పెట్రోల్ తో పాటు కరెంట్ తో నడిచే "హైబ్రిడ్ స్కూటర్".. మీ పాత స్కూటీలను ఈజీగా మార్చుకోవచ్చు..!!

దేశంలో రోజు రోజుకూ చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారులు చూస్తున్నారు. ప్రస్తుతం కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు దేశంలో పుట్టుకొస్తున్నాయి. అందుకు భిన్నంగా పెట్రోల్ తో పాటు కరెంట్ తో నడిచే అత్యాధునిక స్కూటర్స్ మార్కెట్ లోకి రానున్నాయి ఆ వివరాలు మీకోసం..

బెంగళూరుకు చెందిన గ్రీన్ టైగర్ మొబిలిటీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ (ఆటోమొబైల్ మాన్ ఫాక్చరింగ్) పెట్రోల్ & ఎలక్ట్రిక్ తో నడిచే బైక్స్ ను ప్రవేశ పెట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా రెండింటితో పెట్రోల్+ఎలక్ట్రిక్ తో నడిచే హైబ్రిడ్ స్కూటర్ గా ఈ స్కూటర్స్ చరిత్ర సృష్టించనున్నాయి. 125ccలో వస్తున్న ఈ స్కూటర్స్ ఇప్పటికే ARAI & RTO ఆమోదం పొందింది.

గ్రీన్ టైగర్ మొబిలిటీ

గరిష్టంగా 60 కి.మీ. వేగంతో..

ఇప్పటికే అందుబాటులో ఉన్న స్కూటర్‌లకు, మోటార్ సైకిళ్లకు డ్యూయల్ పవర్‌ట్రెయిన్ ఇంజన్లను ఈ కంపెనీ అమర్చింది. మార్చబడిన వాహనాలలో (ఇప్పటికే ఉన్న) ICE పవర్‌ట్రెయిన్, ఎలక్ట్రిక్ కిట్ లు రెండూ ఉంటాయి. రైడర్ తమకు నచ్చినట్లు ఎలక్ట్రిక్ & పెట్రోల్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. ఎలక్ట్రిక్, పెట్రోల్ మోడ్ లో గరిష్టంగా 60 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు.

గ్రీన్ టైగర్ ద్వారా మార్చబడిన వాహనాలు సాధారణ హైబ్రిడ్ 2-వీలర్ల కంటే భిన్నంగా ఉండనున్నాయి. ICE, ఎలక్ట్రిక్ ఇంజిన్‌లు ఒకదానికొకటి విడివిడిగా ఉంటాయి. అయితే వాహనం ఏదైనా ఒక మోడ్‌లో ఉంచినట్లైతే ఆ ఇంజన్ లేదా మోటార్ పనిచేస్తుంది. రైడర్ సులభంగా ఇతర మోడ్‌కి మార్చుకుని తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఇది రైడర్ తనకు అనువైన విధంగా మార్చేలా ఉపయోగ పడనుంది.

గ్రీన్ టైగర్

బోలెడన్నీ ప్రయోజనాలు..

రోజూ ఎక్కువ మొత్తంలో రైడ్ చేసే వ్యక్తులకు ఈ డ్యూయల్-మోడ్ ఫంక్షన్ స్కూటర్ ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాకప్‌గా పెట్రోల్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోడ్‌లో రైడింగ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలతో సవాలుగా ఉన్న రేంజ్ ఆందోళన లేకుండా హాయిగా ప్రయాణించేందుకు ఇది అనుకూలిస్తుంది. ఓ రకంగా ఇలాంటి బైక్స్/స్కూటర్స్ అందుబాటులోకి వస్తే ఎలాంటి భాయాందోళన లేకుండా ఎంత దూరమైన ప్రయాణించవచ్చు.

లోపల ఉండే ఎలక్ట్రిక్ కిట్ వివిధ భాగాలను కలిగి ఉంటుంది. వీటిలో ప్రధాన భాగాలలో ఇంట్లో ఛార్జ్ చేసే విధంగా అలానే తొలగించే బ్యాటరీని పొందవచ్చు. వాటర్ & డస్ట్ ప్రూఫ్ IP67 రేటెడ్ హబ్ మోటార్ ఉంటుంది. VCU పరికరంతో పనిచేసే IoT & సిమ్ ఈ వాహనాన్ని స్మార్ట్‌గా, సురక్షితంగా ఉంచుతుంది.

గ్రీన్ టైగర్ బైక్స్

మీ పాత స్కూటీని కూడా మార్చకోవచ్చు..

ప్రస్తుతం ఈ కంపెనీ 7 ప్రధాన బ్రాండ్‌ల స్కూటర్‌లను మారుస్తోంది. అందులో హోండా యాక్టివా & డియో, హీరో మాస్ట్రో & ప్లెజర్, TVS వెగో & జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి పేరొందిన హెహికిల్స్ ఉన్నాయి. 2012న లేదా ఆ తర్వాత రిజిస్టర్ చేయబడిన వాహనాల్లో వీటిని పొందుపరచనుంది. మోటార్‌సైకిల్ మార్పిడి టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో పూర్తి స్థాయిలో ప్రారంభించబడే అవకాశం ఉంది.

డ్యూయల్ పవర్‌ట్రెయిన్ మార్పిడికి రూ. 65000 అదనంగా పన్ను ఉంటుందని సంస్థ తెలిపింది. ఇది ఎలక్ట్రిక్ కిట్, బ్యాటరీ మొత్తం మార్పిడి తదితర ఖర్చుల్నీ దీని కిందకే రానున్నాయని తెలిపింది. రోజుకు 35 కి.మీలు ప్రయాణించడం ద్వారా పెట్రోల్ కు అయ్యే ఖర్చుపై ప్రతి సంవత్సరం రూ. 65000 వరకు మీరు ఆదా చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.

మార్చబడిన వాహనాన్ని రెండు మోడ్‌లలో మొబైల్ యాప్‌ని ఉపయోగించి ట్రాక్ చేయవచ్చు. స్కూటర్ పనితీరును మొత్త యాప్ నుంచే నిర్వహించవచ్చు. వాహనాన్ని లాక్ చేసి, దొంగతనం జరిగినప్పుడు అలారం మోగేలా అలర్ట్ చేస్తుంది. యాప్ నుంచి ట్రిగ్గర్ చేసే థెఫ్ట్-ప్రొటెక్షన్ తో పాటు ఇతర ప్రయోజనాలతోపాటు, ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సందేశాలను పంపే విధంగా వీటిని రూపొందించారు.

More from DriveSpark

Article Published On: Saturday, March 18, 2023, 11:53 [IST]
English summary
Now convert your two wheeler into a hybrid vehicle petrol plus electric with green tiger mobility
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+