రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బైక్.. ఆగష్టు 30 న విడుదల.!
యూత్ ఫేవరెట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త వెర్షన్‌లో బైక్ రానుంది. కొత్త తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 ఆగష్టు 30న భారత మార్కెట్‌లో విడుదల కానుంది. కొత్త తరం రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సంబంధించి ఇప్పటికే అనేక టెస్ట్ మ్యూల్స్ జరిగాయి. ఈ బైక్ గురించిన మరింత సమాచారం ఈ కథనంలో..
కొత్త తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350.. క్లాసిక్ 350, హంటర్ 350 మరియు మెటోర్ 350 లో వినియోగిస్తున్న J ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని సమాచారం. ఇక ఈ కొత్త తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 ఇంజిన్ పనీతీరు, డిజైన్, ఫీచర్లు తెలుసుకుందాం.

నెక్స్ట్ జెన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 లో అదే 349 సీసీ, సింగిల్ సిలిండర్ మోటార్, ఎయిర్ ఆయిల్ కూల్డ్‌తో లాంగ్ స్ట్రోక్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 19.9 బీహెచ్‌పీ వద్ద 27 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది.
బుల్లెట్ ఫీచర్లు, లక్షణాలకు అనుగుణంగా కొత్త తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 ని రీ డిజైన్ చేశారు. ఇక గేర్ మార్పుల విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇక ఇంజిన్‌లోనూ టార్క్ స్వభావానికి అనుగుణంగా పలు మార్పులు చేసినట్లు సమాచారం.

కొత్త తరం 350 సింగిల్ పీస్ సీట్ మరియు స్పోక్డ్ రిమ్స్‌తో వస్తుంది. లైటింగ్ ఎలిమెంట్స్ క్లాసిక్ 350 లో మాదిరిగా ఉంటాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అనలాగ్ స్పీడో మీటర్, ఫ్యూయెల్ గేజ్ కోసం చిన్న డిజిటల్ రీడౌట్‌తో చాలా సింపుల్‌గా ఉంటుంది.
కొత్త తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 లో ఛాసిస్‌ను క్లాసిక్ 350 నుంచి తీసుకున్నారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక భాగంలో ట్విన్ గ్యాస్ ఛార్జ్‌డ్, షాక్ అబ్జార్వర్లను అమర్చారు. ముందు వైపున డిస్క్ బ్రేకులు, వెనుక వైపున డ్రమ్ బ్రేక్‌తో ఉంటుంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లతో ఉన్న వేరియంట్లను కూడా విక్రయిస్తోంది.

ఇక నెక్స్ట్ జెన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 ధర విషయానికొస్తే ఇంకా దీనిపై కంపెనీ నుంచి ప్రకటన రాలేదు. అయితే ప్రస్తుతం ఎక్స్ షోరూమ్ ధరల ప్రకారం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉంది.
ఆపై లైనప్‌లో క్లాసిక్ 350 ఉంది. క్లాసిక్ 350 ధర ఎక్స్ షోరూంలో రూ. 1.93 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్య ఉంది. కొత్త తరం 350 బైక్ ధర వీటితో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బైక్‌కి సంబంధించి ఆసక్తికర వీడియోను కంపెనీ ట్విట్టర్లో షేర్ చేసింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








