ఇదెక్కడి స్కూటీ మావా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 333 కి.మీ వెళ్లొచ్చు..!
మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే..అయితే ఈ కథనం మీకోసమే. మార్కెట్లో లిభిస్తున్న స్కూటర్లను తలదన్నేలా మన హైదరాబాద్ బ్రాండ్ బ్రిస్క్ సంస్థ ఓ అద్భుత EV స్కూటర్ ను లాంఛ్ చేసింది. దేశంలోనే అత్యధిక రేంజ్ ను ఇవ్వనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ సరికొత్త EV చరిత్ర సృష్టించనుంది.
దేశంలో EVల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. అందులో భాగంగా సంప్రదాయ ఇంధన వాహనాలకు కాలం చెల్లుతోంది. భవిష్యత్ ఈ వాహనాలదే అని సంకేతాలు అందిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాయితీలను కల్పిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో EVల ట్రెండ్ కనిపిస్తోంది. అంటే ఇకపై పూర్తి పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాలు రోడ్లపై తిరుగుతాయనడంలో ఎటవంటి సందేహం లేదు.

ఎలక్ట్రిక్ వాహానాలు పెరుగుతుండటంతో కొన్ని దిగ్గజ కంపెనీల పోటి పడి మరీ అధునాతన ఫీచర్లతో ఎక్కువ రేంజ్ ను అందించడంపై దృష్టి సారిస్తున్నాయి. తమ బిజినెస్ ను విస్తరించేందుకు విభిన్న ఆఫర్లతో పాటు పోటీ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఎక్కవ రేంజ్ కల్పించడంపై ఫోకస్ చేస్తున్నాయి. ఆ కోవాలోనే తీసుకువచ్చిన న్యూ మోడల్ బ్రిస్క్ ఎలక్ట్రిక్ స్కూటర్.
సింగల్ ఛార్జ్ తో 333 కిలోమీటర్ల రేంజ్..
ఈ రోజుల్లో ఎన్ని రకాల ఫీచర్లు ఉన్నా.. వాటి ధర, అలాగే రేంజ్ విషయంలో వినియోగదారులకు అసంతృప్తి చెందుతున్నారు. ఈ కారణంతోనే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు దేశంలో పెరగడం లేదు. అందులోనూ EVలు పేలుతున్నాయనే భావన జనాల్లో బలంగా నాటుకుపోయింది. తాజాగా కొన్ని కంపెనీలు వీటిపై దృష్టి సారిస్తూ పేలుడును నివారించగలుతున్నాయి. అవన్నీ వదంతులే వందలో ఒకటి రెండు చోట్ల మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయని ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు చెప్తున్నాయి.

అయితే బ్రిస్క్ తీసుకువస్తున్న బ్రిస్క్ ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ రేంజ్ ను కలిగిన స్కూటర్ గా చరిత్ర సృష్టించనుంది. ఒక్క చార్జ్ తో ఏకంగా 333 కిలోమీటర్ల రేంజ్ వరకు దీనిపై ప్రయాణించవచ్చు. అంటే హైదరాబాద్ to విజయవాడకు సింగల్ ఛార్జ్ తో వెళ్లవచ్చు అన్నమాట. హైదరాబాద్ లో తాజాగా ఈ స్కూటర్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆరిజిన్, ఆరిజిన్ ప్రో పేరిట స్కూటర్లను తయారు చేస్తుంది.
ఆరిజిన్ ప్రో..
కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని ఆరిజిన్ ప్రో చేరుకోగలదు. ఈస్కూటర్ పై గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఇందులో 4.8 kwh ఫిక్స్డ్ బ్యాటరీని అమర్చారు. 2.1kwh స్వాపబుల్ బ్యాటరీని అమర్చింది. ఈ స్కూటర్ లోని మోటార్ కెపాసిటీ 5.5 kwగా ఉంది. ఇంకా ఇందులో ఓటీఏ బ్లూ టూత్, మొబైల్ యాప్ కనెక్టివిటీ సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.1.2 లక్షల నుంచి రూ. 1.4 లక్షల దాకా ఉండే అవకాశం ఉంది.

ఆరిజిన్..
మరొక స్కూటర్ ఆరిజిన్ కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మి వేగంతో అందుకుంటుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 175 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర దాదాపు రూ. 70వేల నుంచి రూ.80 వేల దాకా ఉండే అవకాశం ఉంది. ఇది గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో కూడా ఓటీఏ బ్లూటూత్, మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి.
అక్టోబర్ లో విడుదల..
పైన తెలిపిన స్కూటర్లను అక్టోబర్ విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఈ ఎక్కవ రేంజ్ కలిగిన సూపర్ స్కూటర్ కోసం ఇంకా ఏడు నెలలు ఆగాల్సిందే అన్నమాట. సింగల్ ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించాలి అనుకునే వారు ఈ స్కూటర్ ను కొనుగోలు కచ్చితంగా చేయవచ్చు. మార్కెట్ ప్రస్తుతం ఉన్న కంపెనీల కంటే ఈ కంపెనీ ఆఫర్ చేసే రేంజ్ ఎక్కవ కావడం ఈ స్కూటర్ కు కలిసివచ్చే అంశం.


Click it and Unblock the Notifications








