ఫ్యామిలీ ఫేవరెట్‌ చేతక్‌ అర్బన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. ధర రూ. 1.15 లక్షలు, 113 కి.మీ రేంజ్‌

భారత మార్కెట్లో ప్రముఖ టూ వీలర్‌ సంస్థ బజాజ్‌ నుంచి చేతక్‌.. ఫ్యామిలీ స్కూటర్‌గా ప్రసిద్ధి చెందింది. కాగా ఇది అప్పట్లో ఫ్యూయెల్‌తో నడిచే స్కూటర్‌. కానీ సేల్స్‌ ఎక్కువగా జరగకపోవడంతో దీనిని పదేళ్ల క్రితం నిలిపివేశారు. చేతక్‌తో ప్రజలకు మంచి అనుబంధం ఉండటంతో చేతక్‌ను మళ్లీ ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో ప్రవేశపెట్టింది.

కాగా ప్రముఖ కంపెనీలతో పాటు స్టార్టప్‌లు సైతం అనేక మోడళ్లలో, అధిక రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెడుతున్నాయి. అంతేకాకుండా ఇ స్కూటర్లు మార్కెట్లో గట్టి పోటీని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో బజాజ్‌ నుంచి కొత్త చేతక్‌ అర్బన్ స్కూటర్‌ను మరింత రేంజ్‌, కొత్త ఫీచర్లతో లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ డిజైన్‌, ధర, కొత్త అప్‌డేట్ల విషయానికొస్తే..

Bajaj-Chetak-Urbane-Electric-Scooter

బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ అర్బన్ స్టాండర్డ్(Chetak Urbane Electric Scooter) వేరియంట్‌ను మార్కెట్‌లోకి రూ.1.15 లక్షల ధరతో విడుదల చేసింది. కాగా చేతక్‌ అర్బన్‌లో "Tecpac"కి అదనంగా రూ.1.21 లక్షలుగా ప్రకటించింది. అయితే ఈ టాప్ వేరియంట్ టెక్‌ప్యాక్‌లో మరిన్ని ఫీచర్లు, మెరుగైన పనితీరుతో ప్రవేశపెట్టింది.

ఇక బజాజ్‌ చేతక్‌ అర్బన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రేంజ్ విషయానికి వస్తే ఇది 113 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని.. కాగా పాత చేతక్‌ ప్రీమియం ప్రస్తుతం 108 కి.మీ రేంజ్‌తో ఉందని సంస్థ తెలిపింది. బజాజ్‌ అర్బన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ IDC- సర్టిఫైడ్‌ రేంజ్‌.. కాగా బజాజ్‌ చేతక్‌ ప్రీమియం 108 కి.మీ రేంజ్‌ ఇవ్వగా.. దాని IDC రేంజ్‌ మాత్రం 128 కి.మీ.

Bajaj-Chetak-Urbane-Electric-Scooter

దీన్ని బట్టి రియల్‌ టైమ్‌ అర్బన్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రేంజ్‌ కొంచెం తక్కువగా ఉన్నా.. దీనిపై ఖచ్చితంగా చెప్పలేం. కొత్త బజాజ్ చేతక్ అర్బన్ ప్రస్తుత మోడల్‌లో 2.9kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ప్రీమియం మాదిరిగానే అదే కలర్‌ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

కొత్త చేతక్ అర్బన్ ప్రీమియం వేరియంట్ వలె అదే రంగు LCD డిస్ప్లేను పొందుతుంది. స్టాండర్డ్‌గా అర్బన్ 63kph గరిష్ఠ వేగాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. కాగా ఇది ఒకే ఒక రైడింగ్ మోడ్ ఎకో ఉంది. "Tecpac" అర్బన్‌ స్కూటర్‌లో, అదనంగా స్పోర్ట్ అనే రైడింగ్ మోడ్‌ ఉంది. ఇది గరిష్ఠంగా గంటకు 73 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

Bajaj-Chetak-Urbane-Electric-Scooter

కొత్త చేతక్‌ అర్బనే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఛార్జింగ్ విషయానికి వస్తే.. స్టాండర్డ్‌ ఛార్జర్ యొక్క ఛార్జింగ్ రేటు 800W నుండి 650Wకి పడిపోవడంతో.. ఛార్జింగ్ సమయం 3 గంటల 50 నిమిషాల నుంచి 4 గంటల 50 నిమిషాలకు పెరిగింది. ఈ స్కూటర్‌ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లతో మాత్రమే వస్తుండగా.. డిస్క్ బ్రేక్ ఉందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

Bajaj-Chetak-Urbane-Electric-Scooter

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, December 2, 2023, 17:18 [IST]
English summary
New bajaj chetak urbane electric scooter launched price features range details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+