ఈ ఏడాది లాంచ్ అయిన టాప్ 5 స్కూటర్లు ఇవే.. స్మార్ట్ కీ ఫీచర్, తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్స్.!!
భారత్‌లో కార్ల కంటే ద్విచక్ర వాహనాల వినియోగమే ఎక్కువ. అందుకే టూ వీలర్ల విక్రయాల్లో దేశం ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రముఖ కంపెనీలు ఆకర్షణీయమైన మోడళ్లలో ద్విచక్ర వాహనాలను విడుదల చేశాయి. 2023లో లాంచ్ అయిన టాప్ 5 స్కూటర్ల సమాచారం ఈ కథనంలో..
హోండా యాక్టివా 6G స్మార్ట్ కీ(Honda Activa 6G Smart Key): హోండా నుంచి ప్రముఖ స్కూటర్ యాక్టివా. దేశంలో చాలా మందికి చాలా ఏళ్లుగా ఇది ఫేవరెట్ స్కూటర్. అయితే కార్లలో మాత్రమే అందుబాటులో ఉండే స్మార్ట్ కీ ఫీచర్‌ను పొందిన మొదటి పెట్రోల్ స్కూటర్ యాక్టివా 6G.

స్మార్ట్ కీ సౌకర్యంతో ఇది స్కూటర్ ప్రియులకు ఫేవరెట్‌గా మారింది. అంతే కాకుండా యాక్టివా 6Gలో హోండా ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తోంది. హోండా కీలెస్ ఫ్యూయల్ లిడ్, రిమోట్ హ్యాండిల్ బార్ లాకింగ్ మరియు అన్‌లాకింగ్, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ. 76,234(ఎక్స్ షోరూమ్).
హీరో జూమ్ (Hero Xoom): భారత మార్కెట్లో హీరో సంస్థ నుంచి విడుదలైన స్కూటర్ మోడల్ హీరో జూమ్. వినూత్న డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. యూత్‌ను ఆకట్టుకునేందుకు ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌సీడి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్, కార్నర్ లైట్ మరియు యుఎస్‌బి ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

మోటారు విషయానికి వస్తే, హీరో జూమ్ స్కూటర్ 110.9 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ మోటారుతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 8.05 bhp శక్తిని మరియు 8.70 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ఇందులోని ఫీచర్లు, హార్డ్‌వేర్ ప్రకారం ధరలు మారుతుంటాయి.
ఓలా ఎస్1ఎక్స్(Ola S1X): భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌లో ఓలా ఇండియా లాంచ్ చేసిన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఓలా S1X. ఈ స్కూటర్‌ను మూడు వేరియంట్లలో సంస్థ ప్రవేశపెట్టింది. కాగా దీని ప్రారంభ ధర రూ. 89,999 ఉండగా.. గరిష్ఠంగా రూ. 1.09 లక్షలుగా ఉంది.

Ather 450X అండ్ 450S: భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగాన్ని విస్తరించేందుకు ఏథర్ నుంచి విడుదలైన స్కూటర్లు.. ఏథర్ 450X మరియు 450S. వీటిలో 450S ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ సరసమైన ధరలో లభిస్తుంది. ఈ రెండు స్కూటర్లు విభిన్న బ్యాటరీ ఆప్షన్లను కలిగి ఉంది.
ఈ రెండు స్కూటర్లు ఏథర్ 450S, ఏథర్ 450X వరుసగా 2.9 kWh మరియు 3.7 kWh బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. కాగా 450X కొంచెం ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్. దీని ధర రూ. 1.37 లక్షల నుండి రూ. 1.44 లక్షలు కాగా.. 450S మోడల్ ధర రూ. 1.30 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.

బజాజ్ చేతక్ అర్బన్ (202 Bajaj Chetak Urbane): భారతీయ మార్కెట్లో చాలా కాలంగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలను కొనసాగిస్తోంది. కాగా దీని ధర కాస్త ఎక్కువ. అందుకే తక్కువ ధరలో చేతక్ అర్బన్ స్కూటర్‌ను తీసుకువచ్చారు. దీని ధర రూ. 1.15 లక్షలుగా ఉంది.

బజాజ్ చేతక్ అర్బన్ స్కూటర్ రెండు వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. అధునాతన వేరియంట్ 73 kmph మరియు స్టాండర్డ్ వేరియంట్ 63 kmph స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. ఇందులో హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, ఫుల్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ట్యాంపర్ అలర్ట్, OTA అప్‌డేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








