రేసింగ్ ట్రాక్‌లో మోటోజీపీ రేసర్లకు చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఎప్పుడైనా గమనించారా.. దాని వెనుక అసలు కారణమిదే.!
భారత్‌లో MotoGP Grand Prix రేసింగ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. కళ్లు చెదిరే వేగంతో రేస్ బైక్‌లపై రైడ్ చేస్తూ ప్రముఖ అంతర్జాతీయ రేసర్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో MotoGP ఈవెంట్ కోసం ఉపయోగించే బైక్‌ల గురించి ఆసక్తికర సమాచారాన్ని మీతో పంచుకోబోతున్నాం.
MotoGP అనేది బైక్ రేసు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాంపిటీషన్. ఈ రేసింగ్‌ను చూసేందుకు చాలా మంది బైక్ రేస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ కాంపిటీషన్ విదేశాల్లో మాత్రమే జరగగా.. తొలిసారిగా నేడు భారత్‌లో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 24వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు.

ఈ మ్యాచ్‌లన్నీ నోయిడా మెట్రోపాలిటన్ ఏరియాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ రేస్ ట్రాక్‌లో నిర్వహిస్తారు. మొత్తం 11 జట్ల నుంచి 22 మంది రైడర్లు పోటీలో పాల్గొంటారు. ఈ పోటీలో ఉపయోగించే అన్ని బైక్‌లను విదేశాల నుంచి భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడం విశేషం.
ఈ పోటీకి ఉపయోగించే బైక్‌లకు, రోడ్డుపై నడిపే మోటార్ సైకిళ్లకు చాలా తేడా ఉంటుంది. అవన్నీ బైక్‌లే కదా.. అందులో తేడా ఏముంది అని మీకు సందేహం రావచ్చు. రోడ్డుపై నడిపై బైక్‌ల నుంచి పెద్దగా నాయిస్ రాదు. కానీ ఈ MotoGP Racing లో ఉపయోగించే బైక్‌లు చాలా శబ్దం వచ్చేలా డిజైన్ చేశారు.

మోటోజీపీలో ఉపయోగించే బైక్(Racing Bikes)ల నుంచి వచ్చే సౌండ్ వెనుక ఓ సెంటిఫిక్ రీజన్ ఉంది. MotoGP పోటీలలో ఉపయోగించే అన్ని బైక్‌లు 1000 cc 4 స్టోక్ 4 సిలిండర్ ఇంజిన్ బైక్‌లు. మీరు అటువంటి అధిక పనితీరు గల బైక్‌పై వేగంగా వెళ్లాలనుకుంటే, దాని కుదింపు చాలా వేగంగా ఉండాలి. అలా చేసినట్లయితే దాని RPM చాలా త్వరగా పెరుగుతుంది.
అయితే ఈ బైక్స్ వేగంగా వెళ్లకుండా ఆపేందుకు వీటిలో అతి ముఖ్యమైన అడ్డంకి సైలెన్సర్. కంప్రెసర్ నుంచి వెలువడే వాయువు సైలెన్సర్ గుండా వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటే, ఫలితంగా వచ్చే ఒత్తిడి.. దహన ప్రక్రియను నెమ్మదిస్తుంది. అందువల్ల rpm మనం ఊహించినంత త్వరగా వేగం పుంజుకోదు.

అందుకే RPM చాలా త్వరగా అధిక వేగాన్ని పుంజుకోవడానికి, ఈ బైక్‌లోని సైలెన్సర్ కాలుష్యాన్ని త్వరగా బయటకు పంపేలా రూపొందించారు. దాని కోసం సైలెన్సర్‌ని చిన్నగా తయారుచేసి అమర్చారు. ఈ క్రమంలో సైలెన్సర్ నుండి వెలువడే శబ్దాన్ని తగ్గించడానికి వారికి ఎలాంటి పరికరాలు లేకపోవడంతో.. ఈ బైక్‌లలోని సైలెన్సర్‌ల నుండి ఎక్కువ శబ్దం వస్తుంది.
మోటో జీపీ భారత్‌లో రేసింగ్ బైక్స్.. రోడ్డుపై ఉపయోగించే అదే 1000 సీసీ బైక్ కంటే 20 రెట్లు ఎక్కువ శబ్దాన్ని విడుదల చేస్తుంది. దీని ద్వారా రేసుకు కొద్ది దూరంలో ఉన్న ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్నవారికి ఈ సౌండ్‌తో రేసింగ్‌ను ఎంజాయ్ చేస్తారు.
కానీ మోటోజీపీ భారత్(MotoGP Bharat) ఈవెంట్‌లో పాల్గొనే రైడర్‌లు చెవుల్లో ఇయర్ ప్లగ్స్‌ను పెట్టుకుంటారు. ఇది బయటి శబ్దం వారి చెవుల్లోకి రాకుండా చేస్తుంది. ఇవి రేసర్ల చెవులకు రక్షణగా ఉంటుంది. మోటోజీపీ భారత్ రేసింగ్ ఈవెంట్‌లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు.
MotoGP భారత్ భారతదేశంలో మొదటిసారిగా నిర్వహిస్తుండటంతో ఈ మ్యాచ్‌ని చూసేందుకు వేలాది మంది ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈ బైక్‌ల సౌండ్‌ని ఆస్వాదించడానికే వారు ఎక్కువగా రేసును చూసేందుకు వెళతారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ట్రేడ్ షోను ఏర్పాటు చేసి ఎక్కువ మంది చూపు ఈ రేసింగ్ ఈవెంట్ వైపు ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications








