MotoGP Bharat ఉత్కంఠభరితంగా సాగిన మోటోజీపీ భారత్‌ రేస్‌ విన్నర్‌గా నిలిచిన మార్కో బెజ్జెచి

భారత్‌లో మొదటిసారిగా నిర్వహించిన MotoGP వరల్డ్ ఛాంపియన్‌షిప్ సీజన్ 13 నేడు ఘనంగా ముగిసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిల్‌ స్పోర్ట్స్ రేస్‌ ఈసారి గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నిర్వహించారు. రేసింగ్‌ ప్రియుల కోలాహలం, అభిమానుల మధ్య అత్యంత గ్రాండ్‌గా జరిగిన ఈ రేస్‌ల ప్రముఖ రేసర్ మార్కో బెజ్జెచి ఛాంపియన్‌గా నిలిచారు.

MotoGP Bharat 2023 ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఈ నెల 22న అట్టహాసంగా ప్రారంభమైంది. మూడురోజుల పాటు ఉత్సాహంగా కొనసాగిన ఈ రేస్‌ నేడు ఫైనల్స్‌తో ఘనంగా ముగిసింది. ప్రపంచంలోని ప్రముఖ బైక్ రేసర్లు మోటోజీపీ టైటిల్‌ కోసం పోటాపోటీగా పాల్గొన్నారు.

MotoGP-Bharat-Winner

ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌ 2011 నుంచి 2013 వరకు ఇక్కడే జరిగింది. ఇప్పుడు ఈ వేదిక ప్రొఫెషనల్ స్థాయి ఇంటర్నేషనల్‌ మోటార్‌స్పోర్ట్స్‌కు సాక్షిగా నిలవడం దేశానికే గర్వకారణం. ఈ ఈవెంట్‌ను చూసేందుకు వేలాదిగా రేసింగ్‌ అభిమానులు తరలివచ్చారు. ఈసారి మోటోజీపీ భారత్‌లోనే నిర్వహించడం బైక్‌ రేస్‌ ప్రియులకు నిజంగా పండగే అని చెప్పవచ్చు.

ప్రముఖ రేసర్‌ మార్కో బెజ్జెచి(Marco Bezzecchi) 8,649 సెకన్ల ఆధిక్యంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న MotoGP ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచారు. మార్కో బెజ్జేచి ఇండియన్ MotoGP వద్ద మూనీ VR46 రేసింగ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ప్రైమా ప్రమాక్ రేసింగ్ టీమ్‌కు చెందిన జార్జ్ మార్టిన్(Jorge Martin) రెండో స్థానంలో నిలిచారు. మాన్‌స్టర్ ఎనర్జీ యమహా ఫ్యాక్టరీ రేసింగ్ టీమ్‌కు చెందిన ఫాబియో క్వార్టరారో(Fabio Quartararo) మూడో స్థానం దక్కించుకున్నారు.

MotoGP-Bharat-Winner

ఫైనల్‌ రేస్‌ అనంతరం MotoGP వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రోఫీని అందజేశారు. మోటోజీపీ భారత్‌లో బెజ్జెచి(Marco bezzecchi) 36 నిమిషాల 59 సెకన్ల 15 మైక్రో సెకన్లలో (36.59.15) రేసును పూర్తి చేశారు.

పైనల్‌ రేస్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రేసింగ్‌ ట్రాక్‌లో రేసర్ల రైడింగ్‌ను ప్రేక్షకులు ఊపిరిబిగపట్టుకుని చూశారు. రేసులో, మార్కో బెజ్జెచి గణనీయమైన ఆధిక్యాన్ని కొనసాగించేందుకు ఆయన చేసిన క్రాష్‌లు, హై-స్పీడ్ ఛేజింగ్‌ల ద్వారా ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు. ఆధిక్యాన్ని కొనసాగిస్తూ చివరికి సవాలు లేని విజయాన్ని సాధించారు.

MotoGP-Bharat-Winner

ఉత్కంఠభరితంగా సాగిన మోటోజీపీ భారత్‌ రేసింగ్‌ను చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. వీరితో పాటు ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్, నటుడు జాన్ అబ్రహం వంటి ప్రముఖులు కూడా రేసింగ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. మొట్టమొదటి ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అక్టోబర్ 2024లో ఇండియన్ GP యొక్క తదుపరి ఎడిషన్‌కు ఇంకా నెలరోజులు మాత్రమే ఉంది.

కాగా 2023 MotoGP భారత్.. వివిధ తయారీదారుల నుండి రాబోయే కొన్ని మోడల్‌లు మరియు వెర్షన్‌లను అభిమానులకు పరిచయం చేసింది. యమహా తన కొత్త R3 మరియు MT 03 మోడళ్లను ప్రదర్శించింది. హోండా తన కొత్త రెప్సోల్ వెర్షన్లు డియో 125 మరియు హార్నెట్ 2.0లను ప్రదర్శించింది. ఇంకా కొత్త అప్రిలియా RS 457 మరియు ఓలా ఎలక్ట్రిక్ ఫ్యూచర్‌ బైక్‌లను ప్రదర్శించి యూత్‌లో జోష్‌ నింపారు.

More from DriveSpark

Article Published On: Sunday, September 24, 2023, 21:29 [IST]
English summary
Motogp bharat 2023 marco bezzecchi wins indian gp jorge martin finishes second place
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+