రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హోండా CB350 బైక్‌ లాంచ్‌.. ధర రూ. 2 లక్షలు, ఫీచర్లు అదరహో.!!

ప్రముఖ టూ వీలర్‌ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్‌ స్కూటర్ ఇండియా(HM&SI) నుంచి మరో కొత్త బైక్‌ లాంచ్‌ అయింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌కు గట్టి పోటీనిస్తూ స్టైలిష్‌ లుక్‌, డిజైన్‌తో హోండా తన కొత్త CB350 బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెట్రో క్లాసిక్‌ బైక్‌ ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఈ కథనంలో..

కొత్త CB350 (Honda CB350) రెట్రో క్లాసిక్ బైక్‌ను రూ.2 లక్షల(ఎక్స్‌ షోరూమ్‌) ప్రారంభ ధరతో హోండా విడుదల చేసింది. ఈ బైక్‌ను కొనుగోలు చేసేందుకు బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సరికొత్త హోండా CB350 ని బుక్‌ చేసుకోవాలనుకుంటే కస్టమర్లు తమ సమీప బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో సంప్రదించవచ్చు. ఈ రెట్రో బైక్ CB350 DLX, CB350 DLX ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Honda-CB350

కాగా కొత్త హోండా CB350 DLX వేరియంట్ ధర రూ. 2 లక్షలుగా ఉంది. CB350 DLX ప్రో వేరియంట్ ధర రూ.2.18 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. హోండా సంస్థ ఈ రెట్రో-క్లాసిక్‌ బైక్‌పై ప్రత్యేక 10 సంవత్సరాల వారంటీ ప్యాకేజీని అందిస్తోంది. దీని ప్రకారం మూడేళ్ల స్టాండర్డ్‌ వారంటీతో పాటు 7 సంవత్సరాల ఆప్షనల్‌ ప్యాకేజీగా హోండా పేర్కొంది.

భారత మార్కెట్లో కొత్త హోండా CB350 బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా క్లాసిక్‌ బైక్‌లతో నేరుగా పోటీపడనుంది. డిజైన్‌ పరంగా ఈ బైక్ దాదాపు ఈ రెండు వింటేజ్‌ బైక్‌లను పోలి ఉంటుంది. ఇక కొత్త రెట్రో క్లాసిక్‌ హోండా CB350(Honda CB350 Retro Classic Bike) డిజైన్‌ను పరిశీలిస్తే..

Honda-CB350

కొత్త హోండా సీబీ350 బైక్‌లో గుండ్రని ఆకారపు హెడ్‌ల్యాంప్, పొడవాటి మెటల్ ఫెండర్లు, ఫ్రంట్ ఫోర్క్‌ల కోసం మెటాలిక్ కవర్లు, స్ప్లిట్ సీట్లు వంటి రెట్రో ఎలిమెంట్స్‌తో దీనిని రూపొందించారు. ఈ బైక్‌ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ప్రెషరైజ్డ్ నైట్రోజన్-ఛార్జ్డ్ రియర్ సస్పెన్షన్‌తో వస్తుంది.

కొత్త హోండా CB350 లో ఫ్యూయెల్‌ ట్యాంక్, LED హెడ్‌ల్యాంప్, LED బ్లింకర్లు ఇంకా LED టెయిల్-ల్యాంప్‌ను ఆకర్షణీయంగా రూపొందించారు. కొత్త హోండా CB350 బైక్ మెటాలిక్, మ్యాట్ షేడ్స్‌తో 5 ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది. రెడ్ మెటాలిక్, పెరల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ క్రస్ట్ మెటాలిక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్ మరియు మ్యాట్ డ్యూన్ బ్రౌన్ కలర్స్‌లో మీకు నచ్చిన కలర్‌ను కొనుగోలు చేయవచ్చు.

Honda-CB350

బ్రేకింగ్ విధులను పరిశీలిస్తే.. కొత్త CB350 ఫ్రంట్‌ భాగంలో 310mm డిస్క్ మరియు డ్యూయల్-ఛానల్ ABSతో వెనుకవైపు 240mm డిస్క్‌ను కలిగి ఉంది. ఇందులో 18-అంగుళాల వీల్స్‌ను అమర్చారు. కాగా వెనుక చక్రం 130-సెక్షన్ టైర్‌లతో వస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందువైపు 310mm డిస్క్ బ్రేక్, వెనుకవైపు 240mm డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

భద్రతా ఫీచర్లను పరిశీలిస్తే కొత్త Honda CB350 బైక్‌ డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్‌తో వస్తుంది. ఈ బైక్‌లో 348.36cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ BSVI OBD2-B కంప్లైంట్‌కు అనుగుణంగా.. PGM-FI ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 5,500rpm వద్ద 20.7hp, 3,000rpm వద్ద 29.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Honda-CB350

More from DriveSpark

Article Published On: Saturday, November 18, 2023, 10:05 [IST]
English summary
New honda cb350 retro classic motorcycle launched price design features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+