బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..
రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో ఒక ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్. ఈ క్రమంలో ఈ ఏడాది యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త న్యూ-జెన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని నేడు సంస్థ నేడు లాంచ్ చేసింది. ఈ మోడల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
2023 బుల్లెట్ 350 డిజైన్ పరంగా పాత మోడల్‌నే పోలి ఉన్నట్టు అనిపించినా, కొత్త బైక్‌లో కంపెనీ చాలా మార్పులే చేసింది. ముఖ్యంగా ఈ మోడల్‌ను J-ప్లాట్‌ఫామ్‌పై రాయల్ ఎన్‌ఫీల్డ్ రూపొందించింది. క్లాసిక్ 350, హంటర్ 350, మిటియర్ 350 వంటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌ను కూడా ఇదే ప్లాట్ఫామ్లో సంస్థ రూపొందిస్తోంది.

ఇక ఈ 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350లో ఇంజిన్‌ను పరిశీలిస్తే ఇందులో అదే ఎయిర్-కూల్డ్ 349cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 20 hp వద్ద 27 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త బుల్లెట్‌లో 5 స్పీడ్ గేర్ బాక్స్ జతచేయబడింది. ఈ ఇంజిన్‌ను సవరించారు.
ఇక సస్పెన్షన్ విషయానికొస్తే ఇందులో ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో ట్విన్ గ్యాస్- ఛార్జ్డ్ షాక్ అబ్సార్బర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక బ్రేకింగ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే, దీనికి ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. అలాగే డిస్క్ మరియు డ్రమ్ సెటప్ వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ సంప్రదాయ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది సింగిల్-పీస్ సీటు మరియు వృత్తాకార హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లతో ఉంది. కానీ చిన్న హుడ్ లేదు. బుల్లెట్ 350కి 300mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది. హై-స్పెక్ వెర్షన్లు 270mm వెనుక డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో టెయిల్-ల్యాంప్ హౌసింగ్ కూడా విభిన్నంగా ఉంటుంది. అయితే టెయిల్-ల్యాంప్ కూడా క్లాసిక్ లాగానే ఉంటుంది.
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ బుకింగ్‌లను సంస్థ ప్రారంభించింది. ఈ బైక్ ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది. బుల్లెట్ 350 బైక్ మిలిటరీ రెడ్ అండ్ బ్లాక్, స్టాండర్డ్ మెరూన్ అండ్ బ్లాక్, బ్లాక్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ ప్రారంభ ధర రూ.1.73 లక్షలుగా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 1.97 లక్షలు కాగా, టాప్-స్పెక్ బ్లాక్ గోల్డ్ వేరియంట్ ధర రూ. 2.16 లక్షలు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్. బుల్లెట్ 350 అనేది ఒక ఐకానిక్ రెట్రో బైక్. దీని డిజైన్ చూసే చాలా మంది కొంటూ ఉంటారు.
ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై బుల్లెట్ 350 బ్యాడ్జ్ ఉన్నాయి. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ క్లాసిక్ 350తో భాగస్వామ్యం చేయబడింది. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్, సర్వీస్ అలర్ట్, ఓడోమీటర్, ఎకో ఇండికేటర్ మరియు ఫ్యూయల్ గేజ్, చిన్న డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

కొత్త బుల్లెట్ 350 బైక్ బరువు 195 కిలోలు. ఇది మునుపటి మోడల్ యొక్క ఎలక్ట్రిక్-స్టార్ట్ వెర్షన్ కంటే దాదాపు నాలుగు కిలోల బరువు ఉంటుంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ మరియు సీటు ఎత్తు 805 మిమీ. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లుగా కంపెనీ తెలిపింది.



Click it and Unblock the Notifications








