్‌ ఛానల్‌ ABS సపోర్టుతో వస్తుంది.

KTM 250 Duke 2024

డిజైన్‌ పరంగా కొత్త kTM 250 డ్యూక్‌ 2024 బైక్ అత్యాధునిక ఫ్రేమ్‌లతో వస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే భారీగా రీడిజైన్‌ చేశారు. అల్లాయ్‌ వీల్స్‌తో అందుబాటులో ఉంటుంది. పెద్ద ఇంధన ట్యాంక్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతోపాటు ముందువైపు నుంచి షార్ప్‌ లుక్స్‌ను కలిగి ఉంటుంది.

ఎలక్ట్రానిక్‌ ఆరెంజ్‌, సిరామిక్‌ వైట్‌ రంగుల్లో ఈ మోటార్‌ సైకిల్‌ అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌ క్విక్‌షిఫ్టర్‌, రైడ్‌ బై వైర్‌, స్లిప్పర్‌ క్లచ్‌, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీతో కూడిన 5 అంగుళాల LCD డిస్‌ప్లే, 800mm సీట్‌ను కలిగి ఉంటుంది.

KTM 250 Duke మోటార్‌ సైకిల్‌పై ఆసక్తి ఉన్నవారు రూ.4499 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ మధ్యలో డీలర్‌షిప్‌లకు చేరుకుంటుంది. అనంతరం కొద్ది రోజుల్లో డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఈ బైక్‌ను పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసింది. ఈ సమయంలో కస్టమర్లను గణనీయంగా ఆకట్టుకోవచ్చని భావిస్తోంది.

* ఈ బైక్‌తోపాటు కొత్త KTM 390 డ్యూక్‌ 2024 బైక్‌ కూడా విడుదల అయింది. ఈ బైక్‌ 399cc సింగిల్‌ సిలిండర్‌ DOHC లిక్విడ్‌ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్‌ 8500 rpm వద్ద 45.37 bhp మరియు 6500 rpm 39Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్‌ సస్పెన్షన్‌ ప్రీలోడ్‌ అడ్జస్టబుల్‌ రీబౌండ్‌ అడ్జస్ట్‌మెంట్‌ సెటప్‌ను కలిగి ఉంది. ముందు వైపు USB ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్‌ సెటప్‌తో వస్తుంది. ఈ బైక్‌ ధర రూ.3.11 లక్షల (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ బైక్‌ అద్భుతమైన పనితీరు, హార్డ్‌వేర్‌తో ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకుంటుందని సంస్థ భావిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 11, 2023, 13:28 [IST]
English summary
Ktm 250 duke 2024 bike launched in india at rs 2 39 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+