బైక్ లలో ఈ ఎలక్ట్రిక్ బైక్ చాలా ఫేమస్.. క్రేజీ లుక్ తో పాటు 125 కి.మీ రేంజ్..!

గుజరాత్‌ కు చెందిన EV స్టార్టప్ మేటర్ తమ తొలి ఎలక్ట్రిక్ బైక్ ఏరాను (Matter Aera) విడుదల చేసింది. Matter Aera ఎలక్ట్రిక్ బైక్‌ లో నాలుగు మోడళ్లలో తీసుకురానుంది. 4000, 5000, 5000+, 6000+ వేరియంట్లలో ఈ బైక్స్ ని ప్రవేశ పెట్టింది. Aera 5000 ధర ₹14 3,999 కాగా, 5000+ ధర ₹153,999 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.

6000+ మినహా అన్ని వేరియంట్ ల ధరలు 125 కిమీల రేంజ్ లో రానున్నాయి. ఏరా 6000+ మాత్రం 150 కి.మీ రేంజ్ కలిగి ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మ్యాటర్ 5000, 5000+ వేరియంట్లలో మాత్రమే తీసుకురానుంది. మిగతా మోడళ్లను ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయాన్ని వెల్లడించలేదు.

మేటర్ ఈ బైక్

సబ్సిడీ ద్వారా ప్రీ-రిజిస్ట్రేషన్..

Aera బైక్ ప్రీ-రిజిస్ట్రేషన్‌ లు త్వరలోనే ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ప్రీ-రిజిస్ట్రేషన్ సబ్సిడీలు, GST స్లాబ్ లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటి ధరను తగ్గించేందుకు పరిశీలిస్తున్నామని మేటర్ సంస్థ తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలను కూడా ఈ బైక్ పై వినియోగదారులు పొందవచ్చని మేటర్ వెల్లడించింది.

డిజైన్..

మ్యాటర్ ఏరాను మొదటగా ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. ఆకర్షించే డిజైన్ 4G కనెక్టివిటీతో దీనిని రూపొందించారు. 7.0-అంగుళాల పూర్తి-డిజిటల్ LCD వంటి ప్రీమియం ఫీచర్‌ లను కలిగి ఉంది. పూర్తి ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ తో ఈ బైక్ నడుస్తుంది. ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ తో ఈ బైక్ వస్తుంది. 10.5kW లిక్విడ్ కూల్ మోటార్‌ తో పాటు 5kWh బ్యాటరీ ప్యాక్‌ తో రానుంది.

మేటర్ బైక్

జియోఫెన్సింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, వెహికల్ హెల్త్ మానిటరింగ్, పూర్తి రైడ్ స్టాటిస్టిక్స్ ఫీచర్‌ లను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. కీలెస్ ఎంట్రీ సిస్టమ్‌ తో మ్యాటర్ ఏరా వస్తుంది. ఈ బైక్‌ ను సమీపించడం ద్వారా వాహనాన్ని లాక్ లేదా అన్‌ లాక్ చేయడానికి రైడర్‌ కు అవకాశం ఉంది. మరిన్నీ అత్యాధునిక ఫీచర్లు ఈ బైక్ లో పొందవచ్చు.

మ్యాన్ వల్ గేర్ లో తొలిసారి..

సాంప్రదాయిక బైక్స్ కంటే భిన్నంగా ఈ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్‌ తో బైక్ వస్తుంది. భారత్ లో ఇదే తొలి బైక్ కావడం విశేషం. అత్యంత ఆధునిక హంగులు జోడించి Aera బైకును అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని మేటర్ గ్రూప్ CEO మోహల్ లాల్ భాయ్ తెలిపారు. వినియోగదారులకు ఆసక్తికరమైన ధరతో సరికొత్త ఆప్షన్లతో ఈ సరికొత్త బైక్ ను అందించనున్నట్టు ఆయన వెల్లడించారు.

మేటర్ బైక్

రెండు గంటల్లో ఫుల్ ఛార్జింగ్..

ఈ బైక్ ఆరు సెకన్లలోపు 0-60కిమీ వేగాన్ని అందుకుంటుంది. సాధారణ ఛార్జింగ్ ద్వారా 5 గంటల్లో, ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 2 గంటలలోపు బ్యాటరీని ఫుల్ చేయవచ్చని సంస్థ తెలిపింది. ఎలక్ట్రిక్ బైక్, బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీని కంపెనీ అందిస్తుంది. ఈ బైక్ 'ట్యాంక్'పై చిన్న 5 లీటర్ గ్లోవ్‌ బాక్స్‌ అందుబాటులో ఉంది. ఇలాంటి ఫీచర్ మరే ఇతర బైకులలో అందుబాటులో లేదు.

ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ను ఆహ్వానిస్తున్న కంపెనీ కేవలం ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, పూణె, చెన్నై, హైదరాబాద్ ప్రధాన నగరాల్లో ప్రస్తుతానికి బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే డెలివరీల గురించి అధికారిక సమాచారం అందకపోయినప్పటికీ, అతి త్వరలోనే డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సరికొత్త బైక్ వినియోగదారులను పక్కా ఆకర్షిస్తుందనడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

More from DriveSpark

Article Published On: Friday, March 3, 2023, 11:25 [IST]
English summary
Matter aera launches first ever e bike in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+