Aprilia RS 457 అప్రీలియా RS 457 బైక్‌ లాంచ్‌.. ఆ రోజు నుంచే బుకింగ్స్‌

గోవాలో జరుగుతున్న ఇండియా బైక్‌ వీక్‌(India Bike Week 2023) 2023 లో మరో కొత్త బైక్‌ లాంచ్‌ అయింది. ఇటాలియన్ ఆటోమేకర్ అప్రీలియా ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్రీలియా(Aprilia RS 457) RS 457ని ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ ఫీచర్లు, డిజైన్‌, ధర పూర్తి వివరాలు ఈ కథనంలో

అప్రీలియా RS 457 బైక్ ప్రారంభ ధర రూ.4.10 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా సంస్థ నిర్ణయించింది. బైక్ బుకింగ్స్ డిసెంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. కస్టమర్లు రూ. రూ. 10,000 టోకెన్‌ అమౌంట్ చెల్లించి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. మార్చి 2024లో బైక్‌ డెలివరీలు ప్రారంభమవుతాయి.

Aprilia-RS-457

అప్రీలియా ఆర్ఎస్ 457 బైక్‌ను ఇటలీలో డిజైన్ చేశారు. మహారాష్ట్రలోని ఎప్రిలియాకు చెందిన బారామతి యూనిట్‌లో ఈ బైక్‌ను తయారుచేశారు. భారత్‌లో తయారైన అప్రీలియా RS 457 మార్కెట్లో KTM RC390, యమహా R3, కవాసకి నింజా 400 లకు గట్టి పోటీనివ్వనుంది.

ఇక కొత్త అప్రీలియా RS 457 బైక్‌ ఇంజిన్‌ విషయానికొస్తే.. ఇది 457cc, లిక్విడ్-కూల్డ్, సమాంతర ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ DOHC ఇంజిన్ స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 9,400 rpm వద్ద 46 bhp శక్తిని మరియు 6,700 rpm వద్ద 43.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Aprilia-RS-457

కొత్త అప్రీలియా RS 457 బైక్ సస్పెన్షన్ సెటప్‌ను పరిశీలిస్తే.. ఇది ట్విన్-స్పార్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. ముందువైపు 41mm ఇన్వర్టెడ్ సస్పెన్షన్, వెనుకవైపు మోనోషాక్‌ను కలిగి ఉంటుంది. ఇవి రెండూ ప్రీలోడ్ అడ్జస్టబుల్‌తో వస్తాయి. కాగా దీని ముందు భాగంలో 120 మిమీ ట్రావెల్ మరియు వెనుక 130 మిమీ వీల్ ట్రావెల్‌తో రూపొందించారు. .

కొత్త అప్రీలియా RS 457 ముందు వైపు 110-సెక్షన్, వెనుక వైపు 150-సెక్షన్ TVS యూరోగ్రిప్ ప్రోటార్క్ ఎక్స్‌ట్రీమ్ టైర్‌లతో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్‌ గురించి చెప్పాలంటే.. ఇది 4-పిస్టన్ రేడియల్ కాలిపర్‌లతో 320 మి.మీ ఫ్రంట్ డిస్క్, 2-పిస్టన్ స్లైడింగ్ కాలిపర్‌లతో 220 మిమీ వెనుక డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది.

ఇంకా రైడర్లకు అదనపు భద్రత కోసం అప్రీలియా RS 457 బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS అసిస్ట్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఇంకా ఈ కొత్త బైక్‌ రైడ్-బై-వైర్ సిస్టమ్‌తో మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ రైడర్‌కు అనుకూలంగా మూడు మోడ్‌లను కూడా అందిస్తుంది.

కొత్త అప్రీలియా RS 457 ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో ఆప్షనల్‌ బ్లూటూత్ కనెక్టివిటీతో 5-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా పూర్తి LED లైటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. కాగా ఈ సూపర్‌స్పోర్ట్స్ బైక్ బరువు 175 కిలోలుగా సంస్థ తెలిపింది.

అప్రీలియా RS 457 బైక్‌ 13 లీటర్ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంది. కాగా ఈ బైక్‌ సీట్ ఎత్తు 800mm. కొత్త అప్రీలియా RS 457 బైక్‌ను ప్రిస్మాటిక్ డార్క్, ఒపలెసెంట్ లైట్ మరియు రేసింగ్ స్ట్రిప్స్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ప్రవేశపెట్టారు. కస్టమర్లు తమకు నచ్చిన బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, December 9, 2023, 10:09 [IST]
English summary
New aprilia rs 457 sports bike launched at india bike week 2023 price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+