TVS IQube E Scooter ఈ టీవీఎస్ స్కూటర్ ధర పెరిగింది.. కానీ కొంటే బోలెడు లాభాలు ఉన్నాయి..
ఈ జూన్ నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సబ్సిడీ కోత కారణంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు పెరిగాయి. ఈ క్రమంలో ధరల పెరుగుదలతో ఈ జూన్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను పెంచింది. దీంతో పాటు ఈ స్కూటర్ కొనుగోలు చేసే వినియోగదారుల కోసం ప్రత్యేక లాయల్టీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? iQube ధర ఎంత పెరిగింది.. పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఓలా నుంచి బజాజ్ వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు తమ వాహనాల ధరలను రూ.20,000 వరకు పెంచాయి. దీనికి అనుగుణంగా టీవీఎస్ మోటార్స్ కూడా తన ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ ధరలను గణనీయంగా పెంచింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ iQube, iQube S అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
గతంలో ఐక్యూబ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,16,184. ఇప్పుడు దీనిని రూ.1,23,184కు పెంచారు. ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ధర రూ.9,440 పెరగడంతో రూ.1,28,849 నుంచి రూ.1,38,289కి చేరింది. మే 21 నుంచి iQubeను బుక్ చేసుకున్న వారికి ధరలు రూ. 1,23,184 మరియు రూ. 1,38,289 వర్తించనున్నాయి.

అయితే, ఈ ధరల పెంపు దృష్ట్యా టీవీఎస్ మోటార్స్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం లాయల్టీ బెనిఫిట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రకారం iQube కస్టమర్లు కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ సదుపాయాన్ని కొన్ని రోజులు మాత్రమే అందించనున్నట్లు టీవీఎస్ తెలిపింది.
ఈ లాయల్టీ ప్రోగ్రామ్ గురించి మరింత తెలుసుకోవడానికి TVS మోటార్ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ని సందర్శించవచ్చు. 2020 ప్రారంభంలో ప్రారంభించబడిన, TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ మొదట బెంగళూరు మరియు ఢిల్లీలో మాత్రమే విక్రయించబడింది. నేడు iQube చెన్నైతో సహా మొత్తం 140 నగరాల్లో అందుబాటులో ఉంది.

ఇటీవల TVS గత సంవత్సరంలో iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసిన వారికి రీ-ఫండ్‌ను ప్రకటించింది. దీని కోసం TVS భారీ మొత్తాన్ని కేటాయించింది. ఇవి ఛార్జర్‌ల కోసం కొనుగోలు చేసిన మొత్తాలు. దీని ప్రకారం, 2022లో ఐక్యూబ్ కొనుగోలు చేసిన వారు రూ.1,700 వరకి రీ-ఫండ్ లభించింది. కేంద్ర ప్రభుత్వ FAM స్కీమ్‌లో ఈ నిబంధన ఉన్న తర్వాత రుసుమును రీఫండ్ చేయడానికి TVS అంగీకరించింది.
ధరలను పెరగడంతో వినియోగదారులపై ఆ ప్రభావం పడకుండా ప్రయోజనాలను అందించే లాయల్టీ ప్రోగ్రామ్‌ను టీవీఎస్ మోటార్స్‌ను ప్రవేశపెట్టడం వినియోగదారుల పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. సబ్సిడీ తగ్గింపుతో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ.7,000 - రూ.9,500 మధ్య మాత్రమే పెరిగాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








