MotoGP Bharat రేస్‌ లైవ్‌ ఎక్కడ చూడాలి.. రేపు ఏం జరగనుంది?

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలోని బుద్ద్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో MotoGP భారత్‌ రెండో రోజు రేసింగ్‌ కొనసాగుతోంది. ఫార్ములా 1 రేసుల తర్వాత భారత్‌లో జరుగుతున్న రేసింగ్ ఈవెంట్‌ ఇది. రైడర్‌ల కోసం పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకున్నారు. ట్రాక్‌ కొన్ని చోట్ల స్ట్రెయిట్‌లను కలిగి ఉంది. ఫలితంగా ఈ ప్రాంతంలో గరిష్ఠంగా గంటకు 370 కి.మీ వేగంతో దూసుకెళ్లే అవకాశం ఉంది.

MotoGP, Moto2, Moto3 అనే విభాగాల్లో ఈ పోటీ జరుగుతుంది. ఇందులో 41 జట్ల నుంచి 82 మంది రైడర్లు పాల్గొంటున్నారు. మోటో 3 మరియు మోటో 2 విభాగాల్లో ప్రాక్టిస్‌ మరియు క్వాలిఫైయింగ్‌ రేసులు ముగిశాయి. మోటోజీపీ విభాగంలో ఉచిత ప్రాక్టిస్‌ మహియు అర్హత పోటీలు ముగిశాయి.

MotoGP Bharat live streaming

MotoGP రేసింగ్‌ ఎక్కడ చూడాలి : ఈ రేస్‌ను జియో సినిమా యాప్‌ సహా స్పోర్ట్స్‌ 18లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. సెప్టెంబర్‌ 24న కూడా రేసింగ్ కార్యక్రమాలు ఉంటాయి. ప్రపంచస్థాయి రేసింగ్ కారణంగా నోయిడా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్‌ 25 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయిని తెలిపారు.

గ్రేటర్‌ నోయిడాలోని బుద్ద్ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ రేస్‌ ట్రాక్‌ సుమారు 5 కి.మీ పొడవు మరియు 13 టర్నింగ్‌ పాయింట్లను కలిగి ఉంది. ఇందులో లక్ష మంది కూర్చొనే సామర్థ్యం ఉంది. మోటోజీపీ రేసింగ్‌ను సాధారంగా యూరోపియన్‌ దేశాల్లో నిర్వహిస్తారు. మోటోజీపీ 74 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా భారత్‌లో నిర్వహిస్తున్నారు. 2023 సంవత్సరంలో సీజన్‌లో భారత్‌ 13వ దేశం.

MotoGP Bharat live streaming

మోటోజీపీ భారత్‌ ఇవాళ్టి కార్యక్రమాలు
09:10- 09:40 - ప్రాక్టీస్‌ రేస్‌
09:55- 10:25 - ప్రాక్టీస్‌ రేస్‌
10:40 -11:10- ప్రీ రేస్‌
11:20- 11:35- క్వాలిఫైయింగ్‌ రేస్‌
11:45- 12:00 - క్వాలిఫైయింగ్ రేస్‌
13:20- 13:35- క్వాలిఫైయింగ్ రేస్‌
13:45- 14:00 క్వాలిఫైయింగ్ రేస్‌
14:15- 14:30 - క్వాలిఫైయింగ్ రేస్‌
14:40- 14:55 - క్వాలిఫైయింగ్ రేస్‌
15:30- 16:15- స్పింట్‌ రేస్‌

మోటోజీపీ భారత్‌ రేపటి కార్యక్రమాలు (సెప్టెంబర్‌ 24)
11:10- 11:20 - వార్మప్‌
11: 30- రైడర్‌ ఫ్యాన్ పరేడ్‌
12:30- రేస్‌ (16 ల్యాప్స్‌)
13:45- రేస్ (18 ల్యాప్స్‌)
15:30 - రేస్‌ (21 ల్యాప్స్‌)

MotoGP Bharat live streaming

మోటోజీపీ భారత్‌ రేసింగ్‌ 1000cc బైక్‌లు గంటలకు 350 కి.మీ వేగంతో దూసుకెళ్లడం చూడచ్చు. 2023 సీజన్‌లో మొత్తం 21 గ్రాండ్స్‌ ప్రిక్స్‌లు ఉన్నాయి. మోటోజీపీ భారత్‌లో ఒక్కసారి టికెట్‌ను కొనుగోలు చేస్తే మూడు రోజులపాటు చెల్లుబాటు కానుంది. ఈ రేసింగ్‌ కోసం బుద్ధ ఇంటర్నేషనల్‌ రేస్‌ సర్క్యూట్‌ అనేక కీలక మార్పులు చేశారు. ట్రాక్‌ల మార్పులు సహా భద్రతకు కోసం గట్టి చర్యలు తీసుకున్నారు.

గతంలో ఫార్ములా 1 రేస్‌ను 2011, 2013 మధ్య బుద్ధ ఇంటర్నేషనల్‌ రేస్‌ సర్క్యూట్‌లోనే నిర్వహించారు. డుకాటి, కేటీఎం, ఎప్రిలియా, యమహా వంటి టీంలు పాల్గొంటున్నాయి. ప్రపంచంలోనే ప్రముఖ బైక్‌ రైసర్లు ఫాబియో క్వార్టరారో, అలెక్స్‌ ఎస్పార్‌గారో, ఫ్రాన్సిస్కో బగ్నాయియా రేసులో పాల్గొంటున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, September 23, 2023, 15:56 [IST]
English summary
Motogp bharat bike race schedule and live streaming
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+