ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400X ప్రీ బుకింగ్‌లు ప్రారంభం
బ్రిటీష్ మోటార్ సైకిల్ తయారీదారు ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400X వాహనాల ప్రీ బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ రెండు బైక్‌లను లండన్‌లో మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. భారత్‌లో జులై 5న పూణేలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ రెండు బైక్‌లు ట్రయంఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేయబడ్డాయి. బజాజ్ - ట్రయంఫ్ భాగస్వామ్యంతో ఈ వాహనాలను లాంచ్ చేశారు.
ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400X వాహనాలను కేవలం 2000 రూపాయలు చెల్లించి ప్రీ బుక్ చేయవచ్చు. ఈ రెండు బైక్‌లను మహారాష్ట్రలోని బజాజ్ తయారీ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. లాంచ్ సమయంలో రెండు వాహనాల ధరలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ రెండు బైక్‌ల ధరలు రూ.2.5లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400X రెండూ ఒకే తరహా ఫ్రేమ్, ఇంజిన్లను కలిగి ఉంటాయి. అయితే రెండు బైక్స్‌లో కొంచెం భిన్నమైన వీల్స్, సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయి. ట్రయంఫ్ బైక్‌లు 398cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్స్ DOHC ఓవర్‌స్క్వేర్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి.
ఈ ఇంజిన్ 8000 rpm వద్ద 39.5bhp మరియు 6500 rpm వద్ద 37.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400X బైక్‌లు స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటాయి.

ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400X వాహనాలు మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ బైక్‌ల ముందువైపు 43ఎంఎం USD పిస్టన్ ఫోర్క్‌తో కూడిన సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అలాగే గ్యాస్ ఛార్జడ్ మోనోషాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. అయితే ఈ రెండు ద్విచక్రవాహనాల్లో సస్పెన్షన్ వ్యవస్థ భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది.
ట్రయంఫ్ కొత్త బైక్‌లు ట్యూబులర్ పెరీమీటర్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్నాయి. రెండు బైక్‌లు ట్విన్ కాస్ట్ అల్యూమినియం స్వింగార్మ్‌తో వస్తాయి. ఈ ఫేమ్‌లు కారణంగా ఈ రెండు వాహనాలు తక్కువ బరువును కలిగి ఉంటాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ బరువు 170కేజీలు ఉండగా.. స్క్రాంబ్లర్ 400X బరువు 179 కేజీలు మాత్రమే ఉంటుంది.

ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ మరియు స్క్రాంబ్లర్ 400X రెండు ద్విచక్రవాహనాలు వెనుకవైపు ప్లోటింగ్ కాలిపర్లతో కూడిన 230mm ఫిక్సిడ్ డిస్క్ బ్రేకులకు కలిగి ఉన్నాయి. మరియు 4 పిస్టన్ కాలిపర్‌తో కూడిన డ్యూయల్ ఛానల్ ABS (యాంటీ బ్రేకింగ్ సిస్టమ్) సపోర్టును ముందు టైర్లు కలిగి ఉంటాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ఫ్రంట్ డిస్క్ 300ఎంఎం, స్క్రాంబ్లర్ 400X 320ఎంఎం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








