రూ. లక్ష లోపు ధర, 50 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్.. ఈ బెస్ట్ స్కూటర్లను అస్సలు మిస్ చేసుకోకండి!!
భారత మార్కెట్లో బైక్‌లతో సమానంగా స్కూటర్లకూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. మహిళలు, ఏజ్ పైబడిన వారు ఎక్కువగా స్కూటర్లకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే బైక్, స్కూటర్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. బైక్‌లతో పోలిస్తే స్కూటర్లు మైలేజ్ కాస్త తక్కువగా ఇస్తాయి. అయితే ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు కొన్ని కారణాలున్నాయి.
ఈ నేపథ్యంలో మీకు నచ్చిన స్కూటర్ కొనుగోలు చేసేముందు మీరు మైలేజ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం మీరు కొంచెం టైం తీసుకుని పరిశీలిస్తే మార్కెట్లో అధిక మైలేజీని అందించే స్కూటర్లు కూడా ఉన్నాయి. బెస్ట్ మైలేజ్‌ను అందించే.. రూ. 1 లక్షలోపు 5 స్కూటర్ల వివరాలను ఇక్కడ ఈ కథనంలో అందిస్తున్నాం.

Honda Activa 6G: భారత మార్కెట్లో హోండా యాక్టివా నంబర్ వన్ స్కూటర్‌గా నిలిచింది. ప్రస్తుతం హోండా యాక్టివా 6G అధునాతన సౌకర్యాలతో అందుబాటులో ఉంది. ఇందులో ఎల్‌ఈడీ లైట్ల నుంచి ఫ్యూయల్ ఇంజెక్షన్ వరకు అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను ఇందులో ఇచ్చారు.
హోండా యాక్టివా 6G 110 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 7.7 bhp పవర్ 8.4 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. లీటర్‌కు 60 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. Activa 6G స్కూటర్ ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర రూ.73,086 గా ఉంది.

TVS Jupiter 125: మార్కెట్లో హోండా యాక్టివాకు పోటీగా TVS మోటార్స్ ప్రారంభించిన స్కూటర్ టీవీఎస్ జూపిటర్. TVS స్కూటర్‌లు సాధారణంగా వాటి అండర్-సీట్ స్పేస్‌తో కస్టమర్ల నుంచి ఆదరణ పొందాయి. అదేవిధంగా కొత్త జూపిటర్ 125 స్కూటర్‌లో డిజిటల్ అనలాగ్ క్లస్టర్, LED హెడ్‌లైట్లు డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.
టీవీఎస్ జూపిటర్ 125.. 124.8 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8 bhp పవర్ 10.5 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. లీటర్‌కు 50 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. ధర రూ. 82,825 (ఎక్స్ షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది.

కొత్త సుజుకి యాక్సెస్ 125 ఫీచర్లు, పర్ఫామెన్స్ పరంగా హోండా, TVS 125cc స్కూటర్లకు ఏమాత్రం తీసిపోదు. మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర కూడా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. Access 125 స్కూటర్‌లో LED హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, పొడవైన ఫుట్‌బోర్డ్ వంటి ఫీచర్ల ప్యాక్‌తో ఉంది.
సుజుకి యాక్సెస్ 125.. 124 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8.5 bhp పవర్ 10 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. లీటర్‌కు 64 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. ధర రూ. 77,600(ఎక్స్ షోరూమ్).

Hero Maestro Edge 125: 125 సీసీ స్కూటర్ సీసీ లైనప్‌లో ఖరీదైన స్కూటర్ ఇదే అని చెప్పవచ్చు. ఎందుకంటే మాస్ట్రో ఎడ్జ్ ప్రారంభ ధర రూ. 86 వేల( ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LED టెయిల్‌ల్యాంప్, మొబైల్ ఛార్జర్, అండర్-సీట్ ల్యాంప్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 124.6 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 9 bhp పవర్ 10.4 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. లీటర్‌కు 60 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. ధర రూ. 86,256(ఎక్స్ షోరూమ్).

Yamaha Ray ZR: Maestro Edge వంటి మరింత షార్ప్ లైన్‌లతో Yamaha 125cc స్కూటర్ రే ZR స్కూటర్‌ను రూపొందించారు. దీని బరువు కేవలం 98 కిలోలుగా ఉంది. దీంతో అత్యంత తేలికగా స్కూటర్‌గా చెప్పవచ్చు. రే ZR స్కూటర్‌లో స్మార్ట్ మోటార్ జనరేటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది.
యమహా రే ZR స్కూటర్ 125 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8.08 bhp పవర్ 10.3 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. లీటర్‌కు 68 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. ధర రూ. 90,380(ఎక్స్ షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








