ఈ స్కూటర్ కొంటే థాయిలాండ్ టూర్ ఫ్రీ.. లేకుంటే 5 వేల బోనస్..!

కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ఉందా.. అలాంటి వారికి ఓ సంస్థ సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఆ కంపెనీ స్కూటర్ ని మీరు కొంటే ఏకంగా విదేశాలకు వెళ్లొచ్చు. అవును మీరు విన్నది నిజమే ఆ స్కూటర్ ని కొనుగోలు చేస్తే పలు రకాల సూపర్ డూపర్ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ఇదే సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి ఆ స్కూటర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఒకాయ(Okaya) తాజాగా ఊహించని ఆఫర్లను అందుబాటులో తెచ్చింది. కచ్చితమైన క్యాష్‌బ్యాక్ ను సంస్థ అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ. 5 వేల క్యాష్‌బ్యాక్‌తో సహా వివిధ బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది.

ఒకాయ

నాలుగు రోజుల టూర్ ఉచితం..

అలానే ఎవరైనా లక్కీ విన్నర్ థాయిలాండ్‌ లో మూడు-రాత్రులు, మొత్తం నాలుగు రోజుల పర్యటన పొందే అవకాశాన్ని ఆఫర్ చేసింది. కార్నివాల్ ఆఫర్ బ్రాండ్ నుంచి అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. నాలుగు రోజుల టూర్ లో అన్ని రకాల బెనిఫిట్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. మరెందుకు ఆలస్యం ఆ ఛాన్స్ మీకే రావచ్చు..

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్నివాల్‌లో ఒకాయా బ్రాండ్‌ కు చెందిన ఏదైనా డీలర్ నుంచి లేదా షోరూమ్ లో ఈ సూపర్ డూపర్ స్కూటర్స్ ని కొనుగోలు చేసిన వినియోగదారులు దీనికి అర్హులని ఒకాయ చెప్పింది. కొనుగోలు పూర్తయిన తర్వాత, కొనుగోలుదారు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ లో లింక్‌ ను పొందుతారని వివరించింది. అనంతరం అవసరమైన వివరాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. అనంతరం కంపెనీ తీసే స్క్రాచ్ కార్డ్‌ లో విజేతను ప్రకటించే అవకాశం ఉంది.

ఒకాయ ఫాస్ట్ ఎఫ్4

అదిరే కలర్లలో సరికొత్తగా..

లో-స్పీడ్, హై-స్పీడ్ లలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఒకాయ అందిస్తుంది. వీటిలో Faast F4, Faast F3, Faast F2F, ClassIQ+, Freedum, Faast F2B వంటి మోడల్‌లు ఉన్నాయి. మొత్తం ఆరు కలర్లలో ఈ స్కూటర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సియాన్, మ్యాట్ గ్రీన్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్ కలర్లుగా ఉన్నాయి.

కంపెనీ నుంచి తాజాగా వచ్చిన ఒకాయ ఫాస్ట్ 2 ఫాస్ట్ ధర ₹84,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. విద్యార్ధులు, యువకులు, గృహిణీలను లక్ష్యంగా పెట్టుకుని అనుగుణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ రూపకల్పన చేసినట్లు సంస్థ తెలిపింది. ఒక్కసారి ఛార్జింగ్‌పై దాదాపు 70-80 కిలోమీటర్ల రేంజ్ ను ఈ స్కూటర్ అందించనుంది. లోడ్ తో ఉన్నప్పుడు గరిష్టంగా 55 కిమీ/గం వేగంతో ఇది ప్రయాణించనుంది.

ఒకాయ మార్చ్ ఆఫర్స్

అడ్వాన్స్డ్ టెక్నాలజీతో..

Okaya Faast F2Fలో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ రియర్ షాక్ అబ్జార్బర్స్‌ అమర్చబడి ఉన్నాయి. ఇది రిమోట్ 'కీ', డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, DRL హెడ్‌ ల్యాంప్‌ లు, ఎడ్జీ టెయిల్‌ ల్యాంప్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ ఈ ఆధునిక స్కూటర్లలో అందుబాటులో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 550 కంటే ఎక్కువ అవుట్‌లెట్లలో ఒకాయ ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ 800W-BLDC-హబ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 60V36Ah (2.2 kWh) లిథియం అయాన్ - LFP బ్యాటరీతో జత చేయబడింది. బ్యాటరీ మోటారుపై రెండు సంవత్సరాల వారంటీని ఒకాయ కల్పించనుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 13, 2023, 21:28 [IST]
English summary
Okaya ev scooters offering five thousand cash back offer and thailand tour on carnival festival
Read more on: #ఒకాయ #okaya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+