ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి!
భారత్‌లో పండుగల సీజన్‌లో అధికంగా వాహన విక్రయాలు జరుగుతుంటాయి. అందుకే వాహనాల తయారీ సంస్థలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటాయి. తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆఫర్లు ప్రకటించాయి.
ఈ సంవత్సరంలో పండుగ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఉత్తమ ఆఫర్లు ప్రకటించింది. ఓలా ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.24,500 వరకు కొనుగోలు ప్రయోజనాలు పొందవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఓలా.. S1X, S1 ఎయిర్, S1 Pro వాహనాలున్నాయి.

ఓలా S1 ప్రో జెన్ 2 స్కూటర్‌పై రూ.7000 విలువైన ఐదు సంవత్సరాల బ్యాటరీ వారంటీని పొందవచ్చు. మరియు ఓలా S1 ఎయిర్ వారంటీ పెంపుదలపై 50 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు పాత పెట్రోల్ స్కూటర్ల ఎక్స్చేంజీ చేసుకోవడం ద్వారా రూ.10,000 ఆదా చేయవచ్చని ఓలా తెలిపింది. అయితే ఆ స్కూటర్లను సంస్థ తనిఖీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసినట్లయితే EMI ఆఫర్‌పైన రూ.7500 విలువైన ప్రయోజనాలు అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు 5.99 శాతం వడ్డీ రేట్లు ఉంటుందని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత రిఫరల్ సిస్టమ్ కింద రూ.1000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని తెలిపింది. దీంతోపాటు రిఫరర్ ఓలా కేర్+ మరియు రూ.2000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చని పేర్కొంది.

ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో భాగంగా ఏథర్ ఎనర్జీ ఆకట్టుకొనే ఆఫర్లను ప్రకటించింది. 450S, 450S 2.9kWh మరియు 450X 3.7kWh వాహనాలపై డీల్స్‌ను ప్రకటించింది. 450S ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.5000 తగ్గింపును ఇస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు కార్పొరేట్ ఆఫర్ కింద రూ.1500 తగ్గింపును పొందవచ్చు. అలాగే, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.40000 వరకు పొందవచ్చని ఏథర్ తెలిపింది. ప్రస్తుతం ఏథర్ 450S స్కూటర్ రూ.86,050 (ఎక్స్‌షోరూం) గా ఉంది.
మిడ్ రేంజ్ 450X 2.9kWh స్కూటర్‌పై కార్పొరేట్ బోనస్ కింద రూ.1500 పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ బోనస్ కింద రూ.40000 వరకు పొందవచ్చు. అన్ని ఆఫర్లతో ఈ స్కూటర్‌ను రూ.1,01,050కు కొనుగోలు చేయవచ్చు. అదే 450X 3.7 kWh స్కూటర్‌పైన కార్పొరేట్ బోనస్ కింద రూ.1500 తగ్గనుంది. మరియు మిగిలిన అన్ని ఆఫర్లతో కలిపి ఈ స్కూటర్ రూ.1,10,249కు సొంతం చేసుకోవచ్చు.

పండుగ సీజర్ సందర్భంగా iVOOMi ఎనర్జీ jeetX, S1 ఎలక్ట్రిక్ స్కూటర్లను రూ.91,999 మరియు రూ.81,999 ధరకు అందిస్తుంది. దీంతోపాటు ప్రతి కొనుగోలుపై రూ.10,000 విలువైన అదనపు ప్రయోజనాలు అందిస్తుంది. దీంతోపాటు రవాణా కార్యాలయ ఛార్జీలను కూడా చెల్లిస్తామని iVOOMi వెల్లడించింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








