MotoGP Bharat Tickets : MotoGP రేసింగ్ అధికారిక టికెట్ భాగస్వామిగా BookMyShow
ఫెయిర్‌స్ట్రీట్ స్పోర్ట్స్ నేతృత్వంలోని ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 'MotoGp Bharat' కోసం ఆసక్తికర వార్తను వెల్లడించింది. FIM వరల్డ్ ఛాంపియన్‌షిప్ గ్రాండ్ ప్రిక్స్ (MotoGPTM) 2023 ఇండియన్ ఎడిషన్‌కు BookMyShow అధికారిక టికెట్ భాగస్వామిగా ఎంపికయినట్లు తెలిపింది. భారత్‌లో మొట్టమొదటిసారిగా జరగనున్న గ్రాండ్ ప్రిక్స్ షెడ్యూల్ ఖరారయింది.
చారిత్రాత్మక మోటార్‌సైక్లింగ్ కార్యక్రమం సెప్టెంబర్ 22-24 మధ్య గ్రేటర్ నోయిడాలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరగనుంది. MotoGPTM నిర్వహణకు ఫెయిర్‌స్ట్రీట్ స్పోర్ట్స్ కీలక పాత్ర పోషించింది. MotoGP భారత్ మరియు BookMyShow మద్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మోటార్‌స్పోర్ట్స్ అభిమానులు సులభంగా టికెట్లు పొందనున్నారు.

MotoGP భారత్ టికెట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని, ఇందుకు సంబంధించిన అధికారులు వెల్లడించారు. మరియు బుక్‌మైషో ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతాయని తెలిపారు
ఫెయిర్‌స్ట్రీట్ స్పోర్ట్స్ ప్రొమోటర్లు ఈ గ్లోబర్ ఈవెంట్‌ను వారాంతపు గమ్యస్థానంగా మార్చేందుకు మరియు పూర్తిగా కొత్తగా నిర్వహించేందుకు భాగస్వాములు, అసోసియేట్‌లతో జరుపుతున్న చర్చలు అధునాతన దశలో ఉన్నాయనే ఆసక్తికర అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఈవెంట్ ఫ్యాన్స్‌ను మంచి అనుభూతిని అందిస్తుంది.
భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న MotoGP కార్యక్రమం అధికారిక టికెటింగ్ భాగస్వామిగా BookMyShow ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా ఉందని ఫెయిర్‌స్ట్రీట్ స్పోర్ట్స్ సీవోవో పుష్కర్‌నాథ్ శ్రీవాస్తవ వెల్లడించారు. భారత అభిమానులకు అసమానమైన రేసింగ్ అనుభవాన్ని అందించేందుకు రెండు సంస్థలు ఒకచోటకు చేరాయని తెలిపారు. అభిమానులందరికి మరపురాని అనుభూతిని అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

భారత్‌లో తొలిసారిగా జరగనున్న సూపర్‌బైక్ గ్రాండ్ ప్రిక్స్ తొలి ఎడిషన్ కోసం MotoGPతో అధికారిక టికెటింగ్ భాగస్వామ్యం కుదిరినందుకు సంతోషంగా ఉందని BookMyShow సీవోవో అనిల్ మఖీజా వెల్లడించారు. స్పోర్ట్స్, మ్యూజిక్, కామెడీ సహా అంతకు మించిన వినోద అనుభవాలను పంచడమే లక్ష్యమని అనిల్ తెలిపారు.
భారత్‌దేశానికి మోటార్‌స్పోర్ట్స్ తీసుకురావడంలో భాగస్వామ్యం కావడం ఓ మైలురాయని అభిప్రాయపడ్డారు. అన్ని ఫార్మాట్‌లలో భారత్‌లో క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ఈ వ్యూహాత్మక భాగస్వా్మ్యం అన్ని క్రీడలను అందుబాటులోకి తీసుకురావాలనే ఆశయానికి అనుగుణంగా ఉందని చెప్పారు.

FIM వరల్డ్ MotoGP ఛాంపియన్‌షిప్‌ను భారత్‌లో నిర్వహిస్తున్నందుకు ఫెయిర్‌స్ట్రీట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భారత ప్రమోటర్), డోర్నా (ప్రోమోటర్ మరియు రైట్స్ హోల్డర్ ఫర్ ది ఎఫ్‌ఐఎం వరల్డ్ ఛాంపియన్‌షిప్), FIM (వరల్డ్ గవర్నింగ్ బాడీ ఫర్ 2W మోటార్‌స్పోర్ట్స్)కు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఫ్రెసిడెంట్ అక్బర్ ఇబ్రహిం అభినందనలు తెలిపారు. ఈ ఈవెంట్ కోసం టిక్కెట్ రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించడం సహా కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








