తక్కువ ధరలో బజాజ్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 113 కి.మీ రేంజ్.!!
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ నుంచి మరో చేతక్ ఎలక్ట్రిక్(Bajaj Chetak Urbane Electric Scooter) స్కూటర్ రానుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో ఈ స్కూటర్‌ను పరిచయం చేయనుంది. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. 113 కిలోమీటర్ల రేంజ్‌ను పొందవచ్చని అంచనా.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో బజాజ్ చేతక్ ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బజాజ్ ఆటో మార్కెట్లోకి 2020లో విడుదల చేసింది. బజాజ్ చేతక్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియంట్లలో సంస్థ లాంచ్ చేసింది. ఈ క్రమంలో అర్బన్ వేరియంట్ విక్రయాలను సంస్థ నిలిపివేయగా.. ప్రస్తుతం ప్రీమియం, ప్రీమియం ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. ఈ క్రమంలో బజాజ్ నుంచి అర్బన్ వేరియంట్‌ను మళ్లీ తీసుకురానుంది.

చేతక్ అర్బన్(Chetak Urbane Scooter) స్కూటర్ త్వరలో చిన్న బ్యాటరీ ఆప్షన్‌తో విడుదల కానున్నట్లు సమాచారం. దీని ద్వారా ఈ స్కూటర్ ధర తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో కొత్త బ్యాటరీ ఆప్షన్ కోసం ఆమోదం కోరతూ ప్రభుత్వానికి బజాజ్ ఆటో దరఖాస్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
ఈ ప్రభుత్వం పత్రం ద్వారా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం. కొత్త చేతక్ అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్, ఫీచర్లు డిజైన్ విషయానికొస్తే.. ఈ స్కూటర్ 2.48kWh బ్యాటరీ ఆప్షన్‌తో రానుంది. కాగా ప్రస్తుతం చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 2.88kWh బ్యాటరీతో పనిచేస్తుంది.

అయితే కొత్త చేతక్ అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పరిమాణం తగ్గడంతో రేంజ్ కూడా తగ్గనుంది. స్కూటర్ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై గరిష్ఠ పరిధిగా తక్కువగా ఉండనుంది. కాగా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 113 కి.మీగా సంస్థ పత్రంలో తెలిపింది.
కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 126 కి.మీల రేంజ్‌ను ఇస్తుంది. అయితే పొడవు, వెడల్పు మరియు ఎత్తుతో సహా కొలతల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ క్రమంలో లుక్స్ పరంగా ప్రస్తుత చేతక్ ప్రీమియం స్కూటర్, కొత్త అర్బన్ స్కూటర్ మధ్య ఎలాంటి తేడా ఉండదు.

కొత్త బజాజ్ చేతక్ అర్బన్ వేరియంట్ బరువు పరంగా ప్రీమియం వేరియంట్ కంటే 3 కిలోల వరకు తేలికగా ఉంటుందని ప్రభుత్వ పత్రంలోని వివరాల ద్వారా తెలుస్తోంది. అయితే కొన్ని వారాల క్రితం, మిడ్-మౌంటెడ్ మోటార్‌తో కూడిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పబ్లిక్ రోడ్‌పై ఇటీవలే టెస్ట్ చేశారు. కాగా ఇంది చేతక్ అర్బన్ స్కూటర్ అయ్యే అవకాశం ఉంది.
కాగా భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.50 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో సెటాక్ యొక్క కొత్త ఎంట్రీ-లెవెల్ వేరియంట్ రూ.1 లక్ష నుండి రూ.1.20 లక్షలకు తగ్గించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








