MotoGP Bharat 2023 యమహా ఉద్యోగులతో ప్రముఖ అంతర్జాతీయ రేసర్ల ఇంటరాక్షన్‌..

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రేసింగ్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ ఈవెంట్‌ MotoGP ఈ సారి భారత్‌లో జరుగుతుండటంతో.. దేశంలోని రేసింగ్‌ లవర్స్‌కు కొత్త ఉత్సాహానిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ రేసర్లు ఈ రేస్‌లో పాల్గొంటుండటంతో ఈవెంట్‌ను చూసేందుకు వేల సంఖ్యలో ఫ్యాన్స్‌ తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రేసర్లతో యమహా(Yamaha) సంస్థ ఉద్యోగులు ఇంటరాక్షన్‌ నిర్వహించడం ఆసక్తిని రేకెత్తించింది.

దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న MotoGP భారత్ 2023 ప్రారంభ ఎడిషన్‌ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో అట్టహాసంగా ప్రారంభమైంది. బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో నేటి నుంచి ఈ నెల 24 వరకు ఈ ఈవెంట్‌ జరగనుంది. ఈ క్రమంలో ఫాబియో క్వార్టరారో, ఫ్రాంకో మోర్బిడెల్లి, జట్టులోని ఇతర రైడర్లు.. సూరజ్‌పూర్ ఫ్యాక్టరీలో 1000 మంది యమహా ఉద్యోగులను కలుసుకున్నారు.

MotoGP-Bharath-India-Empoyees

గురువారం సూరజ్‌పూర్‌ ఫ్యాక్టరీలోని 1000 మంది ఉద్యోగులను ఫాబియో క్వార్టరారో(Fabio Quartararo), ఫ్రాంకో మోర్బిడెల్లి(Franco Morbidelli) ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నారు. MotoGP Bharat సందర్భంగా యమహాకు చెందిన 1000 మందికి పైగా ఉద్యోగుల్లో ఉత్సాహం రేకెత్తించేందుకు యమహా ఇండియా మోటార్స్‌ గురువారం meet & greet ఈవెంట్‌ను నిర్వహించింది.

ఉత్తరప్రదేశ్‌లోని యమహా సూరజ్‌పూర్(Yamaha Surajpur Plant) ప్లాంట్‌లో జరిగిన ఈ ఈవెంట్.. యమహా రేసింగ్‌లోని ప్రపంచ స్థాయి ప్రతిభను ప్రదర్శించింది. రేసింగ్‌ సెలబ్రిటీస్‌, యమహా ఉద్యోగుల మధ్య రేసింగ్‌లో ప్రయాణంపై చర్చ జరిగింది. ప్రముఖ రేసర్లు తమ అనుభవాలు, రేసింగ్‌లో ప్రయాణాన్ని పంచుకున్నారు.

MotoGP-Bharath-India-Empoyees

ఫాబియో క్వార్టరారో మరియు ఫ్రాంకో మోర్బిడెల్లితో సహా Monster Energy Yamaha MotoGP రైడర్స్‌.. MotoGP లాంటి ఉత్కంఠభరితమైన రేసింగ్‌ కాంపిటీషన్‌లో తమ ప్రయాణం గురించి ఉత్సాహభరితమైన విశేషాలను పంచుకున్నారు. రేసింగ్‌లో వారి స్కిల్స్‌, స్ట్రాటజీ అనుభవాలను ఉద్యోగులతో షేర్‌ చేసుకున్నారు.

అంతే కాకుండా యమహా ఉద్యోగులకు ఆటోగ్రాఫ్‌లలు ఇచ్చారు. రేసింగ్‌ Yamaha ఉద్యోగులకు ఆసక్తి కలిగేలా చేశారు. ఈ ఈవెంట్ రైడర్లు, వారి భారతీయ అభిమానుల మధ్య సంబంధాన్ని మరింతగా పెంచింది. అంతే కాకుండా MotoGP రేసింగ్‌ ఈవెంట్‌పై ఆసక్తి కలిగేలా, ఔత్సాహికులకు ఈ కాంపిటీషన్‌కు మరింత తెలియజేసేలా యమహా నిబద్ధతను ప్రదర్శించింది.

MotoGP-Bharath-India-Empoyees

యమహా ఇండియా మోటార్‌ సంస్థ నిర్వహంచిన ఈ మీట్‌తో మాన్‌స్టర్ ఎనర్జీ యమహా మోటోజీపీ రైడర్లకు భారత్‌లోని అభిమానుల నుంచి అఖండ మద్దతు రావడంతో వారి ఉత్సాహానికి ప్రముఖ రేసర్లు కృతజ్ఞతలు తెలియజేసారు. మోటోజీపీ భారత్ 2023 రేస్‌లో అద్భుతమైన ప్రదర్శనను అందిస్తామని హామీ ఇచ్చారు.

Fabio Quartararo (ఫ్రాన్స్) MotoGPలో 2019 మరియు 2020లో విజయాలు సాధించడం ద్వారా విశేషమైన విజయాన్ని సాధించారు. అతని ప్రయాణం 2021లో ఫ్రాన్స్ యొక్క మొదటి ప్రీమియర్-క్లాస్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. మోటో2 ప్రపంచ ఛాంపియన్‌గా 2018లో MotoGP ర్యాంకింగ్స్‌లో చేరిన మోర్బిడెల్లి 2020 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచి తన ప్రతిభను ప్రదర్శించాడు. 2021లో, మోకాలి గాయం అతని పనితీరును ప్రభావితం చేసింది.

MotoGP-Bharath-India-Empoyees

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 22, 2023, 17:23 [IST]
English summary
Motogp bharat 2023 fabio quartararo franco morbidelli meet yamaha employees at suraj factory
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+