Ola S1 Air జూలై నుంచి ఓలా ఎస్ 1 ఎయిర్ డెలివరీలు.. తక్కువ ధరలో ఎక్కువ లాభాలు
దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు తమదైన ముద్ర వేస్తున్నాయి. మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఈవీ శ్రేణిలో నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఓలా సీఈఓ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే..
ఓలా నుంచి త్వరలో అత్యంత చవకైన మోడల్ 'ఎస్ 1 ఎయిర్' స్కూటర్ ప్రారంభం కానున్నట్లు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ఓలా S1 ఎయిర్(Ola S1 Air) డెలివరీలు జూలై నుంచి ప్రారంభం కానున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఓ టీజర్‌ను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఎస్ 1 కు సంబంధించి ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ఓలా ఎస్ 1 ఎయిర్ టెస్ట్ రైడ్లు, డెలివరీలు జూలై నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఓలా సీఈఓ ప్రత్యేక టీజర్ విడుదల చేశారు. తమ మొదటి ఓలా ఎస్ 1 వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేశామని.. వినియోగదారులకు జూలై నుంచి అందుబాటులోకి రానుందని ట్వీట్ చేశారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్ 1 స్కూటర్ కంటే ఎస్ 1 ఎయిర్ చాలా తక్కువ ధరకే లభిస్తుందని ప్రకటించారు.
ఓలా ఎస్ 1 ఎయిర్ తమ కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ వాహనమని సీఈఓ పేర్కొన్నారు. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. మూడు బ్యాటరీ ప్యాక్ 2kwh, 3kwh, 4kwh ఆప్షన్లతో అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు. వాటి రేంజ్‌ను బట్టి ధరలు ఉంటాయని వెల్లడించారు.
2kWh బ్యాటరీ ప్యాక్ మరియు 4.5kW మోటార్‌తో కూడిన ఓలా S1 ఎయిర్ స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 85 కి.మీ ప్రయాణిస్తుంది. 85 కి.మీ రేంజ్‌తో ఈవీ అందుబాటులోకి రానుంది. ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ ధర ఎక్స్ షోరూమ్‌లో రూ.84,999గా ఉంది.
మరో వేరియంట్‌లో S1 ఎయిర్ స్కూటర్, 3kWh బ్యాటరీ ప్యాక్ మరియు 4.5kW మోటార్ కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 125 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. గరిష్ఠంగా గంటకు 85 km వేగంతో ప్రయాణిస్తుంది. రూ.99,999 ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంటుంది.
మూడో వేరియంట్ పెద్ద 4kWh బ్యాటరీ ప్యాక్, 4.5 kW మోటార్‌తో వస్తుంది. గంటకు 85 km గరిష్ట వేగం, 165 కిమీ రేంజ్‌ను కలిగి ఉంది. ఎక్స్ షోరూమ్‌లో రూ.1,09,999 ధరతో అందుబాటులో ఉంది. వీటన్నింటికీ ఎకో, స్పోర్ట్స్ మరియు రివర్స్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది కేవలం 4.3 సెకన్లలో 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
ఓలా S1 ఎయిర్ అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా, స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేయబడిన 7 అంగుళాల TFT స్క్రీన్, GPS, మ్యూజిక్ ప్లేబ్యాక్, సైడ్ స్టాండ్ అలర్ట్, రివర్స్ మోడ్, రిమోట్ బూట్ లాక్/అన్‌లాక్ వంటి అనేక ఫీచర్లతో రానుంది. ఇక కలర్స్ విషయానికొస్తే కోరల్ గ్లామ్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్‌తో సహా వివిధ రంగులలో అందుబాటులో ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








