ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే

రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతున్న సమయంలో ప్యూర్ EV కొత్త ఎలక్ట్రిక్ బైకుని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ బైక్ పేరు 'ప్యూర్ ఈవి ఎకోడ్రైఫ్ట్' (PURE EV ecoDryft). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్యూర్ ఈవి ఎకోడ్రైఫ్ట్ ధర దేశీయ మార్కెట్లో (ఢిల్లీలో) రూ. 99,999 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు మీద సబ్సిడీ కూడా అందుబాటులో ఉంటుంది, కావున ఈ సబ్సిడీ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే పాన్ ఇండియా ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.15 వరకు ఉంటుంది. సబ్సిడీ తరువాత ఈ బైక్ తక్కువ ధరకే లభిస్తుంది. కావున దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన ఎలక్ట్రిక్ బైకుల జాబితాలో ఇది కూడా ఒకటిగా మారింది.

ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ ecoDryft

ఎకోడ్రైఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి బ్లాక్, గ్రే, బ్లూ మరియు రెడ్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ హైదరాబాద్‌లోని PURE EV తయారీ కేంద్రంలో రూపొందించబడుతుంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. కావున డెలివరీలు మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

ecoDryft ఎలక్ట్రిక్ బైక్ AIS 156 సర్టిఫైడ్ 3.0 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గంటకు 75 కిమీ వర్గంతో ఏకంగా 130 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని బ్యాటరీ 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటరుకి సపోర్ట్ చేస్తుంది. కావున పనితీరు ఉత్తమంగా ఉంటుంది. కావున ఈ బైక్ రోజువారీ వినియోగానికి మరియు నగర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ ecoDryft

ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక సారి పుల్ ఛార్జ్ చేసుకోవడానికి 6 గంటల సమయం పడుతుంది. అయితే 3 గంటల సమయంలో ఇది 20 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో 'ఎకోడ్రైఫ్ట్' డ్రైవ్, క్రాస్ ఓవర్ మరియు థ్రిల్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులోని డ్రైవ్ మోడ్ ద్వారా గంటకు 45 కిమీ వేగంతో ముందుకు సాగవచ్చు. క్రాస్ ఓవర్ మోడ్ గంటకు 60 కిమీ వేగంతో మరియు థ్రిల్ మోడ్ గంటకు 75 కిమీ వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తుంది.

ఎకోడ్రైఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే 10 సెకన్లలో గంటకు 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి ఒక కమ్యూటర్ బైక్ మాదిరిగా ఉంటుంది. అయితే ఇంజిన్ ప్రాంతం మాత్రం ఒక పెద్ద బ్యాటరీతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. కావున ఇది ఇంజిన్ ప్రాంతల్లో కవర్ చేయబడి ఉంటుంది.

ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ ecoDryft

ఈ బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో కంట్రోలర్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఈ బైక్ 18 ఇంచెస్ ఫ్రంట్ వీల్ మరియు 17 ఇంచెస్ రియర్ వీల్ కలిగి ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకుని కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా విక్రయించడానికి సిద్ధమవుతోంది.

కంపెనీ భవిష్యత్తులో దక్షిణాసియా దేశాలకు, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. అదే సమయంలో తన ఎలక్ట్రిక్ బైకు యొక్క అమ్మకాలను పెంచుకోవడానికి దేశంలో ఉండే ప్రముఖ నగరాల్లో తమ డీలర్‌షిప్‌లను ప్రారంభించడానికి కూడా సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ బైక్ యొక్క డెలివరీలు మార్చి 01 నుంచి ప్రారంభమవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Pure ev ecodryft launched in india price features and range details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X