భారత్ మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ డిజైన్, లైట్ వెయిట్ సహా 221 కి.మీ రేంజ్!
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా బెంగళూరు వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న Orxa ఎనర్జీస్ సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ మాంటిస్‌ను (Mantis) విడుదల చేసింది.
ఈ మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ 11.5 కిలోల బరువు ఉండే లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ మోటార్ 93Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 8.9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీంతోపాటు ఈ బైక్ గరిష్ఠ వేగం 135 కి.మీలుగా తెలుస్తోంది.

Orxa ఎనర్జీస్ బైక్ 8.9 kWh సూపర్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ 5-8 సంవత్సరాల వరకు పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. 1.3kW ఛార్జర్ ద్వారా కేవలం 5 గంటల్లో 0-80 శాతం ఛార్జింగ్ చేయవచ్చని తెలుస్తోంది. 3.3kW ఛార్జింగ్ పాయింట్‌ను ఉపయోగించడం వల్ల కేవలం 2.5 గంటల్లో 0-80 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. సింగిల్ ఛార్జింగ్‌తో 221 కి.మీ రేంజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది.
ఎలక్ట్రిక్ బైక్‌ను స్పోర్టీ మోడల్‌ను కలిగి ఉంది. మరియు లైట్ వెయిట్ బైక్‌గా ఉంది.. అంటే ఈ బైక్ బరువు 182 కిలోలు మాత్రమే ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను విమానాల తయారీలో వినియోగించే అల్యూమినియంతో తయారు చేశారు. ఈ కారణంగా బైక్ తక్కువ బరువును కలిగి ఉంది. 8 సంవత్సరాల కృషి ఫలితంగా ఈ బైక్‌ను సిద్ధం చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ బైక్‌ను అత్యత్తమంగా తయారుచేసినట్లు పేర్కొంది.

తొలి 1000 మంది కస్టమర్లు : Orxa ఎనర్జీస్ సంస్థ విడుదల చేసిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మాంటిస్ ధర రూ.3.6 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ బైక్‌ను తొలి 1000 మంది రూ.10 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని, అనంతరం రూ.25 వేలు చెల్లించి బుకింగ్‌లు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
తొలిదశలో బెంగళూరులో డెలివరీలు ప్రారంభం : వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని Orxa ఎనర్జీస్ సంస్థ వెల్లడించింది. తొలి దశలో బెంగళూరులో డెలివరీలు ప్రారంభం అవుతాయని, అనంతరం భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో డెలివరీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
భారత్‌లో గతంలో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్‌లో ఈ వాహనాల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రధాన నగరాలు సహా పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








