Ather 450X Apex: ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లు ప్రారంభం..ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్, డెలివరీలు అప్పటి నుంచే.!!
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌లో ఏథర్ ఎనర్జీ స్కూటర్లు మంచి డిమాండ్‌ను ఏర్పరుచుకున్నాయి. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశవ్యాప్తంగా మంచి సేల్స్‌తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఏథర్ తన కొత్త 450X అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లు ప్రారంభించింది.
కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు మార్కెట్లోకి నిత్యం నయా మోడళ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏథర్ ఎనర్జీ(Ather Energy) సైతం కొత్త స్కూటర్లను వివిధ మోడళ్లను అభివృద్ధి చేస్తోంది. త్వరలో ఏథర్ తన కొత్త 450X అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది.

కాగా ఏథర్ ఎనర్జీ.. Ather 450X Apex ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లను ఇటీవలే ప్రారంభించింది. కాగా ఇప్పటికే ఈ స్కూటర్‌పై కస్టమర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త ఏథర్ 450X అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేసేందుకు కస్టమర్‌లు ఏథర్ ఎనర్జీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. రూ.2,500 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవాలని సంస్థ తెలిపింది.
కొత్త ఏథర్ 450X అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు మార్చి 2024 నుండి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. కాగా కొత్త ఏథర్ ఎనర్జీ 450x అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ట్రాక్‌లపై బైక్ రేసర్లు చేసిన టీజర్ క్యాంపెయిన్ ఇప్పటికే కస్టమర్లలో భారీ క్యూరియాసిటీ కలిగేలా చేసింది.
ఈ టీజర్ వీడియోలో 450X మరియు కొత్త 450X అపెక్స్ స్కూటర్లను ప్రదర్శించారు. ఈ రెండింటి మధ్య తేడాలను, పోలికలను ఈ టీజర్ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. కాగా కొత్త ఏథర్ ఎనర్జీ 450X అపెక్స్‌లో Warp+' రైడింగ్ మోడ్ అనే అద్భుతమైన ఫీచర్‌ను పరిచయం చేశారు. ప్రస్తుత రోలింగ్ మోడ్‌ను విజయవంతం చేసేందుకు ఇందులో రూపొందించారు.
అయితే ఈథర్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రీమియం ధర ట్యాగ్‌తో వస్తాయి. ఈ సరికొత్త 450X అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వినూత్న ఫీచర్లు ఉన్నాయి. పూర్తి సమాచారం లాంచ్ సమయంలో వెల్లడి కానుంది. కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల విషయానికొస్తే..
450X ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2.9 kWh మరియు 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు. దీని ధర వరుసగా రూ. 1,38,000, రూ. 1,44,921 గా ఉంది. ఈ స్కూటర్ పూర్తి ఛార్జింగ్‌తో 115 కిమీ - 145 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది.
ఇంకా 450X ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సంస్థ డిస్క్ బ్రేక్ ఆప్షన్‌తో ప్రవేశపెట్టింది. కేవలం 3.3 సెకండ్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. రానున్న 450X అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత వేగంతో స్పీడ్‌ను అందుకునే అవకాశం ఉంది.
కాగా కొత్త సంవత్సరంలో ఈథర్ రెండు అద్భుతమైన స్కూటర్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది కొత్త ఏడాదిలో మంచి స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కొత్త స్కూటర్లు అద్భుతమైన పనితీరు, అధునాతన ఫీచర్లు మరియు సరసమైన ధరలలో విడుదల చేయవచ్చని ఆటో నిపుణులు భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లో ఓలా, టీవీఎస్, హీరో మరియు సింపుల్ ఎనర్జీ కంపెనీ స్కూటర్లకు ఇవి గట్టి పోటీగా నిలుస్తాయి.


Click it and Unblock the Notifications








