MotoGP భారత్ బైక్ రేస్.. రేసింగ్‌ను దగ్గరగా చూడాలంటే ఏ టికెట్ కొనుగోలు చేయాలో తెలుసా?
MotoGP రేసింగ్ భారత్‌లో తొలిసారిగా జరుగుతుంది. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు జరగనుంది. నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వేదిక కానుంది. ఈ రేసింగ్‌కు సంబంధించిన టికెట్లు BookMyShowలో అందుబాటులో ఉన్నాయి. మరియు బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా టికెట్లు కొనుగోలు చేయవచ్చును. MotoGP, Moto2, Moto3 రేసింగ్‌కు ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయి.
MotoGP రేసింగ్ బేస్ లెవల్ ఎంట్రీ టికెట్ ధర రూ.800గా ఉంది. కానీ ఆ టికెట్లు అన్ని అమ్ముడయిపోయాయి. బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ తొలి మూలన ఈ స్టాండ్ ఉంటుంది. ప్రస్తుతం అత్యంత తక్కువ ధర రూ.2,500లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

పిక్నిక్ స్టాండ్ నార్త్, పిక్నిక్ స్టాండ్ సౌత్, నేచురల్ స్టాండ్ సౌత్‌ల సీటింగ్ ఉంటుంది. రేసింగ్ ట్రాక్ 9, 10 సమీపంలో నేచురల్ స్టాండ్ సౌత్.. వీక్షణ కలిగి ఉంటుంది. అలాగే 12,13,14 ట్రాక్‌లకు పిక్నిక్ స్టాండ్ సౌత్ నుంచి మంచి వీక్షణను కలిగి ఉంటుంది.

మోటోజీపీ భారత్ రేసింగ్‌కు రూ.6,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. స్టార్ స్టాండ్ 1 ఈస్ట్.. 4 ట్రాక్ మలువు వద్ద ఉంటుంది. అత్యంత పొడవైన ట్రాక్‌లో బైక్‌లు వేగంగా ప్రయాణించడాన్ని వీక్షించవచ్చు. స్టార్ స్టాండ్ ఈస్ట్ వద్దనున్న ప్రేక్షకులు రేసింగ్‌లో పాల్గొన్న బైక్‌లు రావడం, వెళ్లడం చూడవచ్చు.
మిడ్ సెక్షన్‌లో ట్రాక్7, ట్రాక్8 మంచి వ్యూ కోసం క్లాసిక్ స్టాండ్ 3 ఈస్ట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రేసింగ్ ట్రాక్ ఎక్కువ భాగం చూసేలా టికెట్లు కొనుగోలు చేయాలంటే ట్రాక్14, ట్రాక్15 సమీపంలోని క్లాసిక్ స్టాండ్ 1 వెస్ట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

మోటోజీపీ భారత్ రేసింగ్ రూ.6,000 టికెట్లు అనంతరం, రూ.8,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. స్టార్ స్టాండ్ 2 ఈస్ట్‌లో టికెట్లు పొందవచ్చు. ఇక్కడ నుంచి 4 మలువు వద్ద అత్యంత పొడవైన రేసింగ్ ట్రాక్‌పై బైక్‌లను ఎదురుగా చూడవచ్చు. మరొకటి క్లాసిక్ స్టాండ్ 2 వెస్ట్.. 15, 16 మలుపుల వద్ద ఉంటుంది. ఈ స్టాండ్ ఫ్యాన్‌జోన్‌కు దగ్గరగా ఉంటుంది.
ప్రీమియం స్టాండ్ సౌత్ టికెట్ ధర రూ.10,000.. 11, 12 మలుపుల వద్ద ఈ సీటింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మోటీజీపీ ఫ్యాన్‌జోన్ యాక్సెస్ ఉంటుంది. మరింత మెరుగైన వీక్షణను కోరుకునేవారు 12,000 రూపాయల టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. టర్న్ 1కు కొంచెం దూరంగా టర్న్3 కు దగ్గరగా ఉంటుంది. రేసింగ్ సర్క్యూట్‌లో మంచి వ్యూ కలిగి స్టాండ్‌లో ఇదొకటి.

ప్రీమియం స్టాండ్ నార్త్ కోసం 15,000 రూపాయల టికెట్‌లను కొనుగోలు చేయవచ్చు. రేసింగ్ ప్రారంభాన్ని ఇక్కడ నుంచి చూడవచ్చు. మెరుగైన థ్రిల్లింగ్ అనుభూతిని పొందవచ్చు. ఈ స్డాండ్ కూడా మోటోజీపీ ఫ్యాన్‌జోన్ యాక్సెస్‌ను పొందవచ్చు.
మోటోజీపీ రేసింగ్ ప్రధాన గ్రాండ్ స్టాండ్ నుంచి రేసింగ్‌ను వీక్షించేందుకు రూ.20,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎగువస్థాయి (Upper tier) సీట్లు బ్లాక్ C నుంచి AB వరకు అందుబాటులో ఉంటాయి. ఈ స్డాండ్ ఫ్యాన్‌జోన్‌కు యాక్సె్స్ ఇస్తాయి. ఇక్కడ నుంచి రేసింగ్ ప్రారంభాన్ని వీక్షించవచ్చు. ప్రధాన గ్రాండ్ స్టాండ్‌లో A, B, AB, AC బ్లాక్‌లో ఎగువ శ్రేణి టికెట్ రూ.25,000కు అందుబాటులో ఉంటాయి. గ్రిడ్, ప్రీమియం సీటింగ్‌ను కలిగి ఉంటుంది. ఫ్యాన్‌జోన్‌కు సాధారణ యాక్సెస్ ఉంటుంది.

మోటోజీపీ భారత్ రేసింగ్ ప్రారంభం, ముగింపును చూసేందుకు రూ.30,000 టికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మెయిన్ గ్రాండ్ స్టాండ్‌కు దిగువన మరియు బ్లాక్ A, B రేసింగ్ ముగింపు ట్రాక్ వద్ద ఉంటాయి. మరియు బ్లాక్ AC, AD దగ్గరగా ఉంటాయి. ఈ స్టాండ్‌లు ఫ్యాన్‌జోన్ యాక్సెస్‌ను కలిగి ఉంటాయి.
మోటోజీపీ రేసింగ్‌లో అత్యంత విలువైన టికెట్ 40,000 రూపాయలు, ఈ టికెట్లు కలిగిన వారు ప్లాటినం స్టాండ్ కార్పొరేట్ బాక్స్‌ను పొందుతారు. బాక్స్ 1 నుంచి బాక్స్ 55 వరకు సీటింగ్ ఉంటుంది. టికెట్ ధరలోనే ఆహారం సహా ఇతర పానీయాలు కలిపి ఉంటాయి. ఈ స్టాండ్ ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లు కలిగి ఉంటాయి మరియ ఫ్యాన్‌జోన్ యాక్సెస్‌ను కలిగి ఉంటాయి.

ఫ్యాన్‌జోన్ అంటే ఏంటి: ఈ ఫ్యాన్‌జోన్ ప్రధాన గ్రాండ్ స్టాండ్‌కు వెనుక ఉంటాయి. ఇందులోని వినోద జోన్, ఆహారం, ఇతర పదార్ధాలు సహా రైడర్‌లతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై పూర్తి సమాచారం విడుదల కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








