mX9 ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. 110 -140 కి.మీ రేంజ్.. !
భారత్ మార్కెట్‌లో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. అయితే ద్విచక్రవాహనాల విభాగంలో అత్యధికంగా స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ బైక్‌లు చాలా తక్కువ సంఖ్యలోనే లభిస్తున్నాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకొనేందుకు అనేక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి.
తాజాగా MXmoto సంస్థ mX9 ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1.46 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. mX9 ఈ- బైక్ 4000 వోల్ట్ BLDC హబ్ మోటార్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ బ్యాటరీ 0-90 శాతం ఛార్జింగ్ చేసేందుకు కేవలం 3 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది.

ఒక్కసారి బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు కేవలం 1.5 యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చు అవుతుందని సంస్థ చెబుతోంది. బైక్ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 110 కి.మీ నుంచి 140 కి.మీ రేంజ్ ఇస్తుందని MXmoto సంస్థ చెబుతోంది. మరియు గరిష్ఠంగా 80 kmph వేగంతో ప్రయాణించవచ్చు. ఈ బైక్ మోటార్ 580 rpm వద్ద 140Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
mX9 ఎలక్ట్రిక్ బైక్ మెరుగైన సస్పెన్షన్ సెటప్, బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్, అప్ సైట్ డౌన్ ఫోర్క్, అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేకులను కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా mX9 ఎలక్ట్రిక్ బైక్ చాలా ఆకట్టుకుంటుంది.

ఈ ఎలక్ట్రిక్ బైక్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. LED టర్న్ ఇండికేటర్లు, ఛార్జింగ్ కోసం USB పోర్టు, బ్లూటూత్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్‌తో TFT స్ర్రీన్, పార్క్ అసిస్ట్, హిల్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్ సహా అనేక కీలక ఫీచర్లను ఈ బైక్ కలిగి ఉంటుంది.
mXmoto mX9 ఎలక్ట్రిక్ బైక్ విడుదల గురించి MD రాజేంద్ర మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ బైక్‌ను అధునాతన భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తుందనిపేర్కొన్నారు. పండుగ సీజన్ కావడంతో బైక్ కొనుగోలుపై ఎక్కువ మంది ఆసక్తి చూపించే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది.

భారత్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక డిమాండ్ ఉంది. ఎక్కువగా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నా.. ఛార్జింగ్ స్టేషన్లు, సర్వీస్ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. Fame-2 సబ్సిడిలో కోత విధించడం అనంతరం జూన్, జూలై నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ తగ్గుదల కనిపించింది. అనంతరం ఆగస్టులో విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








