Odysse EV Bike: మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. కేవలం రూ.999 తో బుక్ చేసుకోవచ్చు...!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. అందుకు తగినట్లుగానే పలు సంస్థలు కొత్త కొత్త మోడళ్లలో బైక్స్/స్కూటర్ లను తీసుకు వస్తున్నాయి. నూతన కంపెనీలు ఆకర్షించే ఆఫర్లతో బైక్ ప్రియులను ఆహ్వానిస్తున్నాయి. తాజాగా మరో బైక్ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ సూపర్ బైక్ వివరాలు మీకోసం..

ముంబైకి చెందిన 'ఒడిస్సీ' కంపెనీ 'వాడేర్' అనే పేరుతో సరికొత్త మోటార్ సైకిల్ ని విడుదల చేసింది. స్మార్ట్ బైక్ గా ప్రసిద్ధి చెందనుంది. ఈ అధునాతన బైక్ స్మార్ట్ యాప్ ద్వారా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. 3.7kWh లిథియం అయాన్ (NMC) పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్ తో రానుంది.

ఒడిస్సీ బైక్

పవర్ ఫుల్ ఇంజన్ తో క్రేజీ లుక్ లో..
4.02 bhp శక్తిని ఉత్పత్తి చేయగల 3kW ఎలక్ట్రిక్ మోటారుతో ఈ బైక్ వస్తుంది. 6.03 bhp వద్ద 170 Nm శక్తిని ఉత్పత్తి చేయగల 4.5kW గరిష్ట మోటార్ ఈ బైక్ సొంతం. ఈ బైక్ ను ఛార్జ్ చేసేందుకు 4 గంటల సమయం పడుతుంది.

ఇందులో మూడు రైడింగ్ మోడ్ ఆప్షన్‌లు ఉన్నాయి. అవి ఎకో, డ్రైవ్ అండ్ స్పోర్ట్స్ గా ఉన్నాయి. దీంతోపాటు ఫుల్ ఛార్జింగ్‌తో 125 కి.మీల రేంజ్‌ను ఈ బైక్ అందించనుంది. అయితే, డ్రైవ్ రైడింగ్ మోడ్‌లో 100 కిమీ, స్పోర్ట్ మోడ్‌లో 90 కిమీ రేంజ్ మాత్రమే ఇస్తుంది. అలాగే, ఈ ఒడిస్సీ వాడర్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 85కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

ఒడిస్సీ వేడార్ ఈవీ బైక్

స్మార్ట్ ఫీచర్స్..
సస్పెన్షన్ సెటప్ బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇందులో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్, అరుదైన డ్యూయల్ స్ప్రింగ్ లోడ్ షాక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌లో ముందు 240 mm, వెనుక 220 mm డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉంది. ఇది ముందు 90/90-17 వెనుక 140/70 టైర్లతో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందుతుంది.

ఫీచర్ల విషయానికొస్తే, ఒడిస్సీ వాడెర్ ఎలక్ట్రిక్ బైక్‌లో ఆండ్రాయిడ్ డిస్‌ప్లేతో కూడిన డస్ట్ వాటర్ ప్రూఫ్ 7-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. మీ ఫోన్‌లోని 'Odysse EV' యాప్ స్క్రీన్‌కి కనెక్ట్ అవుతుంది. యాప్ తో బైక్ ని స్మార్ట్ గా ఆపరేట్ చేయవచ్చు. LED లైటింగ్‌తో బైక్ లొకేటర్, జియోఫెన్సింగ్, ఇమ్మొబిలైజేషన్, యాంటీ-థెఫ్ట్, ట్రాక్ & ట్రేస్, తక్కువ బ్యాటరీ తీసుకుని సమాచారాన్ని అందిస్తుంది.

ఒడిస్సీ వేడార్ బైక్

తక్కువ ధరలో బుక్ చేసుకోవచ్చు..
ఈ బైక్ వివిధ రంగు ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అవి మిడ్‌నైట్ బ్లూ, ఫైరీ రెడ్, గ్లోసీ బ్లాక్, వెనమ్ గ్రీన్ మిస్టీ గ్రేలలో అందుబాటులో ఉండనుంది. అదనంగా, వాడర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 18 లీటర్ల కెపాసిటీ గల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. దీని ప్రారంభంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో స్కూటర్ల సందడి కొంతమేర తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇరక ఈ ఒడిస్సీ వాడేర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర గురించి విషయానికి వస్తే, ఇది అహ్మదాబాద్‌లో రూ.1.09 లక్షల ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది (ఎక్స్-షోరూమ్ FAME II, సబ్సిడీతో సహా) కలుపుకుని ఈ ధర ఉంది. దేశవ్యాప్తంగా దీని ధర రూ.1.29 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన బుకింగ్ లను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు కేవలం రూ.999 చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవచ్చు. జూలై నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 31, 2023, 19:06 [IST]
English summary
New odysse vedar electric bike launched at 1 09 lakhs full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+