ప్యూర్ EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ecoDryft 350 లాంచ్.. 171 కి.మీ రేంజ్, అద్భుతమైన ఫీచర్లు
భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో మరో కొత్త బైక్ వచ్చి చేరింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ Pure EV సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఎకోడ్రిఫ్ట్ 350(ecoDryft 350) పేరిట ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌కు సంబంధించి రేంజ్, డిజైన్, ఫీచర్లు ఈ కథనంలో..
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల హవా పెరిగింది. ఈవీ సెగ్మెంట్లో స్టార్టప్‌లతో పాటు టాప్ ఆటో మొబైల్ కంపెనీలు కూడా తమ సత్తాను చాటుతున్నాయి. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వినూత్నమైన డిజైన్, అదిరిపోయే ఫీచర్లు, అధిక రేంజ్‌తో వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లే కాకుండా ఎలక్ట్రిక్ బైక్‌లు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.

ఈ క్రమంలో ప్యూర్ ఈవీ నుంచి లాంచ్ అయిన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ఎకోడ్రిఫ్ట్ 350 ధర రూ. 1.30 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఈ బైక్ 110 సీసీ ఇంజిన్‌తో పనిచేసే మోటార్‌సైకిళ్లతో పాటు ఈ సెగ్మెంట్‌లోని ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ ఈవీలకు గట్టి పోటీనిస్తుంది. ఈ బైక్ పూర్తి ఛార్జ్‌పై 171 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని సంస్థ తెలిపింది.
రోజువారీ ప్రయాణించే రైడర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎకోడ్రిఫ్ట్ 350ను ప్రవేశపెట్టినట్లు ప్యూర్ ఈవీ స్పష్టం చేసింది. ఇతర 110 సీసీ ICE బైక్‌లతో పోలిస్తే ఈ బైక్ వినియోగంతో గరిష్ఠంగా కస్టమర్లు రూ. 7000 పొదుపు చేసుకోవచ్చని ప్యూర్ ఈవీ పేర్కొంది. ఇందులో 3.5 kwh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ బైక్ 6 MCU లతో 3kw ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తినిస్తుంది.

కొత్త ప్యూర్ EV ecoDryft 350 40 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా 75 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. కాగా ఈ బైక్ రైడర్ అవసరాలకు అనుగుణంగా మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. రైడ్ చేసేటప్పుడు రైడర్లు తమకు నచ్చిన మోడ్‌ను సెలెక్ట్ చేసుకుని ప్రయాణించవచ్చు.
ప్యూర్ EV ecoDryft 350 రివర్స్ మోడ్, కోస్టింగ్ రీజెన్, హిల్ స్టార్ట్ అసిస్ట్ టు డౌన్ హిల్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇందులో స్మార్ట్ AI, స్టేట్ ఆఫ్ ఛార్జ్, స్టేట్ ఆఫ్ హెల్త్ ఫీచర్ల ద్వారా బ్యాటరీ జీవితకాలాన్ని తెలుసుకోవచ్చు. ఈ బైక్ మార్కెట్లో హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ ప్లాటినాలకు పోటీ ఇవ్వనుంది.

కొత్త ఎకోడ్రిఫ్ట్ 350 లాంచ్‌పై ప్యూర్ EV కో ఫౌండర్, సీఈవో రోహిత్ వదేరా మాట్లాడారు. దేశంలోని ప్రజలకు ప్రాక్టికల్, స్థిరమైన మొబిలిటీ పరిష్కారాలను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు రోహిత్ వదేరా పేర్కొన్నారు. ఎకోడ్రిఫ్ట్ 350 బైక్ ద్వారా కస్టమర్లలో తమపై నమ్మకం నిలబెట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ బైక్‌ను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
భవిష్యత్తులో Pure EV నుంచి సరికొత్త ఫీచర్లతో మరిన్ని దీర్ఘ- శ్రేణి వాహనాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రోహిత్ పేర్కొన్నారు. కాగా ప్యూర్ ఈవీ నుంచి ఇప్పటికే Epluto 7G, Epluto 7G Max, Epluto 7G Pro, బైక్‌లు విడుదలయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లన్నీ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications








