Electric Scooter 12 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అయ్యే స్కూటర్లు త్వరలోనే విడుదల..
తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ బైకుల కంపెనీ క్వాంటమ్ ఎనర్జీ సరికొత్త లుక్‌తో మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌స్కూటర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో వాణిజ్య డెలివరీల కోసం దీనిని ప్రవేశపెట్టంది. తాజాగా ఆ కంపెనీ మరో క్రేజీ అప్‌డేట్‌తో మన ముందుకొచ్చింది. వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన బ్యాటరీ టెక్ స్టార్టప్ లాగ్ 9 బిజినెస్‌లైట్ (Log9 Bzinesslite) కార్గో ఇ-స్కూటర్‌ను విడుదల చేయడానికి హైదరాబాద్ EV OEM క్వాంటమ్ ఎనర్జీ(Quantun Energy)తో జతకట్టింది. హైపర్ లోకల్ డెలివరీల కోసం నగరంలోని విజ్జీ లాజిస్టిక్స్‌తో టై అప్ కాగా.. మొదటి 200 బిజినెస్‌లైట్ ఇ-స్కూటర్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ 2-వీలర్ కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనంగా సరికొత్త Bzinesslite కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు గాంచిందని లాగ్9 మరియు క్వాంటమ్ ఎనర్జీ పేర్కొంది. ఈ ఇ స్కూటర్‌లో Log9 యొక్క RapidX 2000 ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను ఉపయోగించారు. ఈ బ్యాటరీ ప్యాక్ కేవలం 12 నిమిషాల్లో జీరో నుంచి పూర్తిగా ఛార్జ్ చేయగలదని కంపెనీలు పేర్కొంటున్నాయి.
రెండు ఈవీ పరిశ్రమ స్టార్టప్‌ల సహకారంతో అనగా క్వాంటమ్ ఎనర్జీ (Quantum Energy) మరియు లాగ్ (Log9) నుంచి కొత్త Bzinesslite స్కూటర్లు విడుదల అవుతుండగా.. మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 10,000 వాణిజ్య ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించాయి.

చివరి మైలు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా సురక్షిత డెలివరీలు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఫాస్ట్ ఛార్జింగ్ మరియు లాంగ్ లైఫ్ సైకిల్ వాహనాల ప్రయోజనాలకు ప్రజలకు అందించనున్నాయి. Log9 యొక్క అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ టెక్ ద్వారా ఆధారితమైన Quantum Energy Bzinesslite భారతదేశంలో లాస్ట్ - మైల్ డెలివరీ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని చూస్తోంది.
భాగస్వామ్యం మరియు కొత్త బిజినెస్‌లైట్ కార్గో ఇ-స్కూటర్ లాంచ్ గురించి లాగ్ 9 సీఏఓ, సహ వ్యవస్థాపకుడు కార్తిక్ హజెలా మాట్లాడుతూ " క్వాంటం ఎనర్జీతో భాగస్వామ్యం చేయడంలో మేము సంతోషిస్తున్నాం. భారత్‌లోని లాస్ట్-మైల్ లాజిస్టిక్స్ సెక్టార్, ఇది భారతదేశ మొబిలిటీ మరియు శక్తి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని భావిస్తున్నాం.' అని అన్నారు.
ఫాస్ట్ చార్జింగ్ మరియు దీర్ఘకాలం ఉండే RapidX 2000 బ్యాటరీ క్వాంటమ్ యొక్క 2W, బిజినెస్‌లైట్ అనుసంధానించి లాజిస్టిక్స్ రంగానికి తీసుకువస్తున్నామని లాగ్ 9 సీఓఓ తెలిపారు. ఇది దేశ వాతావరణ పరిస్థితులను తట్టుకుని అత్యంత వేగవంతమైన ఛార్జింగ్‌ను ఇస్తుందని వెల్లడించారు.
'Log9 భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మా విప్లవాత్మక ఉత్పత్తి "బిజినెస్‌లైట్"ని పరిచయం చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము "దీన్ని ప్లగ్ చేయండి. ఛార్జ్ చేయండి. పునరావృతం చేయండి. అపరిమిత ఫాస్ట్ ఛార్జ్, ఒత్తిడి లేని ప్రయాణ సౌకర్యాన్ని ఆస్వాదించండి."' అని క్వాంటమ్ ఎనర్జీ డైరెక్టర్ చక్రవర్తి సి పేర్కొన్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








